- Telugu News Photo Gallery Business photos Post office gram suraksha yojana per day invest 50 rupees and get 35 lakhs
Post Office: కేవలం రూ.50 పెట్టుబడితో చేతికి రూ.35 లక్షలు.. అద్భుతమైన ప్లాన్!
Post Office: ప్రజలు తమ డబ్బును సురక్షితమైన, మెరుగైన రాబడి పథకాలలో పెట్టుబడి పెట్టవచ్చు. పోస్ట్ ఆఫీస్ అటువంటి పథకం గ్రామ సురక్ష యోజన. ఈ పథకంలో మీరు రోజుకు కేవలం..
Updated on: Dec 13, 2024 | 10:36 AM

ఇండియా పోస్ట్ ఆఫీస్ అనేక రకాల పొదుపు పథకాలను నిర్వహిస్తోంది. పోస్టాఫీసు పథకాల్లో పెట్టుబడి పెట్టి లక్షలాది మంది మంచి రాబడులు పొందుతున్నారు. అందుకే ప్రజలు పోస్టాఫీసు పథకాల్లో డబ్బును పెట్టుబడి పెడతారు. పోస్టాఫీసులో డబ్బు పెట్టుబడి పెట్టడం రిస్క్ ఫ్రీగా పరిగణిస్తారు.

ఈ డబ్బు గరిష్టంగా 5 సంవత్సరాల వరకు డిపాజిట్ ఉంటుంది. మీరు ఈ మొత్తంపై పొందిన వడ్డీ నుండి సంపాదిస్తారు. అలాగే మీరు డిపాజిట్ చేసిన మొత్తం పూర్తిగా సురక్షితంగా ఉంటుంది. జాయింట్ అకౌంట్ ద్వారా ఈ పథకం నుంచి రూ.9,250 వరకు పొందవచ్చు. ఈ పథకం పదవీ విరమణ చేసిన వారికి చాలా మంచిదని భావిస్తారు. భార్యాభర్తలు కలిసి పెట్టుబడి పెట్టినట్లయితే, వారు తమ నెలవారీ ఆదాయాన్ని పొందవచ్చు.

గ్రామ్ సురక్ష యోజన గ్రామీణ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ పథకంలో ఒక భాగం. ఈ బీమా పాలసీ దేశంలోని గ్రామీణ ప్రజల కోసం 1995 సంవత్సరంలో ప్రారంభించారు.

గ్రామ సురక్ష యోజనలో 19 నుండి 55 సంవత్సరాల మధ్య ఉన్నవారు పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకంలో 10 వేల రూపాయల నుండి 10 లక్షల రూపాయల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ప్రీమియం చెల్లించడానికి అనేక ఎంపికలు అందుబాటులో ఉన్నాయి.

మీరు ప్రీమియంను నెలవారీ, త్రైమాసికం, అర్ధ సంవత్సరం, వార్షికంగా చెల్లించవచ్చు. గ్రామ సురక్ష యోజన గురించి అందించిన సమాచారం ప్రకారం, ఈ పథకంలో ఒక వ్యక్తి నెలకు రూ. 1,515 అంటే రోజుకు కేవలం రూ. 50 పెట్టుబడి పెడితే, అతను రూ. 35 లక్షల వరకు పొందవచ్చు. మీరు 19 సంవత్సరాల వయస్సులో గ్రామ సురక్ష యోజనను కొనుగోలు చేస్తే, 60 సంవత్సరాల వయస్సు వరకు పెట్టుబడి పెట్టడం వలన మీకు 34.60 లక్షల రాబడి లభిస్తుంది.





























