Allu Arjun: గుర్తు పట్టి మరీ పలకరించిన అల్లు అర్జున్.. ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్న మహిళాభిమాని.. వీడియో ఇదిగో
ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేసిన ‘పుష్ప 2: ది రూల్’ సినిమా ఇప్పుడు జపాన్ లోనూ సందడి చేస్తోంది. ఇటీవలే ఈ మూవీ జపనీస్ వెర్షన్ థియేటర్లలో రిలీజ్ కాగా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇక హీరో అల్లు అర్జున్ సైతం జపాన్ లోనే ఉంటూ తన సినిమాను మరింత ప్రమోట్ చేసుకుంటున్నాడు.

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు జపాన్ లో పర్యటిస్తున్నాడు. తన భార్య అల్లు స్నేహ రెడ్డి, పిల్లలు అయాన్, అర్హలతో కలిసి అక్కడి చారిత్రాత్మక ప్రాంతాలు, పర్యాటక ప్రదేశాలను సందర్శిస్తున్నాడు. అలాగే ఇటీవలే జపాన్ లో రిలీజైన తన పుష్ప 2 సినిమా ప్రమోషన్లలోనూ చురుగ్గా పాల్గొంటున్నారు. అక్కడి మీడియా సంస్థలకు వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. అలాగే అభిమానులతోనూ సమావేశమవుతున్నారు. అలా పుష్ప 2 ప్రమోషన్లలో భాగంగా టోక్యోలోని తన అభిమానులను కలిశాడు ఐకాన్ స్టార్. ఈ సందర్భంగా ఒక ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. అక్కడున్న ఫ్యాన్స్ అందరితోనూ కరచాలనం చేసి ఆప్యాయతగా మాట్లాడాడు అల్లు అర్జున్. ఇదే క్రమంలో ఒక మహిళాభిమానికి కూడా షేక్ హ్యాండ్ ఇచ్చి పలకరించాడు. దీంతో సదరు అభిమాని బాగా ఎమోషనల్ అయ్యింది. ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంది. పక్కనున్న వాళ్లు ఆమెను ఓదార్చడానికి ప్రయత్నించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరలవుతోంది.
కాగా అల్లు అర్జున్ తన ఫ్యామిలీని తీసుకుని టోక్యోలోని పర్యాటక ప్రదేశాలన్నింటినీ చుట్టేస్తున్నాడు. గత వారం రోజులుగా ఇక్కడే ఉంటోన్న అల్లు ఫ్యామిలీ తాజాగా టోక్యోలోని బౌద్ధ సెన్సో-జి ఆలయాన్ని దర్శించుకుంది. ఇందుకు సంబంధించి ఫొటోలను అల్లు స్నేహా రెడ్డి సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. ఈ ఫొటోలు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఇక జనవరి 16న విడుదలైన పుష్ప 2 ది రూల్ జపనీస్ వెర్షన్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది.
అభిమానులతో అల్లు అర్జున్.. వీడియో..
View this post on Instagram
2024 డిసెంబర్ 05న పుష్ప 2 థియేటర్లలో విడుదలైంది. ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టేసింది. ప్రపంచవ్యాప్తంగా 2000 కోట్లకు పైగా వసూళ్లు సాధించి దంగల్ తర్వాత అత్యధిక వసూళ్లు చేసిన రెండో భారతీయ చిత్రంగా నిలిచింది. ఇందులో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించింది. సుకుమార్ దర్శకత్వం వహించారు.
Happy for you @harish2you Garu ♥️♥️#AlluArjun DJ fans 🔥🔥🔥 pic.twitter.com/6h81oKnNRT
— Swaasthi (@swaasthi) January 18, 2026
టోక్యోలోని పురాతన టెంపుల్ లో అల్లు అర్జున్ ఫ్యామిలీ..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




