Horoscope Today: వారి ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు.. 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు
Today Horoscope (December 12, 2024): మేష రాశి వారికి వ్యాపారంలో కొద్దిగా లాభాలు పెరిగే అవకాశం ఉంది. వృషభ రాశి వారు ఆర్థిక వ్యవహారాల్లో జీవిత భాగస్వామితో సంప్రదించి నిర్ణయాలు తీసుకుంటే మంచిది. మిథున రాశి వారికి అధికారుల నుంచి ఆశించిన ప్రోత్సాహం అందే అవకాశముంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
దిన ఫలాలు (డిసెంబర్ 12, 2024): మేష రాశి వారికి వ్యాపారంలో కొద్దిగా లాభాలు పెరిగే అవకాశం ఉంది. వృషభ రాశి వారు ఆర్థిక వ్యవహారాల్లో జీవిత భాగస్వామితో సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. మిథున రాశి వారికి అధికారుల నుంచి ఆశించిన ప్రోత్సాహం ఉంటుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
వృత్తి, ఉద్యోగాలు ఉత్సాహంగా, ప్రోత్సాహకరంగా పురోగమిస్తాయి. వ్యాపారంలో కొద్దిగా లాభాలు పెరిగే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. ఆదాయం బాగానే వృద్ధి చెందే అవకాశం ఉంది. వ్యక్తిగత సమస్యలు చాలావరకు తగ్గుతాయి. నిరుద్యోగులకు ఒకటి రెండు ఆఫర్లు అందుతాయి. బంధువుల తోడ్పాటుతో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. మిత్రులకు ఆర్థికంగా సహాయపడతారు. పిల్లలు విజయాలు సాధిస్తారు. ఆశించిన శుభవార్తలు వింటారు.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ఉద్యోగ జీవితం కూడా ప్రశాంతంగా, సానుకూలంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో శ్రమాధిక్యత ఉన్నప్పటికీ, అంచనాలకు మించిన ప్రతిఫలం ఉంటుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. ఆర్థిక వ్యవహారాల్లో జీవిత భాగస్వామితో సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. నిరుద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది. పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
వృత్తి, ఉద్యోగాలు సాఫీగా, సానుకూలంగా సాగిపోతాయి. అధికారుల నుంచి ఆశించిన ప్రోత్సాహం ఉంటుంది. వ్యాపారుల్లో లాభాలకు లోటుండదు. తోబుట్టువులతో ఆస్తి వివాదం ఒకటి పరిష్కార మయ్యే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాలకు ఇది అనుకూలమైన సమయం. ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందుతాయి. వాటిని సద్వినియోగం చేసుకోవడం మంచిది. ఆదాయం బాగా వృద్ది చెందుతుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. కార్యకలాపాలు, లావాదేవీలు బాగా వృద్ధి చెందుతాయి. ఉద్యోగ జీవితం ఆశించిన స్థాయిలో పురోగతి చెందుతుంది. ఆర్థిక వ్యవహారాలు సవ్యంగా, సజావుగా సాగిపోతాయి. మంచి స్నేహ సంబంధాలు ఏర్పడతాయి. అనేక విధాలుగా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాల్లో ఆశించిన కార్యసిద్ధి కలుగుతుంది. ధనపరంగా ఎవరినీ అతిగా నమ్మకపోవడం మంచిది. నిరుద్యోగులు శుభవార్తలు వినే అవకాశం ఉంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
ఉద్యోగంలో అనుకూల వాతావరణం నెలకొంటుంది. కానీ, పని భారం కూడా ఎక్కువగానే ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో మార్పులు, చేర్పులు చేపడతారు. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు, అవకాశాలు అందుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్ని కొద్ది శ్రమతో పూర్తి చేస్తారు. అనుకోకుండా ధన లాభాలు కలిగే అవకాశం ఉంది. ఆదాయ ప్రయత్నాలు చాలావరకు విజయవంతం అవు తాయి. పెళ్లి ప్రయత్నాలకు ఇది అనుకూలమైన సమయం. ఒకటి రెండు శుభవార్తలు వింటారు.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
