అందరితో నటించా.. కానీ ఆ ఇద్దరు హీరోలతో చేయలేదు.. ముమైత్ ఖాన్
ముమైత్ ఖాన్.. ఒకప్పుడు ఈ అమ్మడు కుర్రాళ్ళ కలల రాకుమారిగా మారింది. ఐటమ్ సాంగ్స్‌లో తన అందచందాలతో ఉర్రుతలు ఊగించింది. సినిమాలో ఐటెం సాంగ్ అంటే ముమైత్ ఖాన్ ఉండాల్సిందే అనే రేంజ్‌లో రాణించింది ఈ అమ్మడు. తెలుగులోనే కాదు తమిళ్ ,హిందీ భాషల్లోనూ ఐటమ్ సాంగ్స్ తో అదరగొట్టింది

ఒకప్పుడు హాట్ బ్యూటీగా ఇండస్ట్రీని ఊపేసింది ముమైత్ ఖాన్.. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసి మెప్పించింది. ఇటీవల కాలంలో ముమైత్ ఖాన్ పెద్దగా సినిమాల్లో కనిపించడం లేదు. ఆ మధ్య తెలుగు బిగ్ బాస్ షోలో సందడి చేసింది. రీసెంట్ గా ఓ డ్యాన్స్ షోకు జడ్జ్ గా వ్యవహరించింది. తర్వాత బుల్లితెర నుంచి కూడా మాయం అయ్యింది. తాజాగా ముమైత్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఆ ఇంటర్వ్యూలో ముమైత్ ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఈ ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఓ స్టార్ హీరో గురించి ముమైత్ చేసిన కామెంట్స్
ముమైత్ ఖాన్ మాట్లాడుతూ.. నందమూరి బాలకృష్ణపై తనకు అపారమైన అభిమానం ఉందని, ఆయన ఎనర్జీ అద్భుతమని ముమైత్ ఖాన్ చెప్పుకొచ్చింది. బాలకృష్ణను చాలామంది అపార్థం చేసుకుంటున్నారని, కానీ ఆయన గొప్ప వ్యక్తి అని ఆమె అన్నారు. బాలకృష్ణ గురించి మాట్లాడుతూ.. ఆయన ఉదయం 5 గంటలకు నిద్రలేచి పూజలు, యోగా చేస్తారని, జ్యోతిష్యాన్ని నమ్ముతారని, క్రమశిక్షణతో ఉంటారని ముమైత్ ఖాన్ తెలిపింది. డిక్టేటర్ చిత్రంలోని టింగో టింగో టింగో పాట సమయంలో బాలకృష్ణతో కలిసి పనిచేశానని ఆమె గుర్తుచేసుకున్నారు. అలాగే పూరి జగన్నాథ్‌తో తన ప్రయాణం సి.కళ్యాణ్ సిఫార్సుతో ప్రారంభమైందని ముమైత్ ఖాన్ వెల్లడించారు.
హరికృష్ణ నటించిన స్వామి చిత్రంలోని తన మొదటి పాట కు C. కళ్యాణ్ తన పనిని మెచ్చుకున్నారని, ఆ తర్వాత పూరి జగన్నాథ్ తన తమ్ముడుతో తీస్తున్న 143 చిత్రానికి తనను సిఫార్సు చేశారని తెలిపింది ముమైత్. పూరి జగన్నాథ్ వర్క్ స్టైల్ ముంబై శైలిలో ఉంటుందని, అది తనకు ఎంతో నచ్చిందని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం పూరి జగన్నాథ్‌తో తాను రోజూ టచ్‌లో లేనప్పటికీ, కలిసినప్పుడు స్నేహం అలాగే కొనసాగుతుందని ముమైత్ ఖాన్ అన్నారు. తన దృష్టిలో నిజమైన స్నేహం అంటే రోజూ మాట్లాడుకోవటం కాదని, ఎప్పుడు కలిసినా మునుపటి అనుబంధం అలాగే ఉండటమేనని ఆమె అన్నారు. టాలీవుడ్‌లోని దాదాపు అందరు హీరోలతో తాను కలిసి పనిచేశానని, మోహన్ బాబు, నాగార్జున వంటి కొందరు సీనియర్ నటులు మినహా మిగిలిన అందరితో తాను పనిచేశానని ముమైత్ ఖాన్ తెలిపారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్‌లతో చేయలేదని ఆమె అన్నారు. అలాగే తాను సినిమా రంగంలోకి డబ్బు అవసరం కోసం రాలేదని, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నానని ఆమె అన్నారు. ఇంట్లో ఆర్థిక కష్టాలను చిన్నతనం నుంచే గమనించి, స్కూల్‌కు నడిచి వెళ్లి రూపాయిన్నర ఆదా చేసి, ఆ డబ్బును తన తండ్రికి ఇచ్చేదానినని ముమైత్ ఖాన్ గుర్తుచేసుకున్నారు. తన తల్లిదండ్రులు ఎప్పుడూ పని చేయమని చెప్పనప్పటికీ, తానే కుటుంబానికి అండగా నిలిచానని ఆమె చెప్పుకొచ్చారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
