Mana Shankara Vara Prasad Garu: ‘మన శంకరవరప్రసాద్ గారు’లో మెరిసిన ఈమె ఎవరో తెలుసా? చాలా ఫేమస్
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా 'మన శంకరవరప్రసాద్ గారు'. అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమాలో నయన తార, విక్టరీ వెంకటేశ్ కీలక పాత్రలు మెరిశారు. వీరితో పాటు ఈ మూవీలో నయనతార ఫ్రెండ్ గా నటించిన ఒకామె బాగా హైలెట్ అయ్యింది.

మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ సినిమా మన శంకరవప్రసాద్ గారు. అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ మెగా మూవీ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. ఇప్పటివరకు ఈ మూవీకి రూ. 226 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చినట్ల నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్ పై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మించి ఈ సినిమాలోలేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటించింది. అలాగే విక్టరీ వెంకటేష్ మరో కీలక పాత్రలో మెరిశాడు. క్యాథరీన్ థెరీసా, సచిన్ ఖేడ్కర్, హర్షవర్ధన్, అభినవ్ గోమఠం, శరత్ సక్సేనా తదితరులు వివిధ పాత్రల్లో మెరిశారు. అయితే ఇదే మన శంకరవరప్రసాద్ సినిమాలో శశి (నయనతార) ఫ్రెండ్స్ గా బుల్లితెర నటి కరుణ భూషన్ తో పాటు ఇంకొకరు మెరిశారు. సినిమా సెకండాఫ్ లో చిరంజీవి, నయనతార స్నేహితుల మధ్య వచ్చే సీన్స్ హైలెట్ గా నిలిచాయి. అందులో ముఖ్యంగా ఒకామె చెప్పిన డైలాగులు బాగా పేలాయి. ఇంతకీ ఆమె ఎవరు? మన శంకరవప్రసాద్ గారు సినిమాలో ఎలా అవకాశం వచ్చిందో తెలుసుకుందాం రండి.
ఫ్యామిలీతో యూకేలో సెటిలై ఓవైపు జాబ్ చేస్తూనే మరోవైపు సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు రమానందన అలియాస్ ‘నందు’. సోషల్ మీడియాలో చాలా పాపులర్ అయిన ఆమె Nandu’s World పేరుతో సొంతంగా యూట్యూబ్ ఛానెల్ రన్ చేస్తున్నారు. కరోనా టైం నుంచి తన వీడియోలతో అలరిస్తున్న నందు యూట్యూబ్ ఛానెల్ కు 27 లక్షల పైచిలుకు పైగా సబ్ స్క్రైబర్లు ఉన్నారు. అయిగే వృత్తి, వ్యక్తిగత జీవితంలోనూ నందు ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొందని ఆమె స్నేహితులు చెబుతున్నారు. ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని ఈరోజు ఈ స్థాయికి వచ్చింటున్నారు. ఈ క్రమంలో రమానందన గురించి ఆమె స్నేహితురాలు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ చేశారు. అందులో నందు గురించి ఇలా రాసుకొచ్చారు..
ఇన్ స్టా గ్రామ్ లో రమానందన..
View this post on Instagram
‘మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర వరప్రసాద్’ లో నందుకు అవకాశం రావడం అదృష్టమే కాదు.. ఆమె టాలెంట్ కూడా. ఎన్నో సంవత్సరాలుగా ఆమె వీడియోలు చూస్తున్న నాకు ఏదో ఒక స్టేజ్లో విమర్శల్ని తట్టుకోలేక వెనకడుగు వేస్తారేమో అనిపించేది. అయినా ఎక్కడ అదర లేదు.. బెదర లేదు. ఇప్పటికీ ఆమెని విమర్శిస్తూనే ఉంటారు. వాటన్నిటిని తిప్పి కొట్టే అవకాశం వచ్చింది ఆమెకి. ఒక లెజెండరీ నటుడి పక్కన నిలబడడమే కాదు డైలాగ్స్ చెబుతూ 5 నిమిషాల సీన్లో ఏకధాటిగా నటించే అవకాశం రావడం అంటే ఆషామాషీ కాదు. వెల్డన్ నందూ గారు. తెల్లారి లేస్తే మిమ్మల్ని ట్రోల్ చేయడమే పనిగా పెట్టుకున్న వాళ్లకు ఇచ్చి పడేసారంతే. హ్యాట్సాఫ్. ఇకపై మీ వీడియోస్ తో పాటు.. సిల్వర్ స్క్రీన్ మీద వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోండి..ఆల్ ది బెస్ట్’ అంటూ విషెస్ చెప్పారు.
మన శంకరవరప్రసాద్ గారు గురించి రమానందన మాటల్లో..
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..




