Astrology 2025: కొత్త ఏడాది బుధుడి అనుగ్రహం.. ఆ రాశులకు అదిరిపోయే శుభారంభం..!

Budh Gochar 2025: ప్రతిభా పాటవాలు, ప్రణాళికలు, వ్యూహాలు, తెలివితేటలు, సమయస్ఫూర్తి, అకౌంట్స్, పరిష్కారాలు వంటి అంశాలకు కారకుడు బుధుడు. ఈ బుధ గ్రహం జనవరి 5న ధనూ రాశిలో ప్రవేశించనుంది. దీనివల్ల కొన్ని రాశుల వారికి కొత్త ఏడాది శుభారంభం కాబోతోంది. బుధుడు బలంగా, అనుకూలంగా ఉన్న రాశులవారు కొత్త ఏడాదికి సంపాదించిన ప్రణాళికలను రూపొందించుకుని, వాటికి తగ్గట్టుగా జీవితంలో పురోగతి చెందే అవకాశం ఉంది.

Astrology 2025: కొత్త ఏడాది బుధుడి అనుగ్రహం.. ఆ రాశులకు అదిరిపోయే శుభారంభం..!
Budh Transit 2025
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Dec 14, 2024 | 1:12 PM

ప్రతిభా పాటవాలు, ప్రణాళికలు, వ్యూహాలు, తెలివితేటలు, సమయస్ఫూర్తి, అకౌంట్స్, పరిష్కారాలు వంటి అంశాలకు కారకుడైన బుధుడు జనవరి 5న ధనూ రాశిలో ప్రవేశించడం జరుగుతోంది. దీనివల్ల కొన్ని రాశుల వారికి కొత్త ఏడాది శుభారంభం కాబోతోంది. బుధుడు బలంగా, అనుకూలంగా ఉన్న రాశులవారు కొత్త ఏడాదికి సంపాదించిన ప్రణాళికలను రూపొందించుకుని, వాటికి తగ్గట్టుగా జీవితంలో పురోగతి చెందే అవకాశం ఉంది. మిథునం, సింహం, కన్య, వృశ్చికం, కుంభం, మీన రాశుల వారు బుధుడి ధనూ రాశి సంచారం వల్ల అత్యధికంగా లాభం పొందే అవకాశం ఉంది. బుధ గ్రహం ఈ రాశిలో 24వ తేదీ వరకూ కొనసాగుతుంది.

  1. మిథునం: రాశినాథుడు బుధుడు సప్తమ స్థానంలో ప్రవేశిస్తున్నందువల్ల కొన్ని వ్యక్తిగత సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు కొద్ది ప్రయత్నంతో పరిష్కారమయ్యే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు సఫలమై ఉన్నత స్థాయి వ్యక్తితో సంబంధం కుదిరే అవకాశం ఉంది. లాభదాయక ఒప్పందాలు కుదురుతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు బాగా పెరుగుతాయి. గృహ, వాహన ప్రయ త్నాలు చేపట్టడానికి ఇది అనుకూల సమయం. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి.
  2. సింహం: ఈ రాశికి ధన, లాభ స్థానాల అధిపతిగా బుధుడు పంచమ స్థానంలో ప్రవేశించడం వల్ల ప్రణాళిక ప్రకారం వ్యవహరించి ఆదాయాన్ని వృద్ధి చెందించడంతో పాటు ముఖ్యమైన ఆర్థిక సమస్యలను పరిష్కరించుకోవడం జరుగుతుంది. ఆదాయ మార్గాలను విస్తరించుకునే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో కొద్దిపాటి మార్పులతో విశేష లాభాలు సంపాదించడం జరుగుతుంది. ఉద్యోగుల సమర్థతకు గుర్తింపు లభించి, డిమాండ్ వృద్ధి చెందుతుంది. కుటుంబ సమస్యలు పరిష్కారమవుతాయి.
  3. కన్య: రాశ్యధిపతి బుధుడు చతుర్థ స్థానంలో సంచారం చేయడం వల్ల కుటుంబంలో అనేక సమస్యలు పరిష్కారమై, సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి. గృహ, వాహన సౌకర్యాలు ఏర్పడతాయి. విద్యార్థులు ఘన విజయాలు సాధిస్తారు. ఉద్యోగంలో స్థిరత్వం లభించడంతో పాటు అనేక శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపారాల్లో ఆర్థిక లాభాలు బాగా వృద్ధి చెందుతాయి. ఆస్తి సమస్యలు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. ఆస్తిపాస్తుల విలువ బాగా పెరుగుతుంది.
  4. వృశ్చికం: ఈ రాశికి లాభాధిపతిగా బుధుడు ధన స్థానంలో సంచారం చేయడం వల్ల అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది. ముఖ్యమైన ఆర్థిక సమస్యలు పరిష్కారమై, మానసికంగా ఊరట కలుగు తుంది. ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి. భూ లాభం కలుగుతుంది. మాతృమూలకంగా ధన లాభం కలుగుతుంది. ప్రముఖులతో లాభదాయక ఒప్పందాలు చోటు చేసుకుంటాయి. వ్యక్తిగత, కుటుంబ సమస్యలను కొద్ది ప్రయత్నంతో పరిష్కరించుకుంటారు. అనారోగ్యాలకు సరైన చికిత్స లభిస్తుంది.
  5. కుంభం: ఈ రాశికి లాభ స్థానంలో బుధ సంచారం వల్ల అనేక విధాలైన ఆర్థిక లాభాలు కలుగుతాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. ప్రముఖులతో పరిచయాలు, సంబంధాలు వృద్ధి చెందుతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాలను మించి పెరుగుతాయి. వ్యాపారాలను విస్తరించే అవకాశం కూడా ఉంది. షేర్లు, స్పెక్యులేషన్ల వల్ల అపార ధన లాభం కలుగుతుంది. ఆస్తి వివాదాలు, కోర్టు వివాదాలు పరిష్కారమై, సంపద పెరుగుతుంది.
  6. మీనం: ఈ రాశికి భాగ్య స్థానంలో బుధ సంచారం వల్ల అనేక సమస్యలు, వివాదాల్ని కొద్ది ప్రయత్నంతో పరిష్కరించుకుంటారు. కుటుంబంలో సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి. గృహ, వాహన ప్రయ త్నాలు ఒక కొలిక్కి వస్తాయి. తండ్రి వైపు నుంచి ఆస్తి కలిసి వస్తుంది. నిరుద్యోగులకు విదే శాల్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఉద్యోగుల సమర్థతకు, ప్రతిభకు గుర్తింపు లభించి డిమాండ్ పెరుగుతుంది. అనారోగ్యం నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది.

కొత్త ఏడాది ఆ రాశుల వారికి అదిరిపోయే శుభారంభం
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అదిరిపోయే శుభారంభం
ముల్లంగే అని తేలిగ్గా తీసుకోండి.. ఈకాలంలో తింటే బోలెడన్ని లాభాలు!
ముల్లంగే అని తేలిగ్గా తీసుకోండి.. ఈకాలంలో తింటే బోలెడన్ని లాభాలు!
పాలల్లో ఖర్జూరం కలిపి తీసుకుంటే..ఖతర్నాక్‌ బెనిఫిట్స్‌..!ఊహింలేరు
పాలల్లో ఖర్జూరం కలిపి తీసుకుంటే..ఖతర్నాక్‌ బెనిఫిట్స్‌..!ఊహింలేరు
అజ్ఞాతంలో మోహన్ బాబు.. పారిపోలేదంటూ ట్వీట్..
అజ్ఞాతంలో మోహన్ బాబు.. పారిపోలేదంటూ ట్వీట్..
పోలీస్ నేమ్ బోర్డుతో ఏపీలోకి దూసుకొచ్చిన వాహనం.. సీన్ కట్ చేస్తే
పోలీస్ నేమ్ బోర్డుతో ఏపీలోకి దూసుకొచ్చిన వాహనం.. సీన్ కట్ చేస్తే
ఖతర్నాక్‌ కిలేడీ... ఆదరించిన వారికే సున్నం పెట్టింది.. నమ్మించి
ఖతర్నాక్‌ కిలేడీ... ఆదరించిన వారికే సున్నం పెట్టింది.. నమ్మించి
తప్పుగా రాస్తే తాట తాటతీస్తాం.. సీరియస్ అవుతున్న హీరోయిన్స్
తప్పుగా రాస్తే తాట తాటతీస్తాం.. సీరియస్ అవుతున్న హీరోయిన్స్
అద్దెకొచ్చి ఎంత పని చేశారురా.. చివరికి సీన్ సితారయ్యింది.!
అద్దెకొచ్చి ఎంత పని చేశారురా.. చివరికి సీన్ సితారయ్యింది.!
ఆడ తోడు కోసం మూడు సముద్రాలు దాటిన తిమింగలం..! సరికొత్త రికార్డ్‌
ఆడ తోడు కోసం మూడు సముద్రాలు దాటిన తిమింగలం..! సరికొత్త రికార్డ్‌
మీ ప్రేమతో నా హృదయం నిండిపోయింది.. అల్లు అర్జున్..
మీ ప్రేమతో నా హృదయం నిండిపోయింది.. అల్లు అర్జున్..