Myrobalan: ఏ రోగాన్ని అయినా కంట్రోల్ చేసే దివ్య ఔషధం ఇదొక్కటే!

కరక్కాయను 'కింగ్ ఆఫ్ మెడిసిన్స్' అంటారు. అంటే మీకు ఈ పాటికే అర్థమైపోయి ఉంటుంది. శరీరంలో ఎలాంటి అనారోగ్య సమస్యలనైనా కంట్రోల్ చేయడంలో కరక్కాయ ఎంతో చక్కగా సహాయ పడుతుంది. అందుకే దీనికి ఈ పేరు వచ్చింది..

Myrobalan: ఏ రోగాన్ని అయినా కంట్రోల్ చేసే దివ్య ఔషధం ఇదొక్కటే!
Myrobalan
Follow us
Chinni Enni

|

Updated on: Dec 13, 2024 | 3:34 PM

రోజురోజుకూ చలి తీవ్రత పెరుగుతుంది. పగటి పూట ఉష్ణోగ్రతలు కూడా చాలా తక్కువగా నమోదవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే అసలు సూర్యుడే కనిపించడం లేదు. ఈ క్రమంలోనే అనేక వ్యాధులు ఎటాక్ చేస్తాయి. ఈ సీజనల్ వ్యాధుల నుంచి తప్పించుకోవడంలో అలెర్ట్‌గా ఉండాలి. ఎలాంటి వ్యాధులనైనా అడ్డుకోవడంలో మన వంటింట్లోనే అనేక మసాలాలు ఉన్నాయి. కరక్కాయ గురించి వినే ఉంటారు. ఇప్పుడున్న జనరేషన్‌కు కరక్కాయ అంటే ఏంటో తెలీదు. కానీ జలుబు, దగ్గు, స్వరం, కడుపు వ్యాధులు, వాపులు, దంతాల వ్యాధులను తగ్గించడంలో ఈ కరక్కాయ ఎంతో చక్కగా పని చేస్తుంది. కరక్కాయను నూరి.. కాస్త తేనె రాసి మింగిస్తే దగ్గు, జలుబు తగ్గిపోతాయి. కరక్కాయ అనేది ఓ ఆయుర్వేద మూలిక. ఇందులో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. అందుకే ఆయుర్వేద వైద్యులు కరక్కాయను ‘కింగ్ ఆఫ్ మెడిసిన్స్’ అని అంటారు. ఔషధాల్లో అత్యుత్తమమైనది కరక్కాయగా చెబుతారు.

అనేక పోషకాలు:

కరక్కాయలో యాంటీ ఫంగల్, యాంటీ క్యాన్సర్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ డయాబెటిక్, యాంటీ ఆక్సిడెంట్ల లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఎన్నో పోషకాలు కూడా లభిస్తాయి. మాంగనీస్, సెలీనియస్, పొటాషియం, ఐరన్, ప్రోటీన్, విటమిన్ సి, ఫైబర్ వంటివాటితో పాటు గల్లిక్ యాసిడ్, పాల్మిటిక్ యాసిడ్, స్టెరిక్ యాసిడ్, బెహెనిక్ యాసిడ్ వంటి రసాయనాలు కూడా ఉన్నాయి.

జీర్ణ సమస్యలు మాయం:

ఎలాంటి గ్యాస్, అసిడిటీ, కడుపు ఉబ్బరం, వాపు సమస్యలు, మల బద్ధకం వంటి ఎలాంటి జీర్ణ సంబంధిత సమస్యలనైనా తగ్గించడంలో కరక్కాయ ఎంతో చక్కగా పని చేస్తుంది. కరక్కాయ పొడిని నీటిలో కలిపి తాగితే చాలు.. ఎన్నో సమస్యలు కంట్రోల్ చేస్తుంది. విరేచనాలు, అపానవాయువు, అజీర్తి, గుండెల్లో మంట, ఎసోఫాగిటిస్, పెప్టిక్ అల్సర్ వంటి సమస్యలను కూడా అదుపులో ఉంచుతుంది.

ఇవి కూడా చదవండి

వెయిట్ లాస్:

ఊబకాయం, అధిక బరువు సమస్యలతో బాధ పడేవారు కూడా కరక్కాయను వాడవచ్చు. వెయిట్ లాస్ అవ్వాలి అనుకునేవారు కరక్కాయను పొడిని నీటిలో కలిపి ఉదయం, సాయంత్రం తాగవచ్చు. ఇది ఆకలిని నియంత్రిస్తుంది. శరీరాన్ని డీటాక్సీఫై చేస్తుంది. శరీరంలో పేరుకు పోయిన కొవ్వును కూడా కరిగిస్తుంది. ఫలితంగా బరువులో మంచి రిజల్ట్ మీరే చూడవచ్చు.

అంతే కాకుండా శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో, డయాబెటీస్‌, బీపీని కంట్రోల్ చేయడంలో, క్యాన్సర్ కణాలను నాశనం చేయడంలో, అధిక దాహం, చర్మ, జుట్టు సమస్యలను కూడా తగ్గించడంలో కరక్కాయ ఎంతో అద్భుతంగా పని చేస్తుంది.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..