Tollywood: ఈ మీసాల పిల్ల మాజీ ప్రధాని మనవరాలు.. టాలీవుడ్ ఫేమస్ హీరోయిన్.. ఎవరో గుర్తు పట్టారా?
తెలుగు, తమిళ్, హిందీ భాషల సినిమాల్లో నటించిందీ అందాల తార. స్టార్ హీరోయిన్ గా ఎనలేని క్రేజ్ ను సొంతం చేసుకుంది. అదే సమయంలో లవ్, డేటింగ్ విషయాలతోనూ తరచూ వార్తల్లో నిలిచింది. ప్రస్తుతం ఈ హీరోయిన్ వయసు సుమారు 55 ఏళ్లు. అయినా సింగిల్ గానే లైఫ్ లీడ్ చేస్తోంది.

పై ఫొటోలో ఉన్నదెవరో గుర్తు పట్టారా? ఈ జనరేషన్ వారికి ఈ అందాలతార గురించి పెద్దగా తెలియక పోవచ్చు కానీ 90’s కిడ్స్ కు ఈ బ్యూటీ ఫేవరెట్ హీరోయిన్. ఎక్కువగా హిందీ సినిమాలు చేసినప్పటికీ తెలుగు ఆడియెన్స్ కు ఈ ముద్దుగుమ్మ పరిచయమే. స్టార్ హీరోలతో కలిసి సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. అందం, అభినయంతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అలాగే ఎన్నో నేషనల్, ఇంటర్నేషనల్ అవార్డులు గెల్చుకుంది. సినిమాల సంగతి పక్కన పెడితే.. ఈ ముద్దుగుమ్మకు లవ్ అఫైర్లు, డేటింగు వ్యవహారాలు ఎక్కువే. సినిమాల్లో ఉండగానే స్టార్ హీరోలతో పాటు ప్రముఖ వ్యాపారవేత్తలతోనూ ప్రేమ వ్యవహారాలు కొనసాగించినట్లు ప్రచారంలో ఉంది. వీటిలో ఎంత నిజుముందో తెలియదు కానీ ఏదీ పెళ్లిపీటల దాకా చేరుకోలేదు. చివరకు 2010లో ఒక ప్రముఖ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుందీ ముద్దుగుమ్మ. కానీ ఆ బంధం కూడా ఎక్కువగా నిలవలేదు. పెళ్లైన రెండేళ్లకే విడాకులు తీసుకుని విడిపోయింది. ఇప్పుడీ సొగసరి వయసు సుమారు 55 ఏళ్లు. సింగిల్ గానే లైఫ్ లీడ్ చేస్తోంది.
సినిమాలు, లవ్వులు, డేటింగులతో వార్తల్లో నిలిచిన ఈ ముద్దుగుమ్మ ఓ విషయంలో మాత్రం అందరికీ ఆదర్శమని చెప్పుకోవచ్చు. మరీ ముఖ్యంగా అమ్మాయిల విషయంలో కొన్నేళ్ల క్రితం ప్రమాదకర క్యాన్సర్ బారిన పడిందీ అందాల తార. అది కూడా నాలుగు పదుల వయసులో. మామూలుగానే క్యాన్సర్ అంటేనే చాలా మంది భయపడిపోతారు. కానీ ఈ బ్యూటీ 40 ప్లస్ లోనూ క్యాన్సర్ తో పోరాడి విజయం సాధించింది. తన లాంటి ఎంతో మంది మహిళలకు ఆదర్శంగా నిలిచింది. ఈ పాటికే అర్థమై ఉంటుంది మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో? యస్. ఆ మీసాల పిల్ల మరెవరో కాదు మనీషా కొయిరాలా.
మనీషా కొయిరాలా లేటెస్ట్ ఫొటోస్..
View this post on Instagram
కాగా నేపాల్ మాజీ ప్రధాని బిశ్వేశ్వర్ ప్రసాద్ కొయిరాలా మనవరాలే మనీషా కొయిరాల. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటోన్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కొన్ని ఇంట్రెస్టింగ్ ఫొటోలను షేర్ చేసింది. అందులో అందులో గుబురు మీసం, పెద్ద బొట్టు, భారీ అలంకరణతో ఠీవీగా కనిపిస్తోంది. దీనిని చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. మనీషాలో చిన్నప్పటి నుంచే యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయని కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. ఇక మనీషా చివరిగా ‘హీరామండి: ది డైమండ్ బజార్’ అనే వెబ్ సిరీస్‌లో యాక్ట్ చేసింది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




