OTT Movie: హింట్ ఇచ్చి మరీ పోలీసులను చంపే సీరియల్ కిల్లర్.. ఓటీటీలో కిర్రాక్ క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ
ఈ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మొదటి సన్నివేశం నుంచే మిమ్మల్ని ఉత్కంఠకు గురి చేస్తుంది. ఇక మధ్యలో వచ్చే ట్విస్టులు మీకు మరింత థ్రిల్ అందిస్తాయి. మూవీ క్లైమాక్స్ కూడా చాలా కొత్తగా ఉంటుంది. ఇప్పుడీ ఈ చిత్రానికి OTT ప్లాట్‌ఫామ్‌లో మంచి స్పందన వస్తోంది.

OTT ప్లాట్‌ఫామ్‌లో ప్రతి వారం అనేక సినిమాలు , వెబ్ సిరీస్‌లు విడుదలవుతాయి. వీటిలో కొన్ని సినిమాలు మాత్రమే ప్రేక్షకులకు నచ్చుతాయి. మరీ ముఖ్యంగా ఈ మధ్యన ఆడియెన్స్ ఎక్కువ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు చూడడానికి ఇష్టపడుతున్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఒక సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ గురించే. వాస్తవానికి, ఈ సినిమా ఐదు సంవత్సరాల క్రితం థియేటర్లలో విడుదలైంది. ఆ తర్వాత, OTTలో వచ్చిన వెంటనే, దీనికి ప్రేక్షకుల నుంచి భారీ స్పందన వచ్చింది. ఇప్పటికీ ఈ సినిమా OTTలో ట్రెండింగ్‌లో ఉంది. ఈ సినిమాలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. 2020లో విడుదలైన ఈ చిత్రం IMDbలో 7.9 రేటింగ్‌ను పొందింది. ఈ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ 2 గంటల 24 నిమిషాల నిడివి ఉంది. కథ కూడా చాలా కొత్తగా ఉంటుంది. ఒక్కసారి చూడడం స్టార్ట్ చేస్తే ఎండ్ కార్డ్ పడేదాక అసలు ఆపరరు. ఎందుకంటే ఇందులోని ప్రతి సన్నివేశం ఆసక్తికరంగా ఉంటుంది. ట్విస్టులు ఆకట్టుకుంటాయి. కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఉదాహరణకు, సైకో సైమన్ పాత్ర 2017 నందన్‌కోడ్ మారణహోమం ఆధారంగా తెరకెక్కింది. ఈ సంఘటనలో, ఒక మానసిక రోగి బాలుడు తన మొత్తం కుటుంబాన్ని చంపాడు. దీనితో పాటు, రిప్పర్ రవి పాత్ర 1980ల చివరలో కేరళలో ఒక ప్రసిద్ధ సీరియల్ కిల్లర్ అయిన రిపన్ చంద్రన్ ఆధారంగా రూపొందింది.
ఈ సినిమా విషయానికి వస్తే.. కేరళ పోలీసులకు సహాయం చేసే అన్వర్ అనే కన్సల్టింగ్ క్రిమినాలజిస్ట్ చుట్టూ ఈ మూవీ తిరుగుతుంది. వరుస హత్యలు జరిగినప్పుడు, నేరస్థుడిని కనుగొనడానికి కేరళ పోలీసులు ఇతని సహాయం తీసుకుంటారు. ఇది 2020లో బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళ చిత్రంగా నిలిచింది. ఈ చిత్రం విజయం సాధించిన తర్వాత, మిధున్ మాన్యువల్ థామస్ దాని సీక్వెల్‌ను ప్రకటించారు.
ఆద్యంతం ట్విస్టులతో సాగే ఈ సినిమా పేరు అంజం పతిరా. తెలుగు, హిందీ భాషల్లో ‘మిడ్ నైట్ మర్డర్స్ అండ్ పోలీస్ స్టోరీ’ పేరుతో డబ్ చేశారు. ‘మిధున్ స్వయంగా కథ అందించడంతో పాటు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో కుంచాకో బోబన్, షరాఫ్ యు ధీన్, శ్రీనాథ్ భాసి, ఉన్నిమాయ ప్రసాద్, జిను జోసెఫ్, అభిరామి రాధాకృష్ణన్ తదితరులు నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ఆహా తెలుగులో స్ట్రీమింగ్ అవుతోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




