Lord Shani: 2025లో రాశి మారనున్న శనీశ్వరుడు.. ఈ రాశివారు పొరపాటున కూడా కొన్ని తప్పులు చేయవద్దు ఎందుకంటే

2024కు గుడ్ బై చెప్పేసి కొత్త సంవత్సరానికి వెల్కం చెప్పడానికి ఇంక కొన్ని రోజుల సమయం మాత్రమే ఉంది. రానున్న కొత్త సంవత్సరం అయినా తమకు బాగుండాలని మంచి జరగాలని ఎందరో కోరుకుంటారు. ఆశగా ఎదురుచుస్తారు. అయితే నూతన సంవత్సరంలో శనిదేవుడు మీనరాశిలోకి ప్రవేశించనున్నాడు. ఇలా శనీశ్వరుడు రాశిని మార్చుకోవడం వలన కొన్ని రాశులకు శుభాలను.. కొన్ని రాశుల వారిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. అటువంటి పరిస్థితిలో ఈ రాశుల వారు పొరపాటున కూడా ఎటువంటి తప్పులు చేయవద్దు. ఏయే రాశులపై శనిశ్వరుడి ప్రతికూల ప్రభావం ఉంటుందో తెలుసుకుందాం.

Lord Shani: 2025లో రాశి మారనున్న శనీశ్వరుడు.. ఈ రాశివారు పొరపాటున కూడా కొన్ని తప్పులు చేయవద్దు ఎందుకంటే
Lord Shaniswara
Follow us
Surya Kala

|

Updated on: Dec 13, 2024 | 4:54 PM

2024 సంవత్సరంలో ఇంక కొన్ని రోజులే మిగిలి ఉన్నాయి. అంటే కొత్త సంవత్సరం దగ్గర పడింది. కొత్త సంవత్సరం తమకు ఎలా ఉండబోతుందో తెలుసుకోవడానికి ప్రజలు జ్యోతిష్యం సహాయం తీసుకుంటారు. నూతన సంవత్సరంలో శనీశ్వరుడు ప్రభావం ఎలా ఉంటుందని ఎక్కువగా తెలుసుకోవాలనుకుంటారు. ఎందుకంటే శనీశ్వరుడు కర్మఫలాన్ని ఇచ్చేవాడు. అంటే కర్మల ప్రకారం ఫలితాలను ఇచ్చేవాడు అని హిందూ మత గ్రంథాలలో చెప్పబడింది. అంతేకాదు శనీశ్వరుడు మనిషి చేసే పనులను బట్టి శిక్షిస్తాడు.

2025లో రాశిని మార్చుకోనున్న శనీశ్వరుడు

ప్రస్తుతం శనీశ్వరుడు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. శనీశ్వరుడు నవంబర్ 15న కుంభరాశిలోకి ప్రవేశించాడు. ఇప్పుడు కొత్త సంవత్సరంలో అంటే 2025లో శనిదేవుడు తన రాశిని మార్చబోతున్నాడు. 2025లో శనీశ్వరుడు కుంభరాశిని వదిలి మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. అంటే 2025వ సంవత్సరంలో శనీశ్వరుడు కుంభరాశి నుంచి బయటకు వచ్చి.. మీన రాశిలోకి ప్రవేశిస్తాడు. మీన రాశిలో శనీశ్వరుడు సంచారం వలన మొత్తం 12 రాశుల వారిపై ప్రభావం చూపుతుంది. అదే సమయంలో మీన రాశిలో శనీశ్వరుడు సంచారం ప్రతికూల ప్రభావం కొన్ని రాశులపై కూడా కనిపిస్తుంది.

మేషరాశిపై శనీశ్వరుడు ప్రభావం ఎలా ఉంటుందంటే

మేష రాశి వ్యక్తులపై 2025లో శనీశ్వరుడు ప్రభావం చూపించనున్నాడు. అంటే మేషరాశి వారిపై ఏలి నాటి శని దశ ప్రారంభమవుతుంది. ఈ సమయంలో ఈ రాశికి చెందిన వ్యక్తులు తమ కోపం, ఉత్సాహాన్ని నియంత్రించుకోవాలి. మేష రాశి వారు ఇలా చేయకపోతే సమస్యలు చుట్టుముడతాయి. మేష రాశి వారు ఈ సమస్యల వల్ల చాలా ఇబ్బంది పడతారు.

ఇవి కూడా చదవండి

కర్కాటక, వృశ్చిక, ధనుస్సు రాశుల వారు కొన్ని పనులకు దూరంగా ఉండాలి

వ్యక్తులకు ద్రోహం చేసే వారిని శనీశ్వరుడు ఇష్టపడడు. ముఖ్యంగా ప్రేమలో మోసం చేసేవారిని శనీశ్వరుడు ఎప్పుడూ శిక్షిస్తాడు. 2025వ సంవత్సరంలో కర్కాటకం, వృశ్చికం, ధనుస్సు రాశుల వారు కొన్ని పొరపాట్లకు దూరంగా ఉండాలి. హిందూ మత గ్రంథాలలో శనీశ్వరుడు న్యాయానికి అధిపతి, కర్మ ఫలదాత. శనీశ్వరుడు బలహీనులను, నిరుపేద కుటుంబాలను ఆదరనగా చూసే వారిని, కష్టపడి పనిచేసే వారిని ఇష్టపడతాడు. రక్షణ కల్పిస్తాడు.

పేదలను , బలహీనులను వేధించే వారిని శనీశ్వరుడు ఖచ్చితంగా శిక్షిస్తాడని నమ్మకం. మనుషులు చేసే మంచి చెడు కర్మలను అనుసరించి ఫలితాలను నిర్ణయించేవాడు సూర్యుని తనయుడు శనీశ్వరుడు. నిరంతరం పని చేస్తూ క్రమశిక్షణతో, నియమాలతో పాటించే వ్యక్తుల పట్ల దయతో ఉంటాడు. ఈ విధంగా ఉందని వ్యక్తులపై శనీశ్వరుడు తన దృష్టిని సారిస్తాడు. అప్పుడు గ్రహాల ప్రభావంతో శని దోషం, ఏలి నాటి శని, శని ధైయ బాధలు కలుగుతాయని జ్యోతిష్యులు చెప్పారు.

మరిన్ని ఆధ్మాతిక వార్తల కోసం క్లిక్ చేయండి..

నోట్ : పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.