ప్రభాస్ లాంటి మొగుడు కావాలంటూ బోల్డ్ కామెంట్స్! ఫస్ట్ క్రష్ సీక్రెట్ చెప్పిన స్టార్ హీరోయిన్
వరుస హిట్లతో టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద గోల్డెన్ లెగ్‌గా మారిపోయింది ఆ అందాల భామ. పోయిన ఏడాది పండగ బరిలో నిలిచి సక్సెస్ అందుకున్న ఈ బ్యూటీ, ఈ ఏడాది కూడా అదే మ్యాజిక్ రిపీట్ చేస్తూ 'సంక్రాంతి క్వీన్' అనిపించుకుంటోంది.

కేవలం గ్లామర్‌తోనే కాదు, తన మనసులోని మాటలను ఏమాత్రం దాచుకోకుండా కుండబద్దలు కొట్టినట్లు చెప్పడం ఈమె ప్రత్యేకత. తాజాగా తన పెళ్లి గురించి వస్తున్న రూమర్లకు చెక్ పెట్టడమే కాకుండా, తన ఫస్ట్ క్రష్ గురించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. సినిమాల్లోకి రాకముందే ఆమె మనసు పారేసుకున్న ఆ వ్యక్తి ఎవరు? అసలు ఆమెకు కాబోయే భర్తకు ఉండాల్సిన లక్షణాల గురించి ఆమె పెట్టిన కండీషన్లు ఏంటి? ఆ విశేషాలేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఆ నటి మరెవరో కాదు.. మీనాక్షి చౌదరి.
గతేడాది వెంకటేష్ సరసన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో హిట్ అందుకున్న మీనాక్షి చౌదరి, ఈ ఏడాది నవీన్ పొలిశెట్టి హీరోగా నటించిన ‘అనగనగా ఒక రాజు’ సినిమాతో మరో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. జనవరి 14న విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. వరుసగా రెండు పండగ సీజన్లలో హిట్లు కొట్టడంతో అభిమానులు ఆమెను సంక్రాంతి క్వీన్‌గా పిలుచుకుంటున్నారు.

Meenakshi Chowdary
స్కూల్ టీచర్‌పై ఫస్ట్ క్రష్..
తన వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ మీనాక్షి చౌదరి తన ఫస్ట్ క్రష్ గురించి వెల్లడించింది. తాను తొమ్మిదో తరగతి చదువుతున్న సమయంలోనే ప్రేమలో పడ్డానని చెప్పి షాకిచ్చింది. అయితే అది తన తోటి విద్యార్థితో కాదు.. తన స్కూల్ టీచర్‌పై క్రష్ ఏర్పడిందట. ఈ విషయం తన స్నేహితులకు కూడా తెలియడంతో వారంతా తనను తెగ ఆటపట్టించేవారట. ఆ రోజులు తన జీవితంలో అత్యంత మధురమైన జ్ఞాపకాలని మీనాక్షి గుర్తుచేసుకుంది.
ప్రభాస్ లాంటి వరుడు..
సినిమాల్లోకి వచ్చాక తన ఇష్టాల గురించి మాట్లాడుతూ డార్లింగ్ ప్రభాస్‌పై తనకున్న అభిమానాన్ని చాటుకుంది. గతేడాది ఒక ఇంటర్వ్యూలో తనకు ఎలాంటి భర్త కావాలో చెబుతూ.. “ప్రభాస్ లాగా మంచి హైట్ ఉండాలి, ఆయన లాగే గొప్ప మనసు ఉండాలి. ఇంటెలిజెంట్ గా ఉండే ప్రభాస్ లాంటి వ్యక్తి భర్తగా వస్తే బాగుంటుంది” అని తన మనసులోని కోరికను బయటపెట్టింది.
అయితే ఇటీవల ‘అనగనగా ఒక రాజు’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో మీనాక్షి తన కాబోయే భర్త గురించి మరిన్ని కండీషన్లు పెట్టింది. అతనికి వంద ఎకరాల వ్యవసాయ భూమి ఉండాలని, ఇంట్లో పని చేయాలని, బట్టలు ఉతకడమే కాకుండా ఐరన్ కూడా చేయాలని చెప్పింది. తనకు ఇష్టమైన రాజ్మా డిష్ వండటం రావాలని, రోజుకు మూడు గిఫ్టులు ఇవ్వాలని సరదాగా వ్యాఖ్యానించింది. అలాగే సినిమాల్లోని వారిని, మోడలింగ్ చేసే వారిని అస్సలు పెళ్లి చేసుకోనని స్పష్టం చేసింది. మీనాక్షి కండీషన్లు విన్న హీరో నవీన్ పొలిశెట్టి.. “ఇలాంటి అబ్బాయి దొరకడం కష్టం, నువ్వు ఏఐ (AI) లోనే ఒక అబ్బాయిని క్రియేట్ చేసుకోవాలి” అని అదిరిపోయే పంచ్ వేశారు.
రూమర్లకు చెక్..
నటుడు సుశాంత్‌తో మీనాక్షి డేటింగ్‌లో ఉందంటూ వస్తున్న వార్తలపై కూడా ఆమె స్పష్టత ఇచ్చింది. సుశాంత్ తనకు కేవలం మంచి స్నేహితుడు మాత్రమేనని, ప్రస్తుతం తాను సింగిల్‌గా ఉన్నానని క్లారిటీ ఇచ్చింది. వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్న మీనాక్షి చౌదరి పెట్టిన ఈ కండీషన్లు చూస్తుంటే, ఆమె కోరుకున్న లక్షణాలు ఉన్న మొగుడు దొరకడం కాస్త కష్టమే అనిపిస్తోంది. మరి ఈ అందాల భామ మనసు గెలుచుకునే ఆ అదృష్టవంతుడు ఎవరో వేచి చూడాలి.
