AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Durandhar Movie: గోల్డెన్ ఛాన్స్ మిస్! ‘ధురంధర్’లో విలన్‌ రోల్‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ స్టార్ ఎవరో తెలుసా?

బాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన సినిమా 'ధురంధర్'. గతేడాది డిసెంబర్ లో రిలీజైన ఈ సినిమా ఇప్పటికీ హౌస్ ఫుల్ కలెక్షన్లతో ఆడుతోంది. అలాగే ఈ మూవీ కలెక్షన్లు కూడా రూ. 1300 కోట్లను కూడా దాటేశాయి. అయితే ఇప్పుడీ ధురంధర్ మూవీ గురించి ఒక ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది.

Durandhar Movie: గోల్డెన్ ఛాన్స్ మిస్! 'ధురంధర్'లో విలన్‌ రోల్‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ స్టార్ ఎవరో తెలుసా?
Dhurandhar Movie
Basha Shek
|

Updated on: Jan 17, 2026 | 5:41 PM

Share

రణ్‌వీర్ సింగ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘ధురంధర్’. ‘ఉరి’ ఫేమ్ ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ స్పై ఈ యాక్షన్ థ్రిల్లర్ లో అక్షయ్ ఖన్నా, సారా అర్జున్, ఆర్. మాధవన్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. బాక్సాఫీస్ దగ్గర భారీ కలెక్షన్లు రాబట్టింది. ఇప్పటి వరకు ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా రూ.1300 కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చినట్లు సమాచారం. ఈ సినిమాతో రణ్‌వీర్ సింగ్ కు ఎంత మంచి పేరొచ్చిందో విలన్ గా అక్షయ్ ఖన్నాకు కూడా అంతే క్రేజ్ వచ్చింది. కొన్ని సీన్లలో అయితే రణ్ వీర్ కంటే అక్షయ్ ఖన్నానే బాగా నటించాడని ప్రశంసలు వచ్చాయి. రెహమాన్ డకైట్ పాత్రలో ఈ బాలీవుడ్ నటుడి ఒదిగిపోయాడని విమర్శకులు తెగ పొగిడేశారు. కాగా ధురంధర్ పార్ట్ 1లో అక్షయ్ పాత్ర చనిపోతుంది. కానీ ఈ రోల్ కు ఉన్న క్రేజ్ దృష్ట్యా సెకెండ్ పార్ట్ లో రెహ్మాన్ డకైట్ పాత్రను మళ్లీ బతికించవచ్చని ప్రచారం జరుగుతోంది.

అయితే ధురంధర్ సినిమాలో విలన్ గా అక్షయ్ ఖన్నా ఫస్ట్ ఛాయిస్ కాదట. ఈ క్యారక్టర్ కోసం మూవీ మేకర్స్ ముందుగా మన టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జునను సంప్రదించారట. కథ కూడా విని బాగా ఉందన్నారట. అయితే అప్పటికే నాగ్ కూలీ, కుబేర చిత్రాల్లో బిజీగా ఉండడంతో ధురంధర్ సినిమాకు డేట్స్ అడ్జెస్ట్ చేయలేకపోయాడట. దీంతో ధురందర్ మేకర్స్ అక్షయ్ ఖన్నాను తీసుకున్నారట. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట బాగా వైరలవుతోంది. ఇందులో నిజమెంతుందో తెలియదు కానీ ఒకవేళ నాగార్జున ధురంధర్ సినిమా చేసి ఉండుంటే బాగుండేదని ఆయన అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

ఇవి కూడా చదవండి

ధురంధర్ సినిమాలో అక్షయ్ ఖన్నా..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

'ధురంధర్'లో విలన్‌ రోల్‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ హీరో ఎవరంటే?
'ధురంధర్'లో విలన్‌ రోల్‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ హీరో ఎవరంటే?
చచ్చాంరా బాబోయ్...అసలే ఉప్పు తినొద్దంటుంటే అందులోనూ కల్తీనా?
చచ్చాంరా బాబోయ్...అసలే ఉప్పు తినొద్దంటుంటే అందులోనూ కల్తీనా?
కష్టాలను తట్టుకుని పట్టుదలే పెట్టుబడిగా.. పర్పుల్ డ్రీమ్స్‌తో..
కష్టాలను తట్టుకుని పట్టుదలే పెట్టుబడిగా.. పర్పుల్ డ్రీమ్స్‌తో..
రథ సప్తమి నుంచి వారి జీవితాల్లో కొత్త వెలుగులు..!
రథ సప్తమి నుంచి వారి జీవితాల్లో కొత్త వెలుగులు..!
వివాదాల సుడిగుండంలో టాక్సిక్ టీజర్
వివాదాల సుడిగుండంలో టాక్సిక్ టీజర్
ఫేక్.. ప్లాస్టిక్ కోడి గుడ్లను ఎలా గుర్తించాలో తెలుసా?
ఫేక్.. ప్లాస్టిక్ కోడి గుడ్లను ఎలా గుర్తించాలో తెలుసా?
వాహనదారులకు కేంద్రం బిగ్ షాక్.. ఇకపై టోల్ చెల్లించాలంటే..
వాహనదారులకు కేంద్రం బిగ్ షాక్.. ఇకపై టోల్ చెల్లించాలంటే..
హైదరాబాద్‌లో ఇల్లు కట్టాలంటే కొత్త రూల్స్.. 10 అంతస్తులు దాటితే..
హైదరాబాద్‌లో ఇల్లు కట్టాలంటే కొత్త రూల్స్.. 10 అంతస్తులు దాటితే..
తీపి తిన్నా షుగర్ పెరగదా? డయాబెటిస్ బాధితులకు బంపర్ గిఫ్ట్!
తీపి తిన్నా షుగర్ పెరగదా? డయాబెటిస్ బాధితులకు బంపర్ గిఫ్ట్!
మగవాళ్లకు ఫ్రీ బస్ స్కీమ్.. ఆడవారికి నెలకు రూ.2వేలు.. ఎక్కడో..
మగవాళ్లకు ఫ్రీ బస్ స్కీమ్.. ఆడవారికి నెలకు రూ.2వేలు.. ఎక్కడో..