Actor Rajendran: ఆ ఒక్క ఘటనతో అంతా మారిపోయింది.. ఈ స్టార్ కమెడియన్ గుండు వెనక కన్నీళ్లు తెప్పించే విషాదం
ఈ తమిళ నటుడు తెలుగులోనూ బాగా ఫేమస్. వాల్తేర్ వీరయ్య, ఓజీ వంటి డైరెక్ట్ తెలుగు సినిమాల్లోనూ నటించి మెప్పించాడీ ట్యాలెంటెడ్ యాక్టర్. అయితే రీల్ లైఫ్ లో అయినా రియల్ లైఫ్ లో అయినా ఎప్పుడూ గుండుతోనే కనిపిస్తుంటాడీ స్టార్ కమెడియన్. కను రెప్పలు కూడా ఉండవు. అయితే దీని వెనక ఓ కన్నీటి విషాదం ఉంది.

మొట్ట రాజేంద్రన్.. పేరు చెబితే గుర్తు పట్టలేరు కానీ పై ఫొటో చూస్తే ఇట్టే గుర్తు పట్టేస్తారు. బక్కగా, గుండుతో కనిపిస్తూ ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్విస్తున్నాడు రాజేంద్రన్. పేరుకు తెలుగు నటుడే అయినా తెలుగులోనూ ఈ కమెడియన్ కు మంచి గుర్తింపు ఉంది. అందుకే ఇప్పుడు తమిళ్ సినిమాలతో పాటు తెలుగు స్ట్రెయిట్ సినిమాల్లోనూ నటిస్తూ బిజీ బిజీగా ఉంటున్నాడు. తెలుగులో చలో, ఎఫ్ 3, వాల్తేర్ వీరయ్య, సర్, విమానం, ఓజీ, త్రిబాణధారి బార్బరిక్, త్రిముఖ వంటి పలు చిత్రాల్లో కమెడియన్ గా, సహాయక నటుడిగా ఆకట్టుకున్నాడు రాజేంద్రన్. ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళ్, మలయాళ సినిమాల్లోనూ సత్తా చాటుతున్నాడీ ట్యాలెంటెడ్ యాక్టర్. అయితే రీల్ లైఫ్ లో అయినా రియల్ లైఫ్ లో అయినా ఎప్పుడూ గుండుతోనే కనిపిస్తుంటాడు రాజేంద్రన్. కనీసం కనురెప్పలు కూడా ఉండవు. ఒకప్పుడు ఒత్తైన జుట్టుతో హీరో మెటీరియల్ గా ఉండే రాజేంద్రన్ ఇలా గుండుతో మారిపోవడం వెనక ఒ కన్నీటి విషాదం ఉంది.
కెరీర్ ప్రారంభంలో స్టంట్‌మెన్‌గా పనిచేశాడు రాజేంద్రన్. పలు సినిమాలకుగానూ బెస్ట్ స్టంట్ మ్యాన్ గా అవార్డులు కూడా గెల్చుకున్నాడు. అలాగే పలువురు హీరోల స్థానంలో యాక్షన్ సీన్లు (స్టంట్ డబుల్) కూడా చేసేవాడు. అలా సుమారు 500కు పైగా చిత్రాల్లో ఫైటర్ గా వర్క్ చేశాడు రాజేంద్రన్. అయితే ఓ మలయాళ సినిమా షూటింగ్ లో రాజేంద్రన్ కు ప్రమాదం జరిగింది. అందుకే ఇలా మారిపోయాడట. ఈ విషయాన్ని రాజేంద్రనే ఓ సందర్భంలో పంచుకున్నాడు.
‘ఒక మలయాళ సినిమా షూటింగ్‌లో 15 అడుగుల ఎత్తులో నుంచి కింద నీళ్లలో పడాల్సి ఉంటుంది. నేను ఆలోచించకుండా దూకేశాను. తీరా ఆ ఊరివాళ్లు చూసి.. ఇదంతా ఫ్యాక్టరీల నుంచి వచ్చే కెమికల్ వాటర్.. ఈ నీళ్లలో ఎందుకు దూకారు? అన్నారు. అలా అప్పటి నుంచే జుట్టురాలడం మొదలైంది. కొంతకాలానికే మొత్తం గుండు అయిపోయింది. కనుబొమ్మలు కూడా పోయాయి. రసాయనాలు కలిసిన నీళ్లు కడుపులోకి వెళ్లడంతో పలు అనారోగ్య సమస్యలు కూడా వచ్చాయి. జీర్ణాశయ సమస్యలు కూడా తలెత్తాయి. అయితే మెల్లగా ఈ సమస్యల నుంచి కోలుకున్నాను’ అని చెప్పుకొచ్చాడు రాజేంద్రన్.
కాగా ఈ ప్రమాద జరిగిన తర్వాతి నుంచే తనకు విలన్‌గా కాకుండా కామెడీ రోల్స్ వచ్చాయంటున్నాడు రాజేంద్రన్. విగ్ కూడా పెట్టుకోకుండా అలాగే నటించమని దర్శకుడు చెబుతున్నారని అంటున్నాడు. నఏదైతే మైనస్ అనుకున్నానో అదే నాకు ప్లస్ అయ్యిందని సంతోషంతో చెబుతున్నాడీ స్టార్ కమెడియన్.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