అనుకోకుండా ఒకటి రెండు శుభవార్తలు వింటారు. ఉద్యోగంలో జీతభత్యాలు పెరిగే అవకాశం ఉంది. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఉద్యోగులకు విదేశా లకు వెళ్లే అవకాశం లభిస్తుంది. ఆదాయం బాగా పెరిగే సూచనలున్నాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. బంధువులకు ఒక శుకార్యంలో ఆర్థికంగా సహాయం చేస్తారు. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. పెళ్లి ప్రయత్నం ఒకటి విజయవంతం కావచ్చు.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
పదోన్నతికి సంబందించి ఉద్యోగులు శుభవార్త వింటారు. వ్యాపారాలు చాలావరకు లాభసాటిగా సాగిపోతాయి. వృత్తి జీవితంలో కొన్ని ముఖ్యమైన మార్పులు చోటు చేసుకుంటాయి. ఒకటి రెండు ఆస్తి, ఆర్థిక వివాదాలు అనుకోకుండా పరిష్కారం అవుతాయి. కొద్దిగా అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఇంటా బయటా పని ఒత్తిడి కాస్తంత ఎక్కువగా ఉంటుంది. ఆదాయం బాగానే వృద్ధి చెందుతుంది. కుటుంబ పరిస్థితి, దాంపత్య జీవితం చాలావరకు అనుకూలంగా సాగిపో తాయి.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ)
వృత్తి, వ్యాపారాల్లో పెట్టుబడికి తగ్గ లాభాలు చేతికి అందుతాయి. ఉద్యోగ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. ఉద్యోగులకు జీతభత్యాలు కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో కలిసి ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. తలపెట్టిన పనులన్నిటినీ సకాలంలో పూర్తి చేస్తారు. మొండి బాకీలు వసూలవుతాయి. సమాజంలో కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. కుటుంబంలో పెద్దల వల్ల ఆర్థిక లాభం కలుగుతుంది. ప్రయాణాల వల్ల ఆర్థిక లాభం కలుగుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
ఆర్థిక వ్యవహారాలను విజయవంతంగా చక్కబెడతారు. ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు ఊరట లభిస్తుంది. ఉద్యోగంలో పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు. తోబుట్టువులతో వివాదాలు పరిష్కారం అవుతాయి. వృత్తి, వ్యాపారాలు అనుకూలంగా సాగిపోతాయి. నిరుద్యోగులకు అనుకో కుండా మంచి అవకాశాలు అందుతాయి. ప్రయాణాలు చివరి క్షణంలో వాయిదా పడతాయి. ఆస్తి వివాదాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. పిల్లల నుంచి శుభ వార్తలు వింటారు.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
ఉద్యోగ వాతావరణం సానుకూలంగా సాగిపోతుంది. కొత్త అవకాశాలు అందివస్తాయి. వృత్తి జీవితం కూడా చాలావరకు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారాల్లో శ్రమ ఎక్కువగా ఉన్నప్పటికీ ఆశించిన ఫలితం ఉంటుంది. ముఖ్యమైన పనులు, వ్యవహారాలు సంతృప్తికరంగా పూర్తవుతాయి. కుటుంబ సభ్యులలో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. చేపట్టిన పనులలో శ్రమాధిక్యత ఉంటుంది. నిరుద్యోగులకు మంచి అవకాశాలు అందివస్తాయి. ఆదాయం బాగా సానుకూలంగా సాగిపోతుంది.
కుంభం (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
వ్యాపారాలలో నష్టాల నుంచి కొద్దిగా బయటపడే అవకాశం ఉంది. వృత్తి జీవితం బిజీ అవుతుంది. ఉద్యోగంలో ఒకటి రెండు అదనపు బాధ్యతల నుంచి బయటపడతారు. అవసరానికి తగ్గట్టు చేతికి డబ్బు అందుతుంది. చేపట్టిన పనులు, వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. మిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. నష్టదాయక వ్యవహారాలకు దూరంగా ఉండండి. నిరుద్యోగులకు కొత్త ఆఫర్లు అందుతాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండకోవచ్చు. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
వృత్తి, ఉద్యోగాలలో అధికారులకు మీ సమర్థత మీద నమ్మకం పెరుగుతుంది. అదనపు పని ఒత్తిడి నుంచి కొద్దిగా ఉపశమనం లభిస్తుంది. వ్యాపారానికి ఆశాజనకంగా సాగిపోతాయి. అను కున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ముఖ్యమైన వ్యవహారాలను కొద్ది శ్రమతో పూర్తి చేస్తారు. పలుకుబడి బాగా పెరుగుతుంది. ఆశించిన స్థాయిలో ఆదాయ వృద్ధికి అవకాశం ఉంది. వ్యక్తిగత సమస్యకు పరిష్కారం లభిస్తుంది. నిరుద్యోగులు ఆశించిన ఉద్యోగంలో చేరడం జరుగుతుంది.