AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jr NTR: ‘ఇప్పుడే సినిమా చూశా.. చాలా అద్బుతంగా ఉంది’.. ఆ మూవీపై ఎన్టీఆర్ ప్రశంసల జల్లు

ఈ సంక్రాంతికి మొత్తం 5 సినిమాలు విడుదలయ్యాయి. ప్రభాస్ ది రాజాసాబ్, చిరంజీవి మన శంకరవరప్రసాద్ గారు, రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి, నవీన్ పొలిశెట్టి అనగనగా ఒక రాజు, శర్వానంద్ నారీ నారీ నడుమ మురారీ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.

Jr NTR: 'ఇప్పుడే సినిమా చూశా.. చాలా అద్బుతంగా ఉంది'.. ఆ మూవీపై ఎన్టీఆర్ ప్రశంసల జల్లు
Jr NTR
Basha Shek
|

Updated on: Jan 19, 2026 | 10:26 PM

Share

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ మూవీలో రుక్మిణీ వసంత్ హీరోయిన్ గా నటిస్తోంది. కేజీఎఫ్ సినిమాలతో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న హోంబలే నిర్మాణ సంస్థే ఈ సినిమాను కూడా భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఎన్టీఆర్ కూడా ఈ సినిమా షూటింగులో బిజీ బిజీగా ఉంటున్నాడు. అయితే ఎన్టీఆర్ లేటెస్ట్ గా దండోరా సినిమాను చూశారు. ఇటీవలే ఓటీటీలోకి వచ్చిన ఈ మూవీ చాలా అద్భుతంగా ఉందంటూ ప్రశంసలు కురిపించారు.ఈ మేరకు ట్విట్టర్ (ఎక్స్) వేదికగా ఓ పోస్ట్ షేర్ చేశాడు.

‘ఇప్పుడే దండోరా సినిమా చూశాను. నన్ను చాలా ఆలోచించేలా చేసింది. శివాజీ, నవదీప్‌, నందు, రవికృష్ణ, బిందు మాధవి అద్భుతంగా నటించారు. ఇంత బలమైన కథను ‍అద్భుతంగా తెరకెక్కించిన దర్శకుడు మురళీ కాంత్‌కు నా ప్రత్యేక అభినందనలు.అలాగే ఈ మంచి ఈ ప్రయత్నానికి మద్దతు ఇచ్చినందుకు రవీంద్ర బెనర్జీకి నా అభినందనలు. ఇంతటి అద్భుతమైన చిత్రానికి మద్దతు ఇచ్చి.. ఈ మూవీలో భాగమైనందుకు తారాగణం, సిబ్బందిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను’ అని ట్విట్టర్ (ఎక్స్) లో రాసుకొచ్చారు ఎన్టీఆర్. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.

ఇవి కూడా చదవండి

దండోరా సినిమాపై జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్..

అమెజాన్ ప్రైమ్ ల దండోరా సినిమా స్ట్రీమింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..