AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chiranjeevi- Balakrishna: మెగాస్టార్ సినిమాల్లో బాలయ్యకు ఆ సినిమా అంటే చాలా ఇష్టమట.. ఆ మూవీ ఏంటంటే

మెగాస్టార్ చిరంజీవి ఇటీవలే మన శంకర వరప్రసాద్ గారు సినిమాతో బిగెస్ట్ హిట్ అందుకున్నారు. సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. అలాగే బాలకృష్ణ ఇటీవలే అఖండ 2 సినిమాతో హిట్ అందుకున్నారు. బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

Chiranjeevi- Balakrishna: మెగాస్టార్ సినిమాల్లో బాలయ్యకు ఆ సినిమా అంటే చాలా ఇష్టమట.. ఆ మూవీ ఏంటంటే
Chiranjeevi, Balakrishna
Rajeev Rayala
|

Updated on: Feb 09, 2026 | 12:13 PM

Share

మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ ఇద్దరూ తమతమ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. దాదాపు 3 దశాబ్దాలుగా హీరోగా ఇండస్ట్రీలో నటిస్తున్నారు. ఈ ఇద్దరూ హీరోలు తమ తమ సినిమాలతో ప్రేక్షకులను ఇప్పటికీ అలరిస్తున్నారు.. బాలయ్య తనదైన శైలిలో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్స్ తో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ఇక చిరంజీవి మాస్ యాక్షన్ సినిమాలతో పాటు ఫ్యామిలీ మూవీస్ చేస్తూ ఆకట్టుకుంటున్నారు. బాలయ్య ఇప్పటికే వరుసగా విజయాలతో దూసుకుపోతున్నారు. ఇటీవలే అఖండ 2తో బాలకృష్ణ భారీ హిట్ అందుకున్నారు. అలాగే చిరంజీవి ఈ సంక్రాంతికి మన శంకరవరప్రసాద్ గారు సినిమాతో హిట్ అందుకున్నారు. ఇక ఈ ఇద్దరూ తమ తమ సినిమాలతో తెలుగు సినిమాలో ఎన్నో రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నారు.

కాగా బాలకృష్ణకు చిరంజీవి నటించిన సినిమాల్లో ఏ సినిమా అంటే బాగా ఇష్టమో తెలుసా.? బాలకృష్ణనే స్వయంగా ఆ విషయం చెప్పారు. గతంలో బాలకృష్ణ హోస్ట్ గా చేసిన అన్ స్టాపబుల్ షో లో రామ్ చరణ్ గెస్ట్ గా హాజరైన ఎపిసోడ్ లో బాలకృష్ణ మాట్లాడుతూ.. చిరంజీవి గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఫైట్స్ లో, డాన్స్ లో గ్రెస్ బాగుంటుందని చెప్తూనే తనకు ఖైదీ సినిమా చాలా ఇష్టమని అన్నారు బాలయ్య. అలాగే చిరంజీవి కూడా బాలయ్య సినిమాల్లో తనకు ఇష్టమైన సినిమాల గురించి చెప్పారు.

పలు ఇంటర్వ్యూలో చిరంజీవి బాలకృష్ణ నాటింషన్ సమరసింహారెడ్డి, నరసింహనాయుడు సినిమాల స్పూర్తితోనే ఇంద్రలాంటి  సినిమా చేశాను అని చిరంజీవి అన్నారు. ప్రస్తుతం బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. అలాగే చిరంజీవి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. అలాగే బాబీ దర్శకత్వంలో మెగాస్టర్ సినిమా ఉండనుందని తెలుస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
జీతంలో బేసిక్, గ్రాస్, నెట్ సాలరీ అంటే ఏమిటి?
జీతంలో బేసిక్, గ్రాస్, నెట్ సాలరీ అంటే ఏమిటి?
భారత్ ఖాతాలో మరో క్లీన్ స్వీప్ విక్టరీ లోడింగ్.. కట్‌చేస్తే..
భారత్ ఖాతాలో మరో క్లీన్ స్వీప్ విక్టరీ లోడింగ్.. కట్‌చేస్తే..
అద్భుతం.. 9 రోజుల్లో తయారైన AI రాడార్‌కు 3.17 లక్షల డాలర్ల డీల్!
అద్భుతం.. 9 రోజుల్లో తయారైన AI రాడార్‌కు 3.17 లక్షల డాలర్ల డీల్!
బిగ్ ట్విస్ట్.. ట్రైనీ IPS ఉదయ్ కృష్ణా రెడ్డి అరెస్ట్!
బిగ్ ట్విస్ట్.. ట్రైనీ IPS ఉదయ్ కృష్ణా రెడ్డి అరెస్ట్!
ప్రాణం మీదకు తెచ్చిన నోటి దురుసు... అలా అంటేనే కొట్టి చంపేస్తారా
ప్రాణం మీదకు తెచ్చిన నోటి దురుసు... అలా అంటేనే కొట్టి చంపేస్తారా
ఇట్స్ అఫీషియల్.. అప్పుడే ఓటీటీలోకి సత్యదేవ్ రీసెంట్ సినిమా
ఇట్స్ అఫీషియల్.. అప్పుడే ఓటీటీలోకి సత్యదేవ్ రీసెంట్ సినిమా
కన్వర్ యాత్ర ప్రత్యేకత ఇదే..! ఎప్పుడు మొదలై ఎప్పుడు ముగుస్తుంది?
కన్వర్ యాత్ర ప్రత్యేకత ఇదే..! ఎప్పుడు మొదలై ఎప్పుడు ముగుస్తుంది?
మాట నిలబెట్టుకున్న సర్పంచ్‌.. ప్రశంసలు కురిపిస్తున్న స్థానికులు
మాట నిలబెట్టుకున్న సర్పంచ్‌.. ప్రశంసలు కురిపిస్తున్న స్థానికులు
తిరుమలలో పాలలా మారిన నీళ్లు.. తిరుమలలో పాలలా మారిన నీళ్లు..
తిరుమలలో పాలలా మారిన నీళ్లు.. తిరుమలలో పాలలా మారిన నీళ్లు..
పక్షుల గూటిలో వింత శబ్దాలు.. ఏం జరిగిందో తెలుసా?
పక్షుల గూటిలో వింత శబ్దాలు.. ఏం జరిగిందో తెలుసా?