హైదరాబాద్ వాసులకు హైఅలర్ట్ .. రాబోయే వారం రోజుల పాటు ఎముకలు కొరికే చలి గ్యారంటీ.. ఇప్పటికే గత రెండు మూడు రోజుల నుంచి సిటీతో పాటు నగర శివారుని కోల్డ్ వేవ్స్ కమ్మేశాయి. ఇదే వెదర్ మరో ఏడెనిమిది రోజుల పాటు ఉంటుందని వాతావరణశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. దీంతో ఇటు చలి..మరోవైపు సీజనల్ వ్యాధులు విజృంభించే ఛాన్స్ ఉండటంతో నగరవాసులు బెంబేలెత్తిపోతున్నారు.
ఆంధ్రప్రదేశ్ ను తుఫాన్లు వెంటాడుతున్నాయా?.. ఏపీకి మరో తుఫాన్ ముప్పు ముంచి ఉందా?.. అంటే అవుననే చెబుతున్నారు వాతావరణ శాఖ అధికారులు.. తాజా వెదర్ అప్డేట్స్పై వాతావరణ శాఖ ఏమంటుందో ఇప్పుడు తెలుసుకోండి..
మరో అల్పపీడనం ముప్పు ముంచుకొస్తోంది.. ఈనెల 21న దక్షిణ అండమాన్పై ఏర్పడే ఉపరితల ఆవర్తనం.. 23 నాటికి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.. ఈ క్రమంలో అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటన విడుదల చేసింది.. ఏపీలో రాబోవు మూడు రోజులకు వాతావరణం ఎలా ఉండబోతుందో తెలుసుకోండి..
నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి కొనసాగుతోందని ఐఎండీ తెలిపింది. ఈ ప్రభావంతో ఏపీలోని కోస్తా, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక తెలంగాణలో పూర్తిగా పొడి వాతావరణమే ఉండనుంది. గల్ఫ్ ఆఫ్ మన్నార్ సరిహద్దు.. శ్రీలంక కోస్తా తీర ప్రాంతంలో ఉన్న ఉపరితల ఆవర్తనం... శనివారం కొమరిన్ నుంచి నైరుతి బంగాళాఖాతం వరకు..
ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వెదర్ డిపార్ట్మెంట్ తెలిపింది. వర్షాల నేపథ్యంలో వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. పండించిన ధాన్యాన్ని సురక్షిత ప్రదేశాలలో ఉంచాలని, ఉద్యానవన పంట మొక్కలు/చెట్లు పడిపోకుండా సపోర్టు అందించాలని పేర్కొంది.
నవంబర్ 15, శుక్రవారం కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ మరియు తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
నైరుతి బంగాళాఖాతం & దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం లో, ఉత్తర తమిళనాడు, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ ఆంధ్ర ప్రదేశ్ తీర ప్రాంతాల మీద ఉన్న నిన్నటి అల్పపీడన ప్రాంతం..
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ దిశగా కదిలి ఇప్పుడు ఉత్తర తమిళనాడు - దక్షిణకోస్తా తీరాల వెంబడి కేంద్రీకృతమైంది.. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. అల్పపీడనం ప్రభావంతో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.. ఈ మేరకు రెండు రోజుల వాతావరణ పరిస్థితుల గురించి ప్రకటన విడుదల చేసింది.
నైరుతి బంగాళాఖాతం , ఉత్తర తమిళనాడు, సరిహద్దు దక్షిణ ఆంధ్ర ప్రదేశ్ తీర ప్రాంతములో అల్పపీడనం ఏర్పడి కొనసాగుతున్నది . దీని అనుబంధ ఉపరితల..
ఏపీని వరుణుడు వీడనంటున్నాడు. నైరుతీ బంగాళాఖాతంలో ఆవర్తనం ప్రభావంతో ఏపీలో పలుచోట్ల వర్షం పడుతుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. నైరుతీ బంగాళాఖాతంలో ఆవర్తనం క్రమంగా బలపడి.. అల్పపీడనంగా మారింది. దాని ప్రభావం వల్ల ఇప్పటికే ఏపీలో గాలులు వేగంగా ఉన్నాయి. దాని వల్ల ఏపీలో3 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉంది అని వాతావరణ అధికారులు తెలిపారు.