వాతావరణ శాఖ వర్షాలపై బిగ్ అప్డేట్ ఇచ్చింది.. రాబోయే మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది.. రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు ఎలా ఉన్నాయి..? వెదర్ రిపోర్ట్ ఎలా ఉందో చూడండి..
రెండు మూడు రోజుల పాటు ఏపీలో వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడడంతో ఆది, సోమ, మంగళవారాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు పడొచ్చని వెల్లడించింది. అటు తమిళనాడు, పుదుచ్చేరిలకు కూడా వర్ష సూచన చేసింది. ఏపీ లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ తెలుసుకుందాం పదండి...
తెలుగు రాష్ట్రాల్లో చలి మళ్లీ పంజా విసురుతోంది. ప్రధానంగా.. ఏజెన్సీ ప్రాంతాల్లో గత రెండు రోజులుగా అత్యంత కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. దాంతో.. ఆయా ప్రాంతాలు చలితో వణికిపోతున్నాయి. చలితీవ్రతతో ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. రాగల మూడు రోజులు ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతాయని వాతావరణ శాఖ తెలిపింది.
జనవరి నుంచి మార్చి వరకు ఆంధ్రప్రదేశ్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని IMD తెలిపింది. జనవరి, ఫిబ్రవరి, మార్చి సీజన్లో దేశంలోని కాలానుగుణ వర్షపాతం చాలా వరకు సాధారణంగా ఉంటుంది. అల్లూరి సీతారామరాజు (ఏఎస్ఆర్), పార్వతీపురం మన్యం జిల్లాల్లోని కొండ ప్రాంతాల్లోని కొన్ని ప్రాంతాల్లో జనవరి రెండో వారం నుంచి పొగమంచు ఎక్కువగా ఉంటుందని, మూడు నాలుగు రోజుల పాటు పొగమంచు వాతావరణం కొనసాగుతుందని వాతావరణ నిపుణులు తెలిపారు.
ఏపీకి వానల ముప్పు ఇంకా వీడలేదని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లు వెల్లడించింది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమలో తేలికపాటి వర్షాలు పడే ఆస్కారం ఉన్నట్లు తెలిపింది. ఆంధ్రా లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ తెలుసుకుందాం పదండి...
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం.. బలహీనపడి అల్పపీడనంగా మారింది. దీని ప్రభావంతో తీరం వెంబడి ఈదురుగాలులు వీయనున్నాయి. ఇక రాష్ట్రంలో పలు చోట్ల భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. దీంతో చలిగాలులు మరికాస్త తీవ్రతరం కానున్నట్లు తెలిపింది..
తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరిక చేసింది. అల్పపీడన ప్రభావంతో రానున్న మూడు రోజులు విస్తరంగా వర్షాలు కురుస్తాయని .. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని ఐఎండీ వార్నింగ్ ఇచ్చింది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు పడుతాయని IMD అధికారులు చెబుతున్నారు. రెండ్రోజులుగా ఎడతెరపిలేని వర్షాలతో ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు. సముద్రవేటకు వెళ్లొద్దని సూచించారు.
తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరిక చేసింది. అల్పపీడన ప్రభావంతో రానున్న మూడు రోజులు విస్తరంగా వర్షాలు కురుస్తాయని .. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని ఐఎండీ వార్నింగ్ ఇచ్చింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాతావరణం ఎలా ఉండనుంది.. ఐఎండీ అధికారులు ఏం చెబుతున్నారు అనే విషయాలను తెలుసుకోండి..
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి అలజడి రేపుతోంది.. ఈ క్రమంలో వాతావరణ శాఖ కీలక ప్రకటన విడుదల చేసింది.. అల్పపీడనం ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయిని వాతావరణ శాఖ తెలిపింది.. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ రాగల మూడు రోజులకు సంబంధించిన వాతావరణ పరిస్థితులపై ప్రకటన విడుదల చేసింది..
ఆంధ్రప్రదేశ్ను తుఫాన్లు వెంటాడుతున్నాయా?.. గత కొన్నాళ్లుగా ఏపీని వరుసగా తుఫాన్లు వెంటాడుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనాలు, ఆవర్తనాలతో ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు దంచికొట్టాయి. తాజాగా.. ఏపీకి తుఫాన్ ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని తెలిపింది.