Astrology: ధనుర్మాసం ఈ రాశులకు యోగదాయకం..! వారికి ఆదాయ వృద్దికి ఛాన్స్

Dhanurmasam 2024 Horoscope: డిసెంబర్ 16 నుంచి ప్రారంభం కానున్న ధనుర్మాసం జనవరి 15 తేదీతో ముగియనుంది. ధనూ రాశిలోకి రవి ప్రవేశించిన దగ్గర నుంచి ప్రారంభమయ్యే ధనుర్మాసం.. కొన్ని రాశుల వారికి బాగా యోగ దాయకంగా ఉండబోతోంది. ధనుర్మాసంలో వీరి ఆదాయం వృద్ది చెందడం, ఆశించిన గుర్తింపు లభించడం, అందలాలు ఎక్కడం, ఇంట్లో శుభ కార్యాలకు మార్గం సుగమం కావడం వంటివి జరిగే అవకాశం ఉంది.

Astrology: ధనుర్మాసం ఈ రాశులకు యోగదాయకం..! వారికి ఆదాయ వృద్దికి ఛాన్స్
Dhanurmasam 2024 Horoscope
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Dec 14, 2024 | 8:44 PM

ఈ నెల 16 నుంచి ప్రారంభం అవుతున్న ధనుర్మాసం (Dhanurmasam) జనవరి 15 వరకూ కొనసాగుతుంది. ధనూ రాశిలోకి రవి ప్రవేశించిన దగ్గర నుంచి ప్రారంభమయ్యే ధనుర్మాసం కొన్ని రాశులకు బాగా యోగ దాయకంగా ఉండబోతోంది. ఆదాయం వృద్ది చెందడం, ఆశించిన గుర్తింపు లభించడం, అందలాలు ఎక్కడం, ఇంట్లో శుభ కార్యాలకు మార్గం సుగమం కావడం వంటివి ఈ ధనుర్మాసంలో జరిగే అవకాశం ఉంది. కర్కాటకం, సింహం, తుల, ధనుస్సు, కుంభం, మీన రాశులకు అన్ని విధాలుగానూ వృద్ధి యోగాలు పట్టే సూచనలున్నాయి. ఈ రాశులవారు ఆదిత్య హృదయాన్ని ఎంత శ్రద్ధగా పఠిస్తే అంత మంచిది.

  1. కర్కాటకం: ఈ రాశికి రవి ఆరవ స్థానంలో ప్రవేశిస్తున్నందువల్ల ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడడం, అధికారులతో అనుకూలతలు పెరగడం, జీతభత్యాలు వృద్ధి చెందడం వంటివి తప్పకుండా జరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు కూడా కష్టనష్టాల నుంచి బయటపడి అభివృద్ధి బాట పడతాయి. ఆర్థిక సమస్యలు చాలావరకు పరిష్కారమవుతాయి. అనారోగ్యాల నుంచి ఉపశమనం కలుగుతుంది. పోటీదార్లు వెనక్కు తగ్గుతారు. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఆశించిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది.
  2. సింహం: రాశ్యధిపతి రవి తన మిత్ర క్షేత్రమైన ధనూ రాశిలో ప్రవేశించడం వల్ల అనేక శుభ ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. సంపద బాగా వృద్ధి చెందుతుంది. ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రతిభాపాటవాలు, నైపుణ్యాలు బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది. తండ్రి నుంచి ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి. ఆస్తి వివాదాలకు పరిష్కారం లభిస్తుంది. పిల్లలు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. సంతాన యోగం కలిగే అవకాశం ఉంది. ఆరోగ్యం కుదుటపడుతుంది.
  3. తుల: ఈ రాశికి తృతీయ స్థానంలో రవి సంచారం వల్ల ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం సాధిస్తారు. గతంలో చేపట్టిన కార్యక్రమాలు, ప్రయత్నాలు ఇప్పుడు సత్ఫలితాలనివ్వడం ప్రారంభిస్తాయి. ఉద్యో గంలో పదోన్నతి లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో తక్కువ శ్రమతో ఎక్కువ లాభాలు పొందుతారు. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. ఆశించిన కుటుంబంతో పెళ్లి సంబంధం ఖాయమవు తుంది. ప్రయాణాల వల్ల లాభాలు కలుగుతాయి. విదేశీయానానికి మార్గం సుగమం అవుతుంది.
  4. ధనుస్సు: ఈ రాశిలో భాగ్యాధిపతి రవి సంచారం వల్ల నిరుద్యోగులకు విదేశాల్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఉద్యోగులకు కూడా ఇతర దేశాల నుంచి ఆఫర్లు, ఆహ్వానాలు అందుతాయి. ఉద్యోగులు ఒక సంస్థకు అధికారి అయ్యే అవకాశం ఉంది. ఆశించిన స్థాయిలో బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగు తుంది. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారమవుతాయి. ఆదాయం బాగావృద్ధి చెందుతుంది. శుభ కార్యాలు జరుగుతాయి. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి.
  5. కుంభం: ఈ రాశికి లాభ స్థానంలో రవి సంచారం అత్యంత శుభ యోగం. ఏలిన్నాటి శని దోషం కూడా తొల గిపోతుంది. ఆర్థిక సమస్యల నుంచి, వ్యక్తిగత సమస్యల నుంచి పూర్తిగా బయటపడడం జరుగుతుంది. అనేక వైపుల నుంచి ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో పదోన్నతులు లభిస్తాయి. వృత్తి జీవితం బాగా బిజీ అయిపోతుంది. వ్యాపారాలు కూడా నష్టాల నుంచి బయటపడతాయి. ప్రముఖులతో లాభదాయక పరిచయాలు పెరుగుతాయి.
  6. మీనం: ఈ రాశికి పదవ స్థానంలో రవి సంచారం వల్ల ఈ రాశివారికి దిగ్బల యోగం ఏర్పడింది. దీని ఫలితంగా వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం, ప్రాభవం బాగా పెరుగుతాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. తండ్రి నుంచి ఆస్తి కలిసి వస్తుంది. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారమవుతాయి. ప్రభుత్వం నుంచి ఆశించిన గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు కూడా లభిస్తాయి. పలుకుబడి బాగా వృద్ధి చెందుతుంది.