AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గుర్రాలపై ఆదివాసీల నిరసన.. మూడు కిలోమీటర్లు యాత్ర చేసి.. ఎందుకో తెలుసా

గుర్రాలపై ఆదివాసీల నిరసన.. మూడు కిలోమీటర్లు యాత్ర చేసి.. ఎందుకో తెలుసా

Phani CH
|

Updated on: Jan 26, 2026 | 3:29 PM

Share

అనకాపల్లి జిల్లా సమలమ్మ కొండపై 21 పీవీటీజీ కొందు కుటుంబాలకు రహదారి సౌకర్యం కరువైంది. అత్యవసర వైద్యానికి డోలీమోతలే దిక్కు. రోడ్డు లేక ప్రాణాలు కోల్పోతున్నారు. పశువుల బంద గ్రామస్థులు గుర్రాలపై జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించి, తక్షణమే రోడ్డు వేయాలని, పీవీటీజీ ధ్రువపత్రాలు అందించాలని డిమాండ్ చేశారు.

వాళ్లంతా అమాయక ఆదివాసీలు.. కొండ శిఖర గ్రామంలో నివాసం.. ఇరవై ఒక కుటుంబాలు నూటా ఇరవై మంది వరకు జనాభా.. పశువుల బంధ, సోంపురం గ్రామాల్లో సమాలమ్మ కొండపై జీవనం.. కాళ్లు అరిగేలా అధికారుల చుట్టూ తిరిగారు.. కనిపించిన వారందరికీ వినతి పత్రాలు సమర్పించారు.. పట్టించుకునే నాధుడే లేకపోవడంతో ఇక గళం విప్పారు.. త్రి వర్ణ పతాకాలతో గుర్రాలపైనే ర్యాలీ చేశారు.. అనకాపల్లి జిల్లా చోడవరం మాడుగుల నియోజకవర్గాల్లోని ఈ మాడుగుల మండలం ఉగురువాడ పంచాయతీ పశువుల బందలో ఎనిమిది పివిటీజీ కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. అలాగే రావికామతం మండలం చీమలపాడు పంచాయతీ జీలుగులోవ, సోంపురంబంధ గ్రామాల్లో 13 పివిటిజి కొందు కుటుంబాలు సామలమ్మ కొండపై జీవనం సాగిస్తూ ఉన్నాయి. ఆదివాసీ గిరిజన గ్రామాల్లో 21 కుటుంబాలు 120 మంది జనాభా జీవనం… వారికి కనీస సౌకర్యాలు ఆమడ దూరం.. గ్రామానికిరోడ్డు సౌకర్యం లేదు… PVTG కొందు గిరిజనులకు ధ్రువపత్రాలు లేవు.. ఏదైనా కష్టం వస్తే డోలీమోతలే వారికి దిక్కు.. కాలినడక, బడికి వెళ్లాలంటే గుర్రాల పైన వాళ్ళ సవారి. దీంతో ఇక చేసేదిలేక ఆందోళన బాట పట్టారు. రోడ్డు సౌకర్యం కల్పించాలంటూ గుర్రాలతో ర్యాలీ నిర్వహించారు. స్వాతంత్రం వచ్చి ఏళ్ళు గడుస్తున్న.. గణతంత్ర దినోత్సవాలు జరుపుకుంటున్న.. తమ సమస్యలు మాత్రం తిరడం లేదంటూ ఆవేదన చెందారు. జాతీయ జెండా పట్టుకుని పశువులు బంధ నుంచి బంగారు బందరు రోడ్డు వరకు మూడు కిలోమీటర్లు నిరసన ప్రదర్శన చేశారు. వారి ఆవేదన ఇదే.. రోడ్డు సౌకర్యం లేకపోవడంతో అనారోగ్యం పాలైన వారిని సకాలంలో ఆసుపత్రికి తరలించలేక సేదరి వెంకట్రావు, కొర్ర బాబురావు మరణించారు. అలాగే.. గర్భిణీ స్త్రీలు తో పాటు ఎవరికైనా అనారోగ్యం గురైతే డోలి కట్టాల్సిందే. కిలోమీటర్ల వరకు డోలి మోయాల్సిందే. డోలి కట్టుకొని మూడు కిలోమీటర్లు ఎత్తయినకొండలు దాటుకుంటూ బంగారుబందులు బీటి రోడ్డు వరకుడోలిలో తీసుకొస్తారు. అక్కడి నుంచి కొత్తకోట పీహెచ్ సి కి వెళ్తారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కల్పించారు. కానీ రోడ్డు సౌకర్యం లేదు. దింతో.. రహదారి సౌకర్యం కోసం అనకాపల్లి జిల్లా కలెక్టర్ కు పలుమార్లు ఫిర్యాదు చేసామని… రహదారి లేక డోలుమూతలు తప్పడం లేదని వాపోయారు. రేషన్ బియ్యం, పెన్షన్, నిత్యవసరవస్తువులు తెచ్చుకోవాలంటే గుర్రాల మీదే ప్రయాణం చేయవలసి వస్తుందని వారి ఆవేదన. వెంటనే అధికారులు తమ సమస్యను గుర్తించి.. పశువులు బంద, జీడుగులోవ, సోంపురం బందరు వరకు రోడ్డు సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన ప్రదర్శనలో గిరిజన నాయకుడు గోవిందరావు, పీవీటిజీ నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రెడ్ కార్పరేట్ తో మాజీ మావోయిస్టు నేత కీ ఘన స్వాగతం.. పువ్వులు చల్లిన స్థానికులు

టీ చేతికి ఇవ్వలేదని దారుణం.. CCTVలో రికార్డు అయిన దృశ్యం

బైక్, కారు రిజిస్ట్రేషన్స్‌ ఇకపై అక్కడే.. RTOకి వెళ్లాల్సిన అవసరం లేదు

8వ తరగతి విద్యార్థి అద్భుత ప్రతిభ.. ఉపాధ్యాయుడి ప్రోత్సాహంతో సృజనాత్మకత

రేకుల ఇంట్లో రచ్చ రచ్చ.. తలుపు తీసి చూసిన పోలీసులకు షాక్