ఆంధ్రప్రదేశ్కు వాయుగుండం ముప్పు తప్పింది.. ఈ మేరకు వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది.. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం.. ముందుగా ఏపీ వైపు వస్తుందని భారత వాతావరణ శాఖ అధికారులు అంచనా వెయ్యగా.. అది దిశను మార్చుకొని వెళుతోందని తాజాగా ప్రకటించింది.
ఏపీకి ముప్పు కొనసాగుతోంది. తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా రూపాంతంర చెందింది. రానున్న 24 గంటల్లో ఉత్తర దిశగా కదులుతుందని, దీని ప్రభావంతో ఒడిశా, కోస్తా ఆంధ్రప్రదేశ్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీ పూర్తి వెదర్ అప్డేట్ తెలుసుకుందాం పదండి...
ఈ అల్పపీడనం రాబోయే 12 గంటల్లో దాదాపు ఉత్తరం వైపు కదులుతూ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా కేంద్రీకృతమయ్యే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.. ఈ మేరకు శుక్రవారం రాబోవు మూడు రోజుల వాతావరణ పరిస్థితులపై ప్రకటన విడుదల చేసింది..
అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచించింది. మత్సకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది. అల్పపీడన ప్రభావంతో కోనపాపపేట వాసులు ఆందోళనకు గురవుతున్నారు. మరిన్ని వివరాల కోసం లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ను చూడండి..
నైరుతి బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం ఉపరితల ఆవర్తనంతో కొనసాగుతోంది. రానున్న 24గంటల్లో దాదాపు వాయువ్య దిశగా ఉత్తర తమిళనాడు, దక్షిణకోస్తా తీరం వైపు వెళ్లే అవకాశం ఉంది. ఆతర్వాత 24 గంటల్లో దాదాపు ఉత్తరం దిశగా ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడి పయనించే అవకాశం ఉంది. ఈ మేరకు వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది..
ఆదివారం ఆగ్నేయ బంగాళాఖాతములో ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావం వల్ల.. సోమవారం ఉదయం ఎనిమిదిన్నర గంటలకు దక్షిణ మధ్య బంగాళాఖాతములో అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 3.1 కి.మీ ఎత్తు వరకు విస్తరించింది. తరువాత రెండు రోజులలో ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా బలపడి పశ్చిమ-వాయువ్య దిశగా తమిళనాడు తీరం వైపు కదిలే అవకాశముందని వాతావరణశాఖ అంచనా వేసింది.
అల్పపీడన ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.. దీని ప్రభావంతో రానున్న మూడు రోజులు ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అమరావతి వాతావరణ కేంద్రం సూచించింది.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ను చూడండి..
బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.. రానున్న రెండు రోజులు కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.. బుధవారం, గురువారం వాతావరణ పరిస్థితుల గురించి తెలుసుకోండి..
ఏపీలో వింత వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒకవైపు చలి వణికిస్తుంటే.. మరోవైపు అల్పపీడనం దూసుకొస్తోంది. ఈ మేరకు వాతావరణ శాఖ అధికారులు.. ప్రజలను అలెర్ట్ చేశారు...
గల్ఫ్ ఆఫ్ మన్నార్ & పరిసర ప్రాంతాలపై తీవ్రఅల్పపీడనంకు అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో పలు జిల్లాలకు వర్ష సూచన చేసింది. అటు తెలంగాణలో.. చలి, పొగమంచు ఉంటుందని వెల్లడించింది.