Mana Shankara Vara Prasad Garu: ‘హుక్‌స్టెప్’ ఎలా పుట్టిందో తెలుసా? ఆసక్తికర విషయం చెప్పిన సందీప్ మాస్టర్
మన శంకరవరప్రసాద్ గారు సినిమాలోని హుక్ స్టెప్ సాంగ్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ముఖ్యంగా ఇందులో మెగాస్టార్ చిరంజీవి వేసిన స్టెప్పులు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. అయితే ఈ హుక్ స్టెప్ వెనక ఓ బడా కహానీ ఉందంటున్నాడు కొరియోగ్రాఫర్ సందీప్ మాస్టర్.

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన చిత్రం మన శంకరవరప్రసాద్ గారు. అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ మూవీలో నయనతార కథానాయికగా నటించింది. వెంకటేశ్ కీలక పాత్ర పోషించారు. సంక్రాంతి కానుకగా ఇవాళ (జనవరి 12) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ టాక్‌ను సొంతం చేసుకుంది. చిరంజీవి కామెడీ, డైలాగులు, యాక్షన్ సీక్వెన్సులు, డ్యాన్సులు అద్దిరిపోయాయని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ముఖ్యంగా హుక్ స్టెప్ సాంగ్ కు థియేటర్లు దద్దరిల్లిపోతున్నాయి. ఇందులో చిరంజీవి వేసిన స్టెప్పులు, మూమెంట్స్ కూడా సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా ఈ హుక్ స్టెప్ సాంగ్ ను రీక్రియేట్ చేస్తూ రీల్స్, షార్ట్స్ చేస్తున్నారు. అందుకు సంబంధించిన వీడియోలు కూడా ఇప్పుడు వైరలవుతున్నాయి. ఈ క్రమంలో అసలు ఈ హుక్ స్టెప్ ఐడియా ఎలా వచ్చింది? మెగాస్టార్ ను ఎలా ఒప్పించారు? తదితర విషయాల గురించి ప్రముఖ కొరియోగ్రాఫర్ ‘ఆట’ సందీప్ ఇలా చెప్పుకొచ్చారు.
‘మన అందరికీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రతి నెలా ఈఎంఐలు కట్టాలి. అలా ఈ సాంగ్‌కు స్టెప్స్ కంపోజ్ చేస్తున్న సమయంలో ఈఎంఐలు కట్టాలని గుర్తు చేస్తూ వరుసగా ఫోన్ కాల్స్ వచ్చాయి. సాధారణంగా కంపోజింగ్ సమయంలో నేను ఫోన్ తీసుకెళ్లను. కానీ, ప్రొడక్షన్ హౌస్ నుంచి కాల్ చేస్తామని చెప్పడంతో తప్పనిసరి పరిస్థితుల్లో తీసుకెళ్లాను. సెట్ లోపలికి వెళ్లాక కూడా వరుసగా ఫోన్లు వస్తూనే ఉన్నాయి. కోపం వచ్చి, ఫోన్ పగలకొట్టేద్దామనుకున్నాను. అలా ఫోన్ పట్టుకోగానే తళుక్కున ఒక ఐడియా వచ్చింది. వెంటనే లైట్స్ అన్నీ ఆఫ్ చేసి, కేవలం ఫోన్ లైట్ వేసి ‘హుక్ స్టెప్’ కంపోజ్ చేశాను. అది చూసి నా భార్య కూడా చప్పట్లు కొట్టింది. ఆ తర్వాత అదే స్టెప్ ను డెవలప్ చేశాం. చిరంజీవిగారి గ్రేస్‌ను బట్టి దాన్ని డిజైన్ చేసి ప్రస్తుతం మీరు సినిమాలో చూస్తున్న స్టెప్‌ను ఫైనల్ చేశాం’ అని సందీప్ మాస్టర్ చెప్పుకొచ్చారు.
మన శంకరవర ప్రసాద్ గారు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆట సందీప్
ఇక పై నీ నృత్యం శంఖం లో పోసిన తీర్ధం రావాల్సిన అవకాశం వచ్చేసింది చెయ్యాల్సిన అద్భుతం చేసేసావు ఇక నీ ఆట కి తిరుగు లేదు మరిన్ని మంచి అవకాశాలు వస్తాయి #AataSandeep #MSVPG 🔥 pic.twitter.com/CD83mai5OC
— Sreedhar Adabala 👨💻 (@SreedharAdabala) January 8, 2026
View this post on Instagram
చిరంజీవి హుక్ స్టెప్ సాంగ్ లిరికల్ వీడియో..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




