AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ స్టార్ హీరో వస్తే నేను పారిపోయేవాడిని.. ఆసక్తికర విషయం చెప్పిన ఎస్.కె.ఎన్.

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత ఎస్కేఎన్ అలియాస్ శ్రీనివాస్ కుమార్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. బేబీ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారాయన. ఇటీవలే ప్రభాస్ ది రాజాసాబ్ తో పాటు పలు సినిమాలను నిర్మించారు ఎస్కేఎన్. ఇదిలా ఉంటే సినిమా ఈవెంట్లలో తన ఉపన్యాసాలు, కామెంట్స్, సోషల్ మీడియా పోస్టులతో తరచూ వార్తల్లో నిలుస్తుంటారు ఎస్కేఎన్.

ఆ స్టార్ హీరో వస్తే నేను పారిపోయేవాడిని.. ఆసక్తికర విషయం చెప్పిన ఎస్.కె.ఎన్.
Skn
Rajeev Rayala
|

Updated on: Jan 13, 2026 | 10:14 AM

Share

ఎస్.కె.ఎన్. ఈ పేరు ప్రస్తుతం టాలీవుడ్ లో కాస్త గట్టిగానే వినిపిస్తుంది. నిర్మాతగా పీఆర్ఓ గా రాణిస్తున్నారు ఎస్.కె.ఎన్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఎస్.కె.ఎన్ మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఓ హీరోను చూసి పారిపోయేవాడిని అని చెప్పారు ఎస్.కె.ఎన్. ఇంతకూ ఆ హీరో ఎవరో తెలుసా.? ఎస్.కె.ఎన్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..  పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్ లకు పీఆర్ఓగా పని చేశాను అని అన్నారు ఎస్.కె.ఎన్. కాగా చిరంజీవి పట్ల తనకున్న అమితమైన గౌరవం, భక్తి ఉన్నాయని తెలిపారు ఎస్.కె.ఎన్..  చిరంజీవిని మొదటిసారి ఎలా కలిశారు అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ.. తాను ఎప్పుడూ చిరంజీవి గారి ప్రెజెన్స్ లో ఉండడానికి వెనకాడుతుండేవాడినని తెలిపారు. పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్ లకు పీఆర్ఓగా ఉన్నప్పటికీ చిరంజీవి గారు వస్తే మాత్రం అక్కడి నుంచి పారిపోయేవాడిని అని అన్నారు.

అయితే అల్లు అరవింద్, అల్లు అర్జున్, శిరీష్, రామ్ చరణ్ చిరంజీవికి ఎస్.కె.ఎన్. గురించి చెప్పడంతో, చిరంజీవి గారు స్వయంగా అతడిని పిలిపించమని అడిగారట. అరవింద్ గారి ఇంట్లో డిన్నర్ సమయంలో అల్లు అర్జున్ చెప్పగా, ఎస్.కె.ఎన్. చిరంజీవిని కలిశారట. తాను నిర్మాతగా చేసిన టాక్సీవాలా సినిమా విడుదలైనప్పుడు కూడా చిరంజీవి గారు ఎస్.కె.ఎన్. ను పిలిచి అభినందించారని, భవిష్యత్తులో ఏదైనా కథ ఉంటే తనకు చెప్పమని కోరారని, తన జడ్జ్‌మెంట్ బాగుంటుందని ప్రోత్సహించారని ఎస్.కె.ఎన్. గుర్తుచేసుకున్నారు. తాను ఏదో ఒక అభిమానినని తెలిసినా, చిరంజీవి గారు తన కథలు వినడానికి ఆసక్తి చూపించడం ఆయన గొప్ప మనస్సుకు నిదర్శనమని ఎస్.కె.ఎన్. పేర్కొన్నారు.

చిరంజీవి గారు నిండు వ్యక్తిత్వం గల వారని, ఆయన ఉన్న కాలంలో మనం పుట్టడం అదృష్టమని చెప్పుకొచ్చారు చిరంజీవి. సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న ట్రోలింగ్, ముఖ్యంగా మెగా హీరోల సినిమాలను పొగిడి, ఇతర హీరోల సినిమాలను తక్కువ చేస్తూ తాను పోస్టులు పెడతాననే ఆరోపణలను ఎస్.కె.ఎన్. మాట్లాడారు. తన ట్విట్టర్ , ఇన్ స్టా గ్రామ్ ఖాతాలలో తాను ఏ హీరోను లేదా సినిమాను తక్కువ చేసి మాట్లాడలేదని స్పష్టం చేశారు. తాను మాస్ మహారాజ రవితేజ, రెబల్ స్టార్ ప్రభాస్ వంటి ఇతర హీరోలతో కూడా పీఆర్ఓగా పనిచేశానని గుర్తుచేశారు. ఒక హీరో అభిమానినంటే ఇతర హీరోలను ద్వేషించడం కాదని, చిరంజీవి గారు సైతం మహేష్ బాబు, ఎన్టీఆర్ వంటి హీరోల సక్సెస్ అయితే అభినందిస్తారు అని చెప్పుకొచ్చారు ఎస్.కె.ఎన్. బాలకృష్ణ, మహేష్ బాబు, ఎన్టీఆర్ సినిమాలను కూడా తాను మొదటి రోజునే చూసి ఆస్వాదిస్తానని, తాను ఒక సినిమా ప్రేమికుడిని అని చెప్పారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.