AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rahu Shukra Yuti : 2025 మీనరాశిలో శుక్ర రాహుల కలయిక.. సిరిసంపదలతో పాటు సంతోషం ఈ రాశుల సొంతం.

రాహు శుక్రుని కలయిక త్వరలో జరగబోతోంది. ఈ కలయిక అన్ని రాశులకు చెందిన వ్యక్తులను ప్రభావితం చేస్తుంది. అయితే ఈ కలయిక కొన్ని రాశులకు చాలా అదృష్టాన్ని తీసుకు వస్తుంది. ఆ అదృష్ట రాశులు ఏంటో తెలుసుకుందాం

Rahu Shukra Yuti : 2025 మీనరాశిలో శుక్ర రాహుల కలయిక.. సిరిసంపదలతో పాటు సంతోషం ఈ రాశుల సొంతం.
Rahu Shukra Yuti 2025
Surya Kala
|

Updated on: Dec 13, 2024 | 2:49 PM

Share

వేద క్యాలెండర్ ప్రకారం నవ గ్రహాలు రాశులను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటాయి. ఇలా గ్రహాలు రాశులను మార్చుకునే సముయంలో ఒకే రాశిలో కొన్ని గ్రహాల కలయిక ఏర్పడుతుంది. జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల కలయికను ప్రత్యేకంగా పరిగణిస్తారు. ఒకే రాశిలో రెండు గ్రహాలు వస్తే దానిని గ్రహ సంయోగం అంటారు. ఈసారి రాహువు, శుక్రుడు ఒకే రాశిలోకి ప్రవేశించనున్నారు. దీని కారణంగా కొన్ని రాశుల వారికి అదృష్టం మెరుగుపడుతుంది. అలాగే వృత్తి, వ్యాపార, వ్యక్తిగత జీవితంలో సంతోషం పెరుగుతుంది.

రాహువు, శుక్రుడు ఎప్పుడు కలుస్తారు?

హిందూ వేద క్యాలెండర్ ప్రకారం 2025 సంవత్సరం జనవరి 28వ తేదీ ఉదయం 7:12 గంటలకు శుక్రుడు మీనరాశిలోకి ప్రవేశించనున్నాడు. రాహు గ్రహం ఇప్పటికే ఈ రాశిలో ఉంది. రాహువు ఉన్న ఈ రాశిలోకి శుక్రుడు అడుగు పెట్టడంతో ఈ కలయిక జరగనుంది. దీంతో కొన్ని రాశుల వారికి చాలా శుభ ఫలితాలు కలుగుతాయి.

ఏ రాశుల వారికి అదృష్టం కలుగుతుందంటే

కర్కాటక రాశి: వీరికి రాహు,శుక్రుల కలయిక చాలా శుభ ఫలితాలను ఇస్తుంది. దీని వల్ల ఈ రాశుల వారికి ప్రతి విషయం అనుకూలంగా ఉంటుంది. తక్కువ శ్రమతో కూడా ఎక్కువ ఫలితాలను పొందుతారు. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కోరిక నెరవేరే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అంతే కాదు కుటుంబంలో పరస్పర సమన్వయం, సంతోషం పెరుగుతుంది.

ఇవి కూడా చదవండి

తులా రాశి: ఈ రాశి అధిపతి శుక్రుడు. దీని కారణంగా రాహువు , శుక్రుడు కలయిక వీరికి శుభ ఫలితాలను ఇస్తాయి. అటువంటి పరిస్థితిలో తుల రాశి వారికి ఉద్యోగంలో ప్రమోషన్‌తో పాటు జీతం పెరుగుతుంది. కుటుంబంలో జరుగుతున్న వివాదాలన్నీ సమసిపోతాయి. వైవాహిక జీవితంలో కొనసాగుతున్న ఒత్తిడులు తొలగిపోతాయి. అంతేకాదు అవివాహితులకు వివాహాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రేమ వివాహం కూడా విజయవంతమయ్యే అవకాశం ఉంది.

వృశ్చిక రాశి: ఈ రాశి వారికి రాహు, శుక్రుల కలయిక శుభప్రదం అవుతుంది. ఈ సమయంలో వృశ్చిక రాశికి చెందిన వ్యక్తులు ఉద్యోగంలో కొత్త బాధ్యతలను పొందవచ్చు. వృత్తి, వ్యాపారాలలో పురోగతికి మార్గాలు తెరవడం వల్ల ఆదాయం పెరుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు ఆశించిన విజయం సాధిస్తారు. జీవితంలో భాగస్వామి నుంచి మద్దతు లభిస్తుంది.

మరిన్ని ఆధ్మాతిక వార్తల కోసం క్లిక్ చేయండి..

నోట్ : పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.