వచ్చే ఏడాది మార్చి 29న మీన రాశిలో శని ప్రవేశించడం వల్ల కొన్ని రాశులకు ఏలిన్నాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని వంటి దోషాల నుంచి విముక్తి లభించింది. అయితే, శని కుంభ రాశి నుంచి మీన రాశిలోకి ప్రవేశించడంతో మరి కొన్ని రాశులకు ఈ దోషాలన్నీ ప్రారంభం కాబోతు న్నాయి. ఆ రాశులుః మేషం, సింహం, కన్య, ధనుస్సు, కుంభం, మీన రాశులు. శని ఉన్న స్థితిని బట్టి ఈ రాశులకు ఉద్యోగం, ఆస్తిపాస్తులు, ఆటంకాలు, అనారోగ్యాలు, డబ్బు నష్టం వంటి సమస్యలు తలెత్తుతాయి. శని దోష నివారణ కోసం ఈ రాశుల వారు తరచూ శివార్చన చేయిం చడం, శనికి దీపం వెలిగించడం, నలుపు రంగు కలిసిన దుస్తుల్ని ఎక్కువగా ధరించడం, నీలమనే రాయిని ఉంగరంలో ధరించడం వంటివి చేయడం మంచిది.