Tollywood: సినిమాలకు గుడ్‌బై.. రియల్ ఎస్టేట్ ఏజెంట్‌గా మారిపోయిన టాలీవుడ్ హీరోయిన్.. మంచి గానే సంపాదిస్తోందిగా
గతంలో హీరోయిన్లుగా ఓ వెలుగు వెలిగిన ముద్దుగుమ్మలు మళ్లీ ఇప్పుడు రీ ఎంట్రీ ఇస్తున్నారు. సెకెండ్ ఇన్నింగ్స్ అంటూ సహాయక నటులుగా మెరుస్తున్నారు. అయితే ఒక టాలీవుడ్ హీరోయిన్ మాత్రం ఇప్పుడు రియల్ ఎస్టేజ్ ఏజెంట్ గా మారిపోయి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగి ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు చేస్తోన్న నటీమణులను మనం చూస్తూనే ఉన్నాం. పెళ్లి, పిల్లల కారణంగా ఇండస్ట్రీకి దూరమైన హీరోయిన్లలో చాలా మంది ఇప్ఉడు రీ ఎంట్రీలు, సెకెండ్ ఇన్నింగ్స్ లు అంటూ మళ్లీ కెమెరా ముందుకు వస్తున్నారు. ముఖానికి మేకప్ వేసుకుని సహాయక నటులుగా మెప్పిస్తున్నారు. అదే సమయంలో మరికొందరు అందాల తారలు వ్యాపార రంగంలో అద్భుతాలు సృష్టిస్తున్నారు. పవర్ ఫుల్ బిజినెస్ వుమెన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఈ క్రమంలో గతంలో పలు తెలుగు సినిమాల్లో హీరోయిన్ గా నటించిన ఓ ముద్దుగుమ్మ ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఏజెంట్ గా మారి అందరినీ ఆశ్చర్యపరిచింది. చాలా మంది లాగే ఈమె కూడా బాల నటిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత హీరోయిన్ గానూ సక్సెస్ అయ్యింది. తెలుగుతో పాటు హిందీ సినిమాల్లోనూ కథానాయికగా నటించింది. కేవలం నటనతోనే కాకుండా నిర్మాతగానూ ఆకట్టుకుంది. అయితే ఏమైందో తెలియదు కానీ ఉన్నట్లుండి సినిమా ఇండస్ట్రీ నుంచి మాయమైంది. ఇప్పుడు దుబాయ్ లో స్థిర పడిన ఆమె రియల్ ఎస్టేట్ ఏజెంట్ గా వర్క్ చేస్తోంది. ఇంతకీ ఆమె ఎవరనుకుంటున్నారా మెగాస్టార్ చిరంజీవి అందరి వాడు సినిమా హీరోయిన్ రిమీ సేన్.
2001లో ‘ఇదే నా మొదటి ప్రేమలేఖ’తో తెలుగు ఆడియెన్స్ ను పలకరించింది రిమీ సేన్. అందరి వాడు సినిమాతో తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరువైంది. ఇక హిందీ ధూమ్ వంటి సూపర్ హిట్ సినిమాల్లోనూ హీరోయిన్ గా చేసింది. ఇక 2011లో ధులియా దర్శకత్వంలో వచ్చిన తిగ్మాన్షూ అనే సినిమాలో చివరిగా కనిపించిందీ అందాల తార. అయితే సినిమా అవకాశాలు తగ్గడంతోనే తాను దుబాయ్ కు వెళ్లి వ్యాపారం చేసుకుంటున్నానంటోంది రిమీసేన్. తాజాగా ఓ ఇంటర్వ్యూ కు హాజరైన ఆమె ఈ మాట చెప్పడంతో ఒక్కసారిగా నటి పేరు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
దుబాయ్ లో రిమీ సేన్..
View this post on Instagram
‘దుబాయ్ నన్ను ఎంతో ప్రేమతో స్వాగతించింది. ఇక్కడి జనాభాలో 95 శాతం మంది ప్రవాసులే ఉన్నారు. దుబాయ్ ప్రజలు అందరి గురించి ఆలోచిస్తారు. సౌకర్యవంతమైన జీవితాన్ని గడపొచ్చు. భారత్‌తో పోలిస్తే.. దుబాయ్‌లో వ్యాపార అవకాశాలు సులభంగా లభిస్తాయి. ఇక్కడ రియల్ ఎస్టేట్ మార్కెట్ కూడా సజావుగా పనిచేస్తుంది ఎందుకంటే క్రమశిక్షణ ఎక్కువ’ అని రిమీ సేన్ తెలిపింది. దీంతో ప్రస్తుతం ఈ నటి ఫొటోలు నెట్టింట బాగా వైరలవుతున్నాయి.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




