AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: ఓటీటీలో సుదీప్ లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్..

గతేడాది క్రిస్మస్ కానుకగా విడుదలైన ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. ప్రేక్షకులకు మంచి ఎంటర్ టైన్మెంట్ అందించింది. అలాగే బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లనే రాబట్టింది.గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో తెరకెక్కిన ఈ మూవీకి ఐఎమ్ డీబీలోనూ మంచి రేటింగే ఉంది.

OTT Movie: ఓటీటీలో సుదీప్ లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్..
Mark Movie
Basha Shek
|

Updated on: Jan 17, 2026 | 3:09 PM

Share

కన్నడ స్టార్ హీరో ‘కిచ్చా’ సుదీప్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా  ‘మార్క్‌’.  యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా గతేడాది క్రిస్మస్‌ కానుకగా డిసెంబర్‌ 25న విడుదలైంది. మొదటి షో నుంచే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. సినిమాలో సుదీప్ స్క్రీన్ ప్రెజెన్స్, స్టైల్, యాక్షన్ సీక్వెన్స్‌ బాగున్నాయని రివ్యూలు వచ్చాయి. అయితే కథ చాలా బలహీనంగా ఉందని, ట్విస్టులు కూడా ఊహించినట్లే ఉన్నాయని నెగెటివ్ కామెంట్స్ కూడా వచ్చాయి. అయితే సుదీప్ క్రేజ్ తో ఈ మార్క్ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లనే రాబట్టింది. ఇప్పుడీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి రానుంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ జియో హాట్ స్టార్ సొంతం చేసుకుంది. ఈ క్రమంలో జనవరి 23 నుంచి మార్క్ సినిమాను ఓటీటీలోకి తీసుకొస్తున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది. కన్నడతో పాటు తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం భాషల్లోనూ సుదీప్ సినిమా స్ట్రీమింగ్ కు రానుంది.

‘మార్క్’ సినిమా గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో తెరకెక్కింది. గతంలో మ్యాక్స్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న విజయ్ కార్తికేయ నే ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. హీరో సుదీప్ సరసన నిశ్వికా నాయుడు, రోషిక హీరోయిన్లు గా నటించారు. అలాగే యోగి బాబు, మలయాళం షైన్ టామ్ చాకో, నవీన్ చంద్ర తదితరులు ఈ సినిమాలో నటించారు. . సత్యజ్యోతి క్రియేషన్స్, సుదీప్ సొంత నిర్మాణ సంస్థ కిచ్చా క్రియేషన్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి. అలాగే సుదీప్ కూతురు సాన్వి కూడా ఈ సినిమా పంపిణీలో చేతులు కలపడం విశేషం.

ఇవి కూడా చదవండి

జియో హాట్ స్టార్ లో సుదీప్ మార్క్ సినిమా..

తెలుగులోనూ స్ట్రీమింగ్..

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..

Follow Us
అమెరికాలో ఏం జరిగింది? 13 రోజులుగా వీడని శ్రీజ మిస్సింగ్ మిస్టరీ
అమెరికాలో ఏం జరిగింది? 13 రోజులుగా వీడని శ్రీజ మిస్సింగ్ మిస్టరీ
ఏలూరు పంట పొలాల్లో అరుదైన పక్షుల సందడి!
ఏలూరు పంట పొలాల్లో అరుదైన పక్షుల సందడి!
మర్యాద రామన్నలో నటించిన ఈ కుర్రాడిని గుర్తుపట్టారా?
మర్యాద రామన్నలో నటించిన ఈ కుర్రాడిని గుర్తుపట్టారా?
19 ఏళ్లకే OYO ప్రారంభం.. నేడు వేల కోట్ల సామ్రాజ్యానికి అధిపతి!
19 ఏళ్లకే OYO ప్రారంభం.. నేడు వేల కోట్ల సామ్రాజ్యానికి అధిపతి!
మీ విజయ రహస్యం ఎవరికీ చెప్పకండి..ఈ కథ తెలిస్తే మీ ఆలోచన మారుతుంది
మీ విజయ రహస్యం ఎవరికీ చెప్పకండి..ఈ కథ తెలిస్తే మీ ఆలోచన మారుతుంది
ఎంత ముదురు మటన్‌ అయినా.. ఇవి వేస్తే నిమిషాల్లోనే ముక్క మెత్తగా..
ఎంత ముదురు మటన్‌ అయినా.. ఇవి వేస్తే నిమిషాల్లోనే ముక్క మెత్తగా..
రోజ్ వాటర్‌తో ముఖం కాంతివంతంగా మారుతుందా? అసలు నిజం ఇదే!
రోజ్ వాటర్‌తో ముఖం కాంతివంతంగా మారుతుందా? అసలు నిజం ఇదే!
కోటీశ్వరుల సంబంధాలన్నింటినీ వద్దని అసిస్టెంట్ డైరెక్టర్‌‌ను..
కోటీశ్వరుల సంబంధాలన్నింటినీ వద్దని అసిస్టెంట్ డైరెక్టర్‌‌ను..
దొండకాయ తినని వారు కూడా లొట్టలేసుకుని తింటారు.. ఇలా పచ్చడి చేయండి
దొండకాయ తినని వారు కూడా లొట్టలేసుకుని తింటారు.. ఇలా పచ్చడి చేయండి
కబ్రా కాన్ ఏనుగు బీభత్సం.. పట్టుకునేందుకు 100 మంది అటవీ సిబ్బంది
కబ్రా కాన్ ఏనుగు బీభత్సం.. పట్టుకునేందుకు 100 మంది అటవీ సిబ్బంది