Actress : నా ముఖం నా ఇష్టం.. ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
సాధారణంగా హీరోయిన్లు ఎక్కువగా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటారనే టాక్ నడుస్తుంటుంది. తమ అందాన్ని పెంచుకోవడానికి ఎంతటి రిస్క్ అయిన చేస్తుంటారు. అయితే ఈ విషయం మాత్రం నెట్టింట ఎప్పుడూ చక్కర్లు కొడుతుంటాయి. పెద్ద హీరోయిన్లు కూడా దీన్ని ప్రయత్నించారు. కొందరు తాము ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నామని కూడా ఒప్పుకుంటారు...

హీరోయిన్లు ప్లాస్టిక్ సర్జరీ.. ఈ అంశం ఇండస్ట్రీలో ఎప్పుడూ వినిపిస్తుంది. అయితే కొందరు తారలు తమ అందం పెంచుకోవడానికి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నామని ఒప్పుకుంటారు. మరికొందరు మాత్రం కొట్టిపారేస్తుంటారు. ప్రస్తుతం, ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న అందాల జాబితాలో ప్రియాంక చాహర్ చౌదరి పేరు వినిపిస్తుంది. తాజాగా ఈ రూమర్స్ పై స్పందించిన ప్రియాంక.. ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రియాంక చాహర్ చౌదరి.. హిందీ టెలివిజన్‌లో అందాల తార. 2019లో ”ఘట్ బంధన్” సీరియల్‌తో టెలివిజన్‌లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత ”యే హై చాహతే”.. ”ఉదారియా” సీరియల్స్‌లో కనిపించింది. సల్మాన్ ఖాన్ హోస్ట్ చేసిన హిందీ ”బిగ్ బాస్” 16వ సీజన్‌లో కూడా పాల్గొంది. ఆమె రెండవ రన్నరప్‌గా నిలిచింది.
ఎక్కువ మంది చదివినవి: Soundarya: అప్పట్లో సౌందర్య రెమ్యునరేషన్ అంతే.. ఒక్కో సినిమాకు ఎంత తీసుకునేదంటే.. ?
ఏక్తా కపూర్ దర్శకత్వం వహించిన ప్రసిద్ధ హిందీ టెలివిజన్ సీరియల్ ”నాగిన్ 7” లో ప్రియాంక చాహర్ చౌదరిని ప్రధాన పాత్ర నటించింది. ఆమె నాగిన్ పాత్రతో పాపులర్ అయ్యింది. గతంలో ఓ ఇంటర్వ్యూలో, ప్రియాంక తనపై వినిపిస్తున్న ప్లాస్టిక్ రూమర్స్ పై స్పందించింది. ప్రియాంక చాహర్ చౌదరి మాట్లాడుతూ “రూమర్స్ నిన్నటివి కాదు. చాలా రోజులుగా ఇది వినిపిస్తోంది. గత సంవత్సరం, నా ఆరోగ్యం హెచ్చుతగ్గులకు గురైంది. నేను చాలా మందులు తీసుకున్నాను, యాంటీబయాటిక్స్ తీసుకున్న తర్వాత, నేను బరువు తగ్గానని, కానీ అదే సమయంలో నా ముఖం వాచిపోయింది అని అన్నారు.
ఎక్కువ మంది చదివినవి: Rambha: హీరోయిన్ రంభకు ఇంత పెద్ద కూతురు ఉందా.. ? అందంలో తల్లిని మించిపోయింది.. ఫోటోస్ వైరల్..
నా ఉబ్బిన ముఖాన్ని చూసిన తర్వాత ప్రజలు తమకు కావలసినది ఊహించుకున్నారు. ప్రతి ఒక్కరికీ తమ అందాన్ని పెంచుకునే హక్కు ఉందని ప్రియాంక అన్నారు. ప్రతిదీ వ్యక్తిగత ఎంపిక, నేను కాజల్ వేసుకున్నా లేదా లెన్స్‌లు ధరించినా, నా ముఖానికి నేను ఏదో చేశానని ప్రజలు అనుకుంటారు. ఇది నా ముఖం, నాకు నా స్వంత వ్యక్తిత్వం ఉంది” అని అన్నారు.
ఎక్కువ మంది చదివినవి: Trending Song : 25 ఏళ్లుగా యూట్యూబ్‌ను ఊపేస్తున్న సాంగ్.. 90’s యూత్‌కు ఇష్టమైన పాట.. ఇప్పటికీ ట్రెండింగ్..
View this post on Instagram
ఎక్కువ మంది చదివినవి: Jagapathi Babu : వెయ్యి కోట్లు పోగొట్టుకున్నాను.. ఇప్పుడు నా దగ్గర ఉన్న ఆస్తి ఇంతే.. జగపతి బాబు కామెంట్స్..
