AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: తోటలో అమ్మాయి శవం.. ఇవాళే ఓటీటీలోకి వచ్చిన రియల్ క్రైమ్ స్టోరీ.. ఐఎమ్‌డీబీలో టాప్ రేటింగ్ మూవీ

కొన్ని నెలల క్రితమే ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. ఓ రియల్ క్రైమ్ ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమా ఆడియెన్స్ ను బాగానే ఆకట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లనే రాబట్టింది. ఐఎమ్ డీబీలోనూ ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీకి టాప్ రేటింగ్ ఉండడం విశేషం.

OTT Movie: తోటలో అమ్మాయి శవం.. ఇవాళే ఓటీటీలోకి వచ్చిన రియల్ క్రైమ్ స్టోరీ.. ఐఎమ్‌డీబీలో టాప్ రేటింగ్ మూవీ
Kirkkan Movie
Basha Shek
|

Updated on: Jan 15, 2026 | 5:41 PM

Share

సంక్రాంతి పండగను పురస్కరించుకుని థియేటర్లతో పాటు ఓటీటీలోనూ కొత్త సినిమాలు రిలీజవుతున్నాయి. తెలుగుతో పాటు వివిధ భాషలకు చెందిన సినిమాలు, వెబ్ సిరీస్ లు ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్ పై సందడి చేస్తున్నాయి. అలా ఈ గురువారం (జనవరి 15) ఒక కొత్త క్రైమ్ థ్రిల్లర్ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. కొన్నినెలల క్రితం థియేటర్లలో విడుదలైన ఈ మూవీ ఆడియెన్స్ ను బాగానే ఆకట్టుకుంది. ఆకట్టుకునే కథా కథనాలు, ఉత్కంఠభరిత సన్నివేశాలు, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే, ఊహించని ట్విస్ట్ లు ఆడియెన్స్ కు మంచి థ్రిల్ అందించాయి. ఇక ఐఎమ్ డీబీలోనూ ఈ మూవీకి 7.4 రేటింగ్ ఉండడం విశేషం. ఇప్పుడీ సినిమా సడెన్ గా ఓటీటీలోకి వచ్చింది. మరి థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడిన ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఇదొక రియల్ క్రైమ్ థ్రిల్లర్.. 2005లో కేరళలోని కొట్టాయం జిల్లా సమీపంలో జరిగిన ఒక వాస్తవ సంఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. అక్కడి సమీపంలో ఉండే ఒక చిన్న గ్రామంలో ఒక యువతి అనుమానాస్పద స్థితిలో చనిపోతుంది. మొదట ఇది ఆత్మహత్య అని భావించినా, పోస్టుమార్టం రిపోర్ట్ లో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తాయి. ఆ అమ్మాయిని కొందరు హత్య చేశారని తెలుస్తుంది. మరి ఈ హత్య వెనక ఎవరున్నారు? ఎందుకు ఆ అమ్మాయిని చంపారు? అన్న ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

ఈ మలయాళం క్రైమ్ థ్రిల్లర్ మూవీ పేరు ‘కిర్‌క్కన్’. జోష్ తెరకెక్కించిన ఈ సినిమాలో విజయరాఘవన్, సలీం కుమార్, కని కుస్రుతి, జానీ ఆంటోనీ, అనార్కలి మరికార్, అప్పాని శరత్, మీరా వాసుదేవ్, మక్బూల్ సల్మాన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ప్రస్తుతం ఈ సినిమా సన్ నెక్ట్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఇప్పుడు కేవలం మలయాళం ఆడియోనే అందుబాటులో ఉంది. నిజానికి థియేట్రికల్ వెర్షన్ తెలుగులోనూ రిలీజైనా.. ఇప్పుడు ఓటీటీలో మాత్రం ఆ వెర్షన్ అందుబాటులోకి రాలేదు. బహుశా.. త్వరలోనే తెలుగు వెర్షన్ కూడా స్ట్రీమింగ్ కు రావొచ్చు.

ఇవి కూడా చదవండి

సన్ నెక్ట్స్ లో స్ట్రీమింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇవాళే OTTలోకి వచ్చిన రియల్ క్రైమ్ స్టోరీ.. IMDBలో టాప్ రేటింగ్
ఇవాళే OTTలోకి వచ్చిన రియల్ క్రైమ్ స్టోరీ.. IMDBలో టాప్ రేటింగ్
ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి శని.. ఈ రాశులవారికి అసలైన పండగ షురూ
ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి శని.. ఈ రాశులవారికి అసలైన పండగ షురూ
పెరుగు వర్సెస్‌ మజ్జిగ.. మీ ఆరోగ్యానికి ఏది మంచిదో తెలుసా..?
పెరుగు వర్సెస్‌ మజ్జిగ.. మీ ఆరోగ్యానికి ఏది మంచిదో తెలుసా..?
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
మీరు ఫోన్‌ కాల్స్‌ లిఫ్ట్‌ చేస్తున్నారా? ఇక ఇవి తప్పక తెలుసుకోండి
మీరు ఫోన్‌ కాల్స్‌ లిఫ్ట్‌ చేస్తున్నారా? ఇక ఇవి తప్పక తెలుసుకోండి
గూస్ బంప్స్ తెప్పిస్తోన్న ఎల్లమ్మ గ్లింప్స్..
గూస్ బంప్స్ తెప్పిస్తోన్న ఎల్లమ్మ గ్లింప్స్..
అరుదైన నల్ల జీడిపండ్లు ఎప్పుడైనా తిన్నారా? లెక్కలేనన్ని లాభాలు..!
అరుదైన నల్ల జీడిపండ్లు ఎప్పుడైనా తిన్నారా? లెక్కలేనన్ని లాభాలు..!
సూర్యవంశీకి దిమ్మతిరిగే షాక్.. తొలి మ్యాచ్‌లోనే క్లీన్ బౌల్డ్
సూర్యవంశీకి దిమ్మతిరిగే షాక్.. తొలి మ్యాచ్‌లోనే క్లీన్ బౌల్డ్
Chanakya Niti: మనిషికి అతిపెద్ద శత్రువు ఏదో తెలుసా?
Chanakya Niti: మనిషికి అతిపెద్ద శత్రువు ఏదో తెలుసా?
ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరూ ఇది తెలుసుకోవాల్సిందే..! ఏంటో తెలుసా?
ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరూ ఇది తెలుసుకోవాల్సిందే..! ఏంటో తెలుసా?