AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

The Raja Saab: ‘ది రాజాసాబ్’ రీ వెర్షన్‌కు సూపర్బ్ రెస్పాన్స్.. 4 రోజుల్లో ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందో తెలుసా?

ప్రభాస్ నటించిన 'ది రాజాసాబ్' సినిమాకు మిక్స్ డ్ టాక్ వచ్చినా కలెక్షన్ల హోరు మాత్రం తగ్గడం లేదు. ముఖ్యంగా రీ వెర్షన్ రిలీజయ్యాక ఈ మూవీ కలెక్షన్లు మరింత పెరిగాయి. తాజాగా ది రాజాసాబ్ సినిమా రూ. 200 కోట్ల క్లబ్ లో చేరింది.

The Raja Saab: 'ది రాజాసాబ్' రీ వెర్షన్‌కు సూపర్బ్ రెస్పాన్స్.. 4 రోజుల్లో ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందో తెలుసా?
Prabhas The Raja Saab Movie
Basha Shek
|

Updated on: Jan 13, 2026 | 3:40 PM

Share

పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ సినిమా ది రాజాసాబ్. మారుతి తెరకెక్కించిన ఈ ఫాంటసీ హారర్ కామెడీ థ్రిల్లర్ సంక్రాంతి కానుకగా జనవరి 09న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే మొదటి షో నుంచే ఈ మూవీకి మిక్స్ డ్ టాక్ వచ్చింది. ప్రభాస్ రేంజ్ సినిమా కాదని నెగెటివ్ కామెంట్స్ వినిపించాయి. చాలా మంది ప్రభాస్ అభిమానులే ఈ మూవీపై పెదవి విరిచాడు. అయినా ఈ సినిమాకు మొదటి రోజే కళ్లు చెదిరే కలెక్షన్లు వచ్చాయి. తొలి రోజే రూ. 112 కోట్లు వసూలు చేసి ప్రభాస్ స్టామినాను మరోసారి ప్రూవ్ చేసింది. అయితే సినిమాకు నెగెటివ్ టాక్ రావడంపై స్పందించిన మేకర్స్ కొన్ని అనవసరమైన సన్నివేశాలను కట్ చేశారు. అలాగే ప్రభాస్ ఓల్డ్ లుక్ కు సంబంధించిన సీన్స్ యాడ్ చేశారు. ఇప్పుడిదే ది రాజాసాబ్ సినిమా కలెక్షన్లు అమాంతం పెరగడానికి కారణమని తెలుస్తోంది. తాజాగా ది రాజా సాబ్ నాలుగు రోజుల కలెక్షన్లను అధికారికంగా ప్రకటించారు మేకర్స్.

ది రాజాసాబ్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 201 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లను సాధించినట్లు ఓ పోస్టర్‌ని విడుదల చేశారు. మొత్తానికి మిక్స్ డ్ టాక్ తోనూ ఈ రేంజ్ కలెక్షన్లు రావడం ప్రభాసే కారణమని తెలుస్తోంది. అందులోనూ ఇప్పుడు మన శంకరవరప్రసాద్ లాంటి స్టార్ హీరోల సినిమాలు సంక్రాంతి పోటీలో ఉన్నాయి. అయితే ‘రాజా సాబ్’ హ్యూజ్ కలెక్షన్లు రావడంపై నిర్మాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

కింగ్ సైజ్ బ్లాక్ బస్టర్..

పీపుల్ మీడియా ఫ్యాక్టర్ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ ది రాజాసాబ్ సినిమాను నిర్మించారు. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటించారు. సంజయ్ దత్, సముద్రఖని, జరీనా వాహబ్, సప్తగిరి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

4 రోజుల్లో 'ది రాజాసాబ్' ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందో తెలుసా?
4 రోజుల్లో 'ది రాజాసాబ్' ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందో తెలుసా?
ఐఫోన్ 17ప్రో, ప్రో మాక్స్, ఐఫోన్ ఎయిర్‌పై మొదటిసారి భారీ తగ్గింపు
ఐఫోన్ 17ప్రో, ప్రో మాక్స్, ఐఫోన్ ఎయిర్‌పై మొదటిసారి భారీ తగ్గింపు
లక్కంటే ఇదేనేమో.. లంకబిందెలో దొరికిన నిధి కేసులో ఊహించని ట్విస్ట్
లక్కంటే ఇదేనేమో.. లంకబిందెలో దొరికిన నిధి కేసులో ఊహించని ట్విస్ట్
అదిరిపోయే ఆఫర్‌.. ఒక్క రూపాయికే ఫ్లైట్‌ టిక్కెట్‌!
అదిరిపోయే ఆఫర్‌.. ఒక్క రూపాయికే ఫ్లైట్‌ టిక్కెట్‌!
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో వెదర్ రిపోర్ట్
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో వెదర్ రిపోర్ట్
ఇప్పుడు ఆన్‌లైన్‌లో 10 నిమిషాల డెలివరీ సదుపాయం ఉండదు.. ఎందుకంటే..
ఇప్పుడు ఆన్‌లైన్‌లో 10 నిమిషాల డెలివరీ సదుపాయం ఉండదు.. ఎందుకంటే..
కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి.. పతంజలి శ్వాసరి వటితో మీ..
కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి.. పతంజలి శ్వాసరి వటితో మీ..
IND vs NZ: రెండో వన్డే నుంచి నలుగురు ఔట్..
IND vs NZ: రెండో వన్డే నుంచి నలుగురు ఔట్..
ఒకప్పుడు ఇంగ్లండ్ లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్.. ఇప్పుడు టాలీవుడ్ హీరో
ఒకప్పుడు ఇంగ్లండ్ లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్.. ఇప్పుడు టాలీవుడ్ హీరో
మనిషిలా నడిచే చెట్టు! ప్రకృతి అద్భుతంతో ఆశ్చర్యంలో శాస్త్రవేత్తలు
మనిషిలా నడిచే చెట్టు! ప్రకృతి అద్భుతంతో ఆశ్చర్యంలో శాస్త్రవేత్తలు