Sandeep Reddy Vanga: బయట ఎంతో గంభీరంగా కనిపించే సందీప్ రెడ్డి వంగా ఇంట్లో ఎలా ఉంటాడో తెలుసా? వీడియో వైరల్
ప్రస్తుతమున్న డైరెక్టర్లలో డేరింగ్ అండ్ డ్యాషింగ్ ఎవరంటే ఠక్కున గుర్తుకు వచ్చే పేరు సందీప్ రెడ్డి వంగా. ఇతని సినిమాల్లాగానే ఇతను కూడా బయట ఎంతో డేరింగ్ అండ్ డ్యాషింగ్ గా కనిపిస్తాడు. మాటకు మాట.. దెబ్బకు దెబ్బ అనే రీతిలో మాట్లాడుతుంటాడు.

సందీప్ రెడ్డి వంగా.. తీసింది మూడు సినిమాలే అయినా పాన్ ఇండియా డైరెక్టర్ గా దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడీ క్రియేటివ్ డైరెక్టర్. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ సినిమాలతో హీరోలకు మించి అభిమానులను సొంతం చేసుకున్నాడు సందీప్ రెడ్డి. ముఖ్యంగా యానిమల్ సినిమాతో చాలా మందికి ఫేవరెట్ గా మారిపోయాడీ స్టార్ డైరెక్టర్. ప్రస్తుతం పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ తో కలిసి స్పిరిట్ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు సందీప్. సినిమాల సంగతి పక్కన పెడితే.. నిజ జీవితంలోనూ సందీప్ చాలా గంభీరంగా ఉంటాడు. ఎవరైనా విమర్శలు చేస్తే వెంటనే కౌంటర్లు వేస్తుంటాడు. సందర్భమేదైనా మాటకు మాట.. దెబ్బకు దెబ్బ అనే రీతిలో డేరింగ్ అండ్ డ్యాషింగ్ గా మాట్లాడుతుంటాడు. అతని మాటల్లో ఎలాంటి ఫిల్టర్ ఉండదు. ఏదైనా ముక్కు సూటిగా మాట్లాడుతాడు. అందుకే ఇటీవల చాలా మంది హీరోలు, దర్శక నిర్మాతలు తమ సినిమా ప్రమోషన్ల ఇంటర్వ్యూలను సందీప్ రెడ్డి వంగాతోనే నిర్వహిస్తున్నారు. ఇలాంటి డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ అయిన సందీప్ రెడ్డి వంగా కు సంబంధించి గత కొన్ని రోజులుగా ఒక వీడియో నెట్టింట బాగా వైరలవుతోంది.
ఈ వీడియోలో చాలా సింపుల్ గా కనిపిస్తాడు సందీప్ రెడ్డి. అంతే కాదు ఫ్యామిలీ మ్యాన్ లా వంట చేయడం, దుస్తులు ఉతకడం, అంట్లు తోమడం, ఇల్లు శుభ్రంగా ఊడవడం.. తదితర ఇంటి పనులన్నీ ఎంతో శుభ్రంగా చేస్తూ కనిపించాడు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. బయట ఎంతో గంభీరంగా కనిపించే సందీప్ రెడ్డి ఇంట్లో మాత్రం ఫ్యామిలీ మ్యాన్ లా చాలా సింపుల్ గా ఉన్నాడంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ వీడియో ఒరిజనలా? ఫేకా? అన్నది మాత్రం స్పష్టంగా తెలియడం లేదు.
నెట్టింట వైరలవుతోన్న సందీప్ రెడ్డి వంగా వీడియో ఇదే..
View this post on Instagram
ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ప్రభాస్ తో ‘స్పిరిట్’ మూవీ చేస్తున్నాడు సందీప్ రెడ్డి. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి రెండు షెడ్యూల్స్ పూర్తి అయినట్లు సమాచారం. బాలీవుడ్ బ్యూటీ తృప్తి దిమ్రీ ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే ప్రకాశ్ రాజ్, వివేక్ ఓబెరాయ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. న్యూ ఇయర్ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ని విడుదల చేయగా ఓ రేంజ్ లో వైరలైన సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ మూవీకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ రానున్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




