AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weather: తెలుగు రాష్ట్రాల్లో మారుతున్న వాతావరణం.. వచ్చే 3 రోజులు వెదర్ ఎలా ఉంటుంది.. ఇదిగో రిపోర్ట్

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం మారింది. చలి తీవ్రత తగ్గి.. పగటి ఉష్ణోగ్రతలు పెగుతున్నాయి.. తెల్లవారుజాము వేళల్లో మాత్రమే చలి ఉంటుంది.. ఆ తర్వాత ఎండ వేడి పెరుగుతోంది. ఈ క్రమంలో.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వాతావరణ పరిస్థితులపై.. వాతావరణ శాఖ మరో కీలక ప్రకటన చేసింది.

Weather: తెలుగు రాష్ట్రాల్లో మారుతున్న వాతావరణం.. వచ్చే 3 రోజులు వెదర్ ఎలా ఉంటుంది.. ఇదిగో రిపోర్ట్
Andhra Pradesh Telangana Weather Forecast
Shaik Madar Saheb
|

Updated on: Feb 05, 2026 | 1:30 PM

Share

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం మారింది. చలి తీవ్రత తగ్గి.. పగటి ఉష్ణోగ్రతలు పెగుతున్నాయి.. తెల్లవారుజాము వేళల్లో మాత్రమే చలి ఉంటుంది.. ఆ తర్వాత ఎండ వేడి పెరుగుతోంది. ఈ క్రమంలో.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వాతావరణ పరిస్థితులపై.. వాతావరణ శాఖ మరో కీలక ప్రకటన చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఈశాన్య – తూర్పు దిశగా గాలులు వీస్తున్నాయని.. సాధ్యమైనంత మేరకు పొడి వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. కొన్ని ప్రాంతాల్లో మాత్రం పొగమంచు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ – యానములో దిగువ ట్రోపో ఆవరణములో ఈశాన్య, తూర్పు దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు ఈ కింది విధంగా ఉన్నాయి.

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ – యానాం, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్:-

గురువారం, శుక్రవారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశము ఉంది.

పొగమంచు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశము ఉంది.

శనివారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశము ఉంది.

రాయలసీమ:-

గురువారం, శుక్రవారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశము ఉంది. పొగమంచు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశము ఉంది.

శనివారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశము ఉంది.

గమనిక :- రాగల 5 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ – యానములో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదులో గణనీయమైన మార్పు ఉండదు .

తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ విశ్లేషణ – వాతావరణ హెచ్చరికలు :

హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం.. తెలంగాణ రాష్ట్రంలో క్రింది స్థాయి గాలులు ప్రధానముగా ఆగ్నేయ దిశ నుండి వీస్తున్నాయి.. వీటి ప్రభావంతో రాగల 3 రోజులు.. గురువారం, శుక్రవారం, శనివారం తెలంగాణ రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

తెలుగు రాష్ట్రాల్లో మారిన వాతావరణం.. వచ్చే 3 రోజుల వెదర్ రిపోర్ట్
తెలుగు రాష్ట్రాల్లో మారిన వాతావరణం.. వచ్చే 3 రోజుల వెదర్ రిపోర్ట్
బిట్స్ పిలానీకి భారీ విరాళం ప్రకటించిన పూర్వ విద్యార్థి
బిట్స్ పిలానీకి భారీ విరాళం ప్రకటించిన పూర్వ విద్యార్థి
సిరిసంపదల కోసం పెంచే మొక్క...ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
సిరిసంపదల కోసం పెంచే మొక్క...ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
దాదా స్టైలే వేరు..బిగ్ బాస్ హోస్ట్‌గా సౌరవ్ గంగూలీ
దాదా స్టైలే వేరు..బిగ్ బాస్ హోస్ట్‌గా సౌరవ్ గంగూలీ
వార్నీ.. 1982 నాటి కేసులో ఇప్పుడు తీర్పు.. 100 ఏళ్ల వృద్ధుడికి..
వార్నీ.. 1982 నాటి కేసులో ఇప్పుడు తీర్పు.. 100 ఏళ్ల వృద్ధుడికి..
ఎమ్మెల్యే శ్రీధర్‌తో కారులో లాంగ్ డ్రైవ్.. మరో వీడియో వదిలిన వీణ.
ఎమ్మెల్యే శ్రీధర్‌తో కారులో లాంగ్ డ్రైవ్.. మరో వీడియో వదిలిన వీణ.
ఈ రాశుల వారికీ బ్యాడ్ టైమ్ స్టార్ట్.. జాగ్రత్తగా ఉండండి!
ఈ రాశుల వారికీ బ్యాడ్ టైమ్ స్టార్ట్.. జాగ్రత్తగా ఉండండి!
రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లపై సీఎం రేవంత్ బిగ్ అప్డేట్..
రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లపై సీఎం రేవంత్ బిగ్ అప్డేట్..
మీరు హారతి ఇచ్చే కర్పూరం అసలైనదా..? నకిలీదా..? సింపుల్‌గా..
మీరు హారతి ఇచ్చే కర్పూరం అసలైనదా..? నకిలీదా..? సింపుల్‌గా..
తీవ్రమైన కడుపునొప్పితో ఆస్పత్రిలో చేరిన యువకుడు.. స్కాన్‌ చేయగా,
తీవ్రమైన కడుపునొప్పితో ఆస్పత్రిలో చేరిన యువకుడు.. స్కాన్‌ చేయగా,