Winter Wellness: శీతాకాలంలో ఉప్పు, పటిక మిశ్రమం ఎన్నో సమస్యలకు బెస్ట్ మెడిసిన్.. ఎలా ఉపయోగించాలంటే

యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఇది శరీరంలోని అనేక సమస్యలను దూరం చేయడంలో సహాయపడుతుంది. అటువంటి పరిస్థితిలో పటిక, ఉప్పును ఉపయోగించడం ద్వారా ఏఏ సమస్యలను వదిలించుకోవచ్చో ఈ రోజు తెలుసుకుందాం..

Surya Kala

|

Updated on: Dec 13, 2024 | 3:48 PM

పటిక, ఉప్పు కలిపి వాడటం వల్ల అనేక రకాల సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఈ రెండింటిలోనూ ఒకేరకమైన లక్షణాలు కనిపిస్తాయి. ఇవి శరీరంలోని అనేక రకాల సమస్యలను తొలగిస్తాయి. పటికలో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. అయితే ఉప్పులో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు కూడా ఉన్నాయి. చలికాలంలో చాలా మంది ఉప్పు, పటికను ఇంటి నివారణలకు ఉపయోగిస్తారు.

1 / 7
ఎందుకంటే పటిక, ఉప్పు శీతాకాలంలో శరీరంలో సంభవించే అనేక సమస్యలను దూరం చేస్తుంది. దీంతో నోటి దుర్వాసన నుంచి చిగుళ్ల వరకు అన్నీ నయం అవుతాయి. ఈ రోజు ఉప్పు, పటిక ఏ ఇతర సమస్యలకు ఉపయోగపడతాయో తెలుసుకుందాం..

2 / 7
దంతాలు, చిగుళ్ల సమస్యలు: పటిక, ఉప్పు దంతాలు, చిగుళ్ళకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. వీటిని ఉపయోగించడం ద్వారా చిగుళ్ల వాపు, నొప్పి , నోటి పూతలని నయం చేయవచ్చు. అంతేకాదు ఇది గొంతు నొప్పి నుంచి కూడా ఉపశమనాన్ని అందిస్తుంది. పటికను నీటిలో కరిగించి అందులో చిటికెడు ఉప్పు వేసి ఆ నీటితో పుక్కిలించాలి.

3 / 7
గాయాలు, రక్తస్రావం: గాయపడి రక్తస్రావం ఎక్కువగా ఉంటే.. పటికను ఉపయోగించవచ్చు. పటిక పొడిని కొద్దిగా గాయంపై చల్లడం వల్ల రక్తస్రావం త్వరగా ఆగి ఇన్ఫెక్షన్ రాకుండా చేస్తుంది.

4 / 7
పగిలిన మడమల కోసం: చలికాలంలో కొంతమంది తరచుగా మడమల పగుళ్లతో బాధపడుతుంటారు. అటువంటి పరిస్థితిలో వాటిని నయం చేయడానికి పటిక చాలా ఉపయోగకరంగా ఉంటుంది.  వేడి నీటిలో పటిక, ఉప్పు కలపాలి. ఆపై ఆ నీటిలో పాదాలను కొంత సమయం ఉంచాలి. ఈ ఇలా చేయడం వలన పగిలిన మడమలు మృదువుగా అవుతాయి. పగుల్లను నివారించడంలో కూడా సహాయపడుతుంది.

5 / 7
మొటిమలు: పటిక, ఉప్పు మొటిమలను తగ్గించడంలో కూడా సహాయపడతాయి. ఈ మిశ్రమం మొటిమలలోని బ్యాక్టీరియాను తొలగిస్తుంది. చర్మాన్ని శుభ్రపరుస్తుంది. ఇందుకోసం పటిక, ఉప్పు కలిపి పేస్టులా చేసి మొటిమలు, మచ్చలు ఉన్న ప్రాంతాల్లో అప్లై చేసి 10-15 నిమిషాల తర్వాత శుభ్రం చేయండి.

6 / 7
చెమట వాసన: చెమట దుర్వాసనతో ఇబ్బంది పడుతుంటే పటిక, ఉప్పును ఉపయోగించాలి. ఇందుకోసం మీరు చేయాల్సిందల్లా స్నానానికి ముందు నీటిలో పటిక, ఉప్పు కలపాలి. అనంతరం ఆ నీటితో స్నానం చేయండి. ఇలా చేయడం వల్ల చెమట వాసన నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే చర్మం బ్యాక్టీరియా రహితంగా ఉంటుంది.

7 / 7
Follow us