Horoscope Today: వారి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది..12 రాశుల వారికి రాశిఫలాలు
Today Horoscope (December 26, 2025): మేష రాశి వారికి ఈ రోజు ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా సాగిపోతుంది. పుణ్య క్షేత్ర సందర్శనకు అవకాశం ఉంది. వృషభ రాశి వారికి ఆదాయానికి లోటుండకపోవచ్చు. ఆర్థికంగా ఎలాంటి ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. మిథున రాశి వారికి అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఉద్యోగంలో అధికారుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

దిన ఫలాలు (డిసెంబర్ 26, 2025): మేష రాశి వారికి ఈ రోజు ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా సాగిపోయే అవకాశం ఉంది. వృషభ రాశి వారు ఆర్థికంగా ఎలాంటి ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అయ్యే అవకాశముంది. మిథున రాశి వారికి ఉద్యోగంలో అధికారుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభించే అవకాశముంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
సమయం అన్ని విధాలా అనుకూలంగా ఉంది. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా సాగిపోతుంది. వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల నమ్మకాన్ని చూరగొంటారు. వ్యాపారాల్లో మీ ప్రయత్నాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. ఆధ్యాత్మిక చింతన పెరిగి, దైవ కార్యాల్లో పాల్గొంటారు. పుణ్య క్షేత్ర సందర్శనకు అవకాశం ఉంది. ఆదాయం వృద్ధి చెందుతుంది. నిరుద్యోగులకు ఆశించిన శుభవార్త అందుతుంది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ఆదాయానికి లోటుండకపోవచ్చు. ఆర్థికంగా ఎలాంటి ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. అనుకోకుండా మంచి అదృష్ట యోగం పడుతుంది. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. ఉద్యోగంలో హోదా పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు చాలావరకు లాభదాయకంగా సాగిపోతాయి. నిరుద్యోగులకు మంచి జీతభత్యాలతో ఆశించిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆకస్మిక ప్రయాణాలకు అవకాశముంది. ఒకరిద్దరు బంధుమిత్రులకు ఆర్థికంగా సహాయపడతారు.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
శుభ గ్రహాల అనుకూలత వల్ల అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఉద్యోగంలో అధికారుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. వృత్తి జీవితంలో బిజీ అవుతారు. వ్యాపారాల్లో కొద్దిగా లాభాలు కనిపిస్తాయి. నిరుద్యోగులకు ఒకటి రెండు అవకాశాలు కలిసి వస్తాయి. ఆదాయం పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. అదనపు ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. కొందరు బంధువులు పక్కదోవ పట్టించడం జరుగుతుంది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
రాశ్యధిపతి శని ధన స్థానంలోనూ, శుక్రుడు లాభ స్థానంలోనూ ఉన్నందువల్ల ఆదాయానికి, గౌరవమర్యాదలకు లోపం ఉండదు. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. ప్రోత్సాహకాలు లభిస్తాయి. ధనాభివృద్ధికి అవకాశాలు పెరుగుతాయి. ఆర్థికంగా స్థిరత్వం లభిస్తుంది. వృత్తి జీవితంలో రాబడి పెరుగుతుంది. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. పెళ్లి ప్రయత్నాల్లో తగిన స్పందన లభిస్తుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
ఆష్టమ శని కారణంగా ఇంటా బయటా ఒత్తిడి ఉంటుంది. కొద్దిగా అనారోగ్యానికి కూడా అవకాశం ఉంది. ఇతర గ్రహాల అనుకూలత వల్ల శుభవార్తలు కూడా వింటారు. గట్టి పట్టుదలతో కొన్ని ముఖ్యమైన వ్యవహారాలను చక్కబెడతారు. వృత్తి, ఉద్యోగ బాధ్యతలను సంతృప్తికరంగా నిర్వర్తిస్తారు. వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. ఇతరుల వివాదాల్లో తలదూర్చకపోవడం మంచిది. ఆదాయానికి లోటుండకపోవచ్చు. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
ఉద్యోగంలో స్థిరత్వం లభించడంతో పాటు పురోగతి కూడా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో క్షణం కూడా తీరిక ఉండకపోవచ్చు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఉచిత సహాయాలకు, దాన ధర్మాలకు దూరంగా ఉండాలి. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. జీవిత భాగస్వామితో కలిసి దైవ దర్శనాలు చేసుకుంటారు. అనవసర పరిచయాలతో కొద్దిగా ఇబ్బంది పడతారు. ఒకటి రెండు శుభవార్తలు వింటారు. వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
వృత్తి, ఉద్యోగాలు సానుకూలంగా సాగిపోతాయి. వ్యాపారాలు లాభాలు తెచ్చి పెడతాయి. శుభ గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నందువల్ల ఏదో విధంగా అదృష్టం కలిసి రావడానికి అవకాశం ఉంది. ఏ ప్రయత్నం తలపెట్టినా అనుకూలిస్తుంది. ముఖ్యమైన పెండింగ్ పనులన్నీ కొద్దిపాటి శ్రమతో పూర్తవుతాయి. జీవిత భాగస్వామి తన వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన స్థాయిలో పురోగతి సాధిస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆర్థిక విషయాల్లో కొందరు మిత్రులతో జాగ్రత్తగా ఉండడం మంచిది.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం బాగా పెరుగుతాయి. మీ పనితీరుతో అధికారులు సంతృప్తి చెందు తారు. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. రాశ్యధిపతి శుక్రుడి శుభ దృష్టి వల్ల రోజంతా శుభ వార్తలతో, సుఖ సంతోషాలతో సాగిపోతుంది. ఆదాయం బాగా పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ముఖ్యమైన సమస్యలు పరిష్కారమవుతాయి. మిత్రులతో విందుల్లో పాల్గొంటారు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో ఒకటి రెండు శుభవార్తలు వింటారు. పిల్లలు వృద్దిలోకి వస్తారు.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
ఆర్థికంగా కొద్దిపాటి అదృష్టం కలుగుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. అన్ని వైపుల నుంచి ఆదాయం పెరుగుతుంది. దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఉద్యోగంలో మాట చెల్లుబాటు అవుతుంది. వృత్తి జీవితం బిజీగా మారిపోతుంది. ఆస్తి వివాదంలో రాజీమార్గం అనుసరిస్తారు. కుటుంబ బాధ్యతల్ని నిర్వర్తించడంలో కొద్దిగా ఇబ్బందులు పడతారు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సానుకూలపడతాయి. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. ఎవరినీ గుడ్డిగా నమ్మ వద్దు.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
వృత్తి, