ఆ హీరో సినిమాలో నటించాలని ఉంది..! అమ్మగా చేయాలంటే ఏడుపొస్తుంది.. అక్క, వదినగా నటిస్తానన్న రోజా
టాలీవుడ్ సీనియర్ నటి రోజా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ నటి ఆరోజుల్లో తన అంద చందాలతో ఎంతో మంది మదిని దోచేసింది. ఇప్పటికీ కూడా ఈ నటి అంటే చాలా మందికి ఇష్టం. ఇక సినిమాల్లోనే కాకుండా రాజకీయాల్లో కూడా రోజా తన సత్తా చాటారు.

ఒకప్పుడు హీరోయిన్ గా రాణించి ఇప్పుడు రాజకీయాల్లో బిజీగా ఉన్నారు నటి రోజా.. అప్పట్లో కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్ గా రాణించారు రోజా.. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో అనేక హిట్ చిత్రాల్లో నటించి నటిగా మంచి మార్కులు కొట్టేశారు. తెలుగులో దాదాపు అందరు స్టార్ హీరోల సరసన నటించారు. ఒకప్పుడు హీరోయిన్ గా నటించిన రోజా.. ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ లో హీరోహీరోయిన్లకు తల్లిగా, అత్తగా పలు సినిమాల్లో కనిపించారు. ఇక కొన్నాళ్లుగా రాజకీయాల్లో బిజీగా ఉన్న ఆమె సినిమాలకు దూరంగా ఉండిపోయారు. పలు టీవీ షోల్లో అభిమానులను అలరిస్తున్నప్పటికీ ఆమె సినిమాల్లోనూ బిజీ కావాలని అభిమానులు కోరుకున్నారు. ఇక ఇప్పుడు రోజా ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యారు.
అతన్ని పిచ్చి పిచ్చిగా ప్రేమించా.. కానీ బ్రేకప్ అయ్యింది.. దివి ఎమోషనల్ కామెంట్స్
డీడీ బాలచంద్రన్ దర్శకత్వం వహిస్తున్న లెనిన్ పాండ్యన్ సినిమాలో రోజా కీలకపాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో ఆమె ఓ ఛాలెంజింగ్ రోల్ లో నటిస్తున్నారు. మొన్నామధ్య ఈ సినిమా నుంచి పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు.. ఇదిలా ఉంటే రోజా ఓ స్టార్ హీరో గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. ఓ స్టార్ హీరో సినిమాతో కలిసి నటించాలని ఉందని తెలిపారు రోజా.. ఆ హీరోకు అమ్మ పాత్రలో చేయాలంటే ఏడుపొస్తుంది కానీ అక్క, వదిన పాత్రల్లో నటిస్తా అని తెలిపారు రోజా.. ఇంతకూ ఆ హీరో ఎవరంటే..
13 ఏళ్లకే పెళ్లైంది.. ఇండస్ట్రీలో చాలా మంది నన్ను అలా చేయమని అడిగారు..
రోజా చూపిన హీరో ఎవరో కాదు సూపర్ స్టార్ మహేష్ బాబు. రోజా మాట్లాడుతూ.. తనకు సూపర్ స్టార్ కృష్ణ అంటే చాలా ఇష్టమని, చిన్ననాటి నుంచి కృష్ణ సినిమాలు చేసేదాన్ని అని అన్నారు. అలాగే తాను కృష్ణ గారితో కలిసి నటించేటప్పుడు మహేష్ బాబు సెట్ కు వచ్చేవాడిని ఆమె అన్నారు. అదేవిధంగా మహేష్ బాబుకు తనకు ఒకే మేకప్ మెన్ అని రోజా అన్నారు. తనకు మహేష్ బాబు అంటే చాలా ఇష్టమని.. ఆయన సినిమాలో నటించాలని ఉందని అన్నారు రోజా. అమ్మగా చేయాలంటే ఏడుపొస్తుంది కానీ అక్క, వదిన పాత్రలు చేస్తా.. అమ్మ పాత్ర పవర్ ఫుల్ గా ఉంటే చేస్తాను అని రాజా అన్నారు ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.
వయసు 20 ఏళ్లు.. ప్రభాస్, దళపతి విజయ్‌లను కూడా వెనక్కి నెట్టింది.. ఈ అమ్మడు ఎవరంటే

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.
