AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chiranjeevi : నా మనసు ఆనందంతో నిండిపోయింది.. మేనకోడలి ట్యాలెంట్ చూసి మురిసిపోయిన మెగాస్టార్.. వీడియో

చిరంజీవి నటించిన 'మన శంకరవరప్రసాద్' గారు సినిమాలో ఓ సాంగ్ పాడింది మెగాస్టార్ మేనకోడలు. చిరంజీవి సోదరి మాధవి కుమార్తె అయిన నైరా 'ఫ్లై.. హై' అని సాగే పాటను ఎంతో లయబద్ధంగా ఆలపించింది. సినిమాకు ఎమోషన్ ఫీలింగ్ తీసుకొచ్చిన ఈ సాంగ్ ప్రేక్షకులను కూడా బాగా అలరిస్తోంది.

Chiranjeevi : నా మనసు ఆనందంతో నిండిపోయింది.. మేనకోడలి ట్యాలెంట్ చూసి మురిసిపోయిన మెగాస్టార్.. వీడియో
Mana Shankara Vara Prasad Garu Movie
Basha Shek
|

Updated on: Jan 21, 2026 | 9:37 PM

Share

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా మన శంకరవరప్రసాద్ గారు. క్రేజీ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా సంక్రాంతి పండగ కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కనీవినీ ఎరుగని కలెక్షన్లు సాధిస్తూ బాక్సాఫీస్ దుమ్ము దులుపుతోంది. ఇప్పటికే ఈ మూవీ కలెక్షన్లు రూ. 350 కోట్లకు చేరువైనట్లు ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే మన శంకరవరప్రసాద్ గారు సినిమాకు భీమ్స్ స్వరాలు అందించారు. అందుకు తగ్గట్టుగానే ఈ మెగా మూవీలోని పాటలు సూపర్ హిట్ అయ్యాయి. మీసాల పిల్ల, శశిరేఖ, హుక్ స్టెప్ సాంగ్స్ యూట్యూబ్ లో ఛార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. ఇక చిన్న పిల్లల వాయిస్ తో వచ్చే ‘ఫ్లై.. హై’ సాంగ్ అయితే సినిమాకు ఎమోషనల్ ఫీలింగ్ తీసుకొచ్చింది. ఇక ఈ సాంగ్ పాడింది మరెవరో కాదు మెగాస్టార్ మేనకోడలే. చిరంజీవి సోదరి మాధవి కుమార్తె అయిన నైరా ఈ పాటను ఎంతో లయబద్ధంగా ఆలపించి అందరి మన్ననలు అందుకుంటోంది.

ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి తన మేనకోడలి ట్యాలెంట్ ను చూసి మురిసిపోయారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా నైరాపై ప్రశంసలు కురిపించారు. ‘నా చిన్న మేనకోడలు నైరా ఫ్లై.. హై పాట పాడటం చూసి.. నా హృదయం ఆనందంతో నిండిపోయింది. ఇది కేవలం ఆరంభం మాత్రమే. నీ మార్గంలో నువ్వు మరింత అంతులేని అవకాశాలతో ముందుకు సాగాలని కోరుకుంటున్నా. భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆశిస్తున్నాను’ అని చిరంజీవి ట్వీట్ లో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.

ఇవి కూడా చదవండి

మేనకోడలి గురించి మెగాస్టార్ ట్వీట్..

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..

Follow Us
సీలింగ్ ఫ్యాన్ రెక్కలు వంకరగా ఎందుకు ఉంటాయో తెలుసా? సైన్స్ ఇదే!
సీలింగ్ ఫ్యాన్ రెక్కలు వంకరగా ఎందుకు ఉంటాయో తెలుసా? సైన్స్ ఇదే!
రక్తం కారేలా హీరోయిన్ పెదవి కొరికిన స్టార్ హీరో..
రక్తం కారేలా హీరోయిన్ పెదవి కొరికిన స్టార్ హీరో..
అతడు లేకపోతే నేను ఇండస్ట్రీకి వచ్చేవాడినే కాదు..
అతడు లేకపోతే నేను ఇండస్ట్రీకి వచ్చేవాడినే కాదు..
మొబైల్‌ యూజర్లకు బిగ్‌ అలర్ట్‌.. నవంబర్‌ 1 నుంచి కొత్త రూల్‌..!
మొబైల్‌ యూజర్లకు బిగ్‌ అలర్ట్‌.. నవంబర్‌ 1 నుంచి కొత్త రూల్‌..!
ముగ్గురిని మింగేసిన నీటి కుంట..!
ముగ్గురిని మింగేసిన నీటి కుంట..!
అనంత్‌ అంబానీ చేసిన పనికి కన్నీళ్లు పెట్టుకున్న బ్లింకిట్ ఏజెంట్!
అనంత్‌ అంబానీ చేసిన పనికి కన్నీళ్లు పెట్టుకున్న బ్లింకిట్ ఏజెంట్!
డబుల్ ఎలిమినేషన్‌లో బిగ్ ట్విస్ట్.. నెటిజన్స్ కామెంట్స్ ఇవే..
డబుల్ ఎలిమినేషన్‌లో బిగ్ ట్విస్ట్.. నెటిజన్స్ కామెంట్స్ ఇవే..
ఇంటర్ విద్యార్థి అద్భుత ఆలోచన.. షిప్పింగ్ కంటైనర్‌లో క్లాస్‌రూమ్!
ఇంటర్ విద్యార్థి అద్భుత ఆలోచన.. షిప్పింగ్ కంటైనర్‌లో క్లాస్‌రూమ్!
పచ్చటి కొబ్బరిబోండం చూసి మోసపోకండి.. ఎక్కువ నీళ్లున్న కాయను..
పచ్చటి కొబ్బరిబోండం చూసి మోసపోకండి.. ఎక్కువ నీళ్లున్న కాయను..
నాలుగు రోజుల్లో వెండి ధర రూ.16 వేలు పతనం..బంగారం ఎంత తగ్గిందంటే..
నాలుగు రోజుల్లో వెండి ధర రూ.16 వేలు పతనం..బంగారం ఎంత తగ్గిందంటే..