AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫుల్ స్వింగ్‌లో నటసింహం..! బాలయ్యే కావాలి.. లైన్‌లో ఏకంగా ఎనిమిది మంది డైరెక్టర్స్..

నందమూరి నటసింహం బాలకృష్ణకు ఉన్న క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. 60 ఏళ్ల వయసులోనూ వరుస సినిమాలతో వెండితెరపై సందడి చేస్తున్నారు. మాస్ యాక్షన్ చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తున్నారు. ఇప్పటికీ చేతినిండా సినిమాలతో కుర్ర హీరోలకు సైతం గట్టిపోటీ ఇస్తున్నారు బాలయ్య.

ఫుల్ స్వింగ్‌లో నటసింహం..! బాలయ్యే కావాలి.. లైన్‌లో ఏకంగా ఎనిమిది మంది డైరెక్టర్స్..
Balakrishna
Rajeev Rayala
|

Updated on: Feb 10, 2026 | 12:52 PM

Share

నటసింహం నందమూరి బాలకృష్ణ వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. ఈ మధ్య బాలకృష్ణ ఏ సినిమ చేసిన భారీ హిట్ అందుకుంటున్నారు. బాక్సాఫీస్ దగ్గర సత్తా చూపుతున్నారు బాలకృష్ణ. ఇటీవలే అఖండ 2 సినిమాతో భారీ విజయాన్ని అందుకుంది. బాలయ్య సత్తా ఏంటో మరోసారి బాక్సాఫీస్ కు చూపించింది అఖండ 2 . ఇప్పుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు బాలకృష్ణ. తెలుగు సినీ పరిశ్రమలో కొందరు హీరోలు వయసు పెరిగే కొద్దీ మెల్లగా స్లో అవుతారు. కానీ నందమూరి బాలకృష్ణ మాత్రం వయసుతో పాటు మరింత పీక్ ఫామ్‌లోకి వెళ్తున్నారు. 60 ఏళ్ల వరకూ ఒక లెక్క.. 60 తర్వాత మరో లెక్క అన్నట్లుగా ఉంది బాలయ్య ప్రస్తుత సినీ ప్రయాణం సాగుతుంది. ఏ ముహూర్తాన అన్ స్టాపబుల్  NBK అనే షో మొదలుపెట్టారో అప్పటి నుంచే ఆయన జర్నీ నిజంగా అన్ స్టాపబుల్ గా సాగుతుంది.

ఒకప్పుడు హీరోలు డైరెక్టర్లను వెతుక్కునే రోజులు ఉండేవి.. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా రివర్స్ అయింది. డైరెక్టర్లే బాలయ్య డేట్స్ కోసం లైన్లో నిలబడుతున్నారు.! ఏకంగా ఎనిమిది మంది దర్శకులు బాలయ్యతో సినిమా చేయడానికి రెడీగా ఉన్నారని ఫిలిం సర్కిల్స్ లో టాక్ వినిపిస్తుంది. ఇండస్ట్రీ టాక్ ప్రకారం, పలువురు ప్రముఖ దర్శకులు బాలయ్యతో సినిమాలు ప్లాన్ చేస్తున్నారట. బాలయ్యతో సినిమా చేయాలని కోరుకుంటున్న స్టార్ డైరెక్టర్లు ఎవరో ఒక్కసారి చూద్దాం..

గోపీచంద్ మలినేని..

‘వీరసింహారెడ్డి’ లాంటి మాస్ హిట్ తర్వాత ఈ కాంబో మళ్లీ రిపీట్ కావాలని ఫ్యాన్స్ కోరుకున్నారు. అనుకున్నట్టుగానే ఇప్పుడు గోపీచంద్ తో సినిమా చేస్తున్నారు బాలకృష్ణ. ఈ సినిమా నుంచి ఇప్పటికే ప్రీ లుక్ పోస్టర్ విడుదలయ్యాయి.

ఇవి కూడా చదవండి

హనీఫ్ అడేని (మార్కో మూవీ ఫేమ్)

స్టైలిష్ యాక్షన్, ఇంటెన్స్ స్క్రీన్‌ప్లేకు పేరుగాంచిన దర్శకుడు హనీఫ్ అడేని. కన్నడ ఇండస్ట్రీలో తెరకెక్కిన మార్కో సినిమాతో ఒక్కసారిగా అందరి దృష్టి తన వైపు తిప్పుకున్నాడు. కాగా ఇప్పుడు ఆయన  బాలయ్యతో సినిమా చేయాలనుకుంటున్నాడట. బాలయ్యను పూర్తిగా కొత్త లుక్‌లో చూపించగలడని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది.

కొరటాల శివ

సోషల్ మెసేజ్‌తో మాస్ సినిమాలు తీయడంలో దిట్ట కొరటాల శివ. ఎన్టీఆర్ తో దేవర సినిమాతో రీసెంట్ గా మంచి విజయాన్ని అందుకున్నాడు కొరటాల. ఇప్పుడు దేవర 2 సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత బాలయ్యతో సినిమా చేయాలని చూస్తున్నాడు. బాలయ్యతో పవర్‌ఫుల్ సబ్జెక్ట్ వస్తే బ్లాక్‌బస్టర్ ఖాయం అంటున్నారు ఫ్యాన్స్.

వివేక్ ఆత్రేయ

క్లాస్ స్టోరీటెల్లింగ్‌కు పేరుగాంచిన దర్శకుడు వివేక్ ఆత్రేయ. బాలయ్యలోని కొత్త కోణాన్ని బయటపెడతాడని అభిమానుల అంచనా. మరి ఈ కాంబో సెట్ అవుతుందో చూడాలి.

వెంకీ అట్లూరి

ఫ్యామిలీ ,ఎమోషనల్ డ్రామాలకు స్పెషలిస్ట్ వెంకీ అట్లూరి. సార్, లక్కీ భాస్కర్ లాంటి హిట్స్ తో ఫుల్ జోష్ మీదున్నాడు వెంకీ . ఇక ఇప్పుడు బాలయ్యతో సినిమా చేసే అవకాశం ఉందని అంటున్నారు. భగవంత్ కేసరి తరహాలో మరో డిఫరెంట్ బాలయ్యను చూపించే అవకాశం ఉందని అంటున్నారు.

బాబీ కొల్లి

మాస్ కమర్షియల్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ బాబీ. బాబీ బాలయ్యతో ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

అనిల్ రావిపూడి

‘భగవంత్ కేసరి’తో బాలయ్యను ఫ్యామిలీ ఆడియన్స్‌కు మరింత దగ్గర చేసిన దర్శకుడు అనిల్. ఈ కాంబో మళ్లీ రిపీట్ అయితే మరో సూపర్ హిట్ ఖాయం అంటున్నారు ఫ్యాన్స్.

హరీష్ శంకర్

మాస్ యాక్షన్ ఎంటర్‌టైన్‌మెంట్ స్పెషలిస్ట్ హరీష్ శంకర్. బాలయ్య ఎనర్జీకి హరీష్ శంకర్ మార్క్ డైలాగ్స్ జోడిస్తే థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం అంటున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తున్నాడు హరీష్. ఆ తర్వాత బాలయ్య కోసం కథ సిద్ధం చేసే అవకాశం ఉందని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ఈ దర్శకులలో ఎవరి కాంబో ముందుగా సెట్స్‌పైకి వెళ్తుందో చూడాలి. ఏదేమైనా బాలయ్య ఫ్యాన్స్‌కి మాత్రం పండగే..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.