Weather Alert: తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో వర్షాలు.. ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్..
తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత బాగా తగ్గింది. అయితే.. కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఉదయం పూట చలితోపాటు.. దట్టమైన మంచు కురుస్తోంది. ముఖ్యంగా పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి.. ఈ తరుణంలో తెలుగు రాష్ట్రాలు.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వాతావరణ పరిస్థితులపై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది.

తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత బాగా తగ్గింది. అయితే.. కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఉదయం పూట చలితోపాటు.. దట్టమైన మంచు కురుస్తోంది. ముఖ్యంగా పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి.. ఈ తరుణంలో తెలుగు రాష్ట్రాలు.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వాతావరణ పరిస్థితులపై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. అల్పపీడన ద్రోణి ప్రభావంతో పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.. అల్పపీడన ద్రోణి ఉత్తర కేరళ, అరేబియా సముద్రం వైపు ముందుకు కదులుతోందని.. దీంతో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ వాతావరణం..
అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్, యానములో దిగువ ట్రోపో ఆవరణములో ఈశాన్య, తూర్పు దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు ఈ కింది విధంగా ఉన్నాయి.
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాం:-
సోమవారం, మంగళవారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశము ఉంది. పొగమంచు ఒకటి లేదా రెండుచోట్ల కురిసే అవకాశము ఉంది.
బుధవారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశము ఉంది.
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్:-
సోమవారం, మంగళవారం, బుధవారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశము ఉంది.
రాయలసీమ:-
సోమవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.
మంగళవారం, బుధవారం పొడి వాతావరం ఏర్పడే అవకాశముంది.
గమనిక :- రాగల 5 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, యానములో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదులో గణనీయమైన మార్పు ఉండదు.
తెలంగాణలో వాతావరణ సూచనలు..
తెలంగాణలో పొడి వాతావరణం ఉంటుంది. వర్ష సూచనలు లేవు.. ఆకాశం మేఘావృతమై ఉంటుంది.. కొన్ని ప్రాంతాల్లో చలితోపాటు.. మంచు కురుస్తుంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
