AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఊహించని షాక్..! ప్రభాస్ స్పిరిట్ సినిమా నుంచి ఆ స్టార్ నటుడు అవుట్..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న చిత్రం స్పిరిట్. ఈ ప్రాజెక్ట్‌ అప్‌డేట్స్‌ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రభాస్ ఒక పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా నటిస్తోన్న ఈ చిత్రంలో యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ హీరోయిన్‌గా కనిపించనుంది.

ఊహించని షాక్..! ప్రభాస్ స్పిరిట్ సినిమా నుంచి ఆ స్టార్ నటుడు అవుట్..
Spirit
Rajeev Rayala
|

Updated on: Feb 09, 2026 | 7:46 AM

Share

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన రాజా సాబ్ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే.. సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జనవరి 9న విడుదలైన ఈ సినిమా డివైడ్ టాక్ తెచ్చుకుంది. విడుదలకు ముందు భారీ అంచనాలు క్రియేట్ చేసిన ఈ సినిమా ప్రేక్షకులను నిరాశపరిచింది. మారుతి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. హారర్ కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో నిధిఅగార్వల్, రిద్ది కుమార్, మాళవికామోహనన్ హీరోయిన్స్ గా నటించారు. ఇదిలా ఉంటే ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్ ఆడియన్స్ మైండ్ బ్లాక్ చేసింది.

అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాలతో ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు సందీప్ రెడ్డి. ఇక ఇప్పుడు ప్రభాస్ తో స్పిరిట్ అనే సినిమా చేస్తున్నాడు సందీప్. ఈ సినిమాలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడని ఇప్పటికే హింట్ ఇచ్చారు సందీప్.. మొనీమధ్య విడుదల చేసిన స్పిరిట్ పోస్టర్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించింది. ఈ సినిమాలో త్రిప్తి డిమ్రీ హీరోయిన్ గా నటిస్తుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు స్పిరిట్ సినిమా నుంచి ఓ స్టార్ నటుడు తప్పుకుంటున్నాడని టాక్ వినిపిస్తుంది.

స్పిరిట్ సినిమాలో ప్రభాస్ రాజ్ కీలక పాత్రలో నటిస్తున్నాడని తెలుస్తుంది. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కాగా ఈ సినిమా నుంచి ప్రకాష్ రాజ్ తప్పుకున్నాడని ఫిలిం సర్కిల్స్ లో టాక్ వినిపిస్తుంది. ఓ సీన్ విషయంలో ఇద్దరి మధ్య డిఫరెన్స్ రావడంతో ప్రకాష్ రాజ్ సినిమా నుంచి తప్పుకున్నారని అంటున్నారు. సందీప్ రెడ్డి, ప్రకాష్ రాజ్ ఇద్దరూ ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తులు.. దాంతో ఇద్దరి మధ్య చిన్న ఇష్యు వచ్చిందని అంటున్నారు. అయితే ఈ వార్త పై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. త్వరలోనే దీని పై క్లారిటీ రానుంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..

Follow Us
సింగిల్‌ ఛార్జ్‌పై 656 కి.మీ రేంజ్‌.. రూ.1.40 లక్షల వరకు తగ్గింపు
సింగిల్‌ ఛార్జ్‌పై 656 కి.మీ రేంజ్‌.. రూ.1.40 లక్షల వరకు తగ్గింపు
వాడ్ని నమ్మి వరల్డ్ కప్‌ బరిలోకి దిగితే.. నిండా మునగడం గ్యారెంటీ
వాడ్ని నమ్మి వరల్డ్ కప్‌ బరిలోకి దిగితే.. నిండా మునగడం గ్యారెంటీ
పట్టుతప్పి కిందపడ్డా.. చనిపోయేదాన్నే.. కానీ గైడ్‌ వల్ల బతికాను..
పట్టుతప్పి కిందపడ్డా.. చనిపోయేదాన్నే.. కానీ గైడ్‌ వల్ల బతికాను..
వేద విద్యార్ధి ఆవేదన.. రూ.8 వేల కోసం..
వేద విద్యార్ధి ఆవేదన.. రూ.8 వేల కోసం..
మనీ మెషీన్‌! 90 నిమిషాల్లో రూ.30 కోట్లు సంపాదన
మనీ మెషీన్‌! 90 నిమిషాల్లో రూ.30 కోట్లు సంపాదన
వైరల్‌ వీడియోలే వరుడికి విలన్‌లయ్యాయి.. షాక్ తిన్న పెళ్లి బృందం!
వైరల్‌ వీడియోలే వరుడికి విలన్‌లయ్యాయి.. షాక్ తిన్న పెళ్లి బృందం!
గుడ్డు పెంకులతో ఇంటికి,అందానికి డబుల్ బెనిఫిట్!ఈ చిట్కాలు తెలుసా
గుడ్డు పెంకులతో ఇంటికి,అందానికి డబుల్ బెనిఫిట్!ఈ చిట్కాలు తెలుసా
రైతులకు మేలు చేసే వయ్యారి భామ మళ్లీ దర్శనం..!
రైతులకు మేలు చేసే వయ్యారి భామ మళ్లీ దర్శనం..!
వర్షాకాలంలో తప్పక వెళ్లాల్సిన భారత్‌లోని 5 అద్భుతమైన ప్రదేశాలు..
వర్షాకాలంలో తప్పక వెళ్లాల్సిన భారత్‌లోని 5 అద్భుతమైన ప్రదేశాలు..
ఆ సాంగ్ చేస్తుంటే నాకు జ్వరం వచ్చింది.. 7G బృందావన్ కాలనీ హీరో..
ఆ సాంగ్ చేస్తుంటే నాకు జ్వరం వచ్చింది.. 7G బృందావన్ కాలనీ హీరో..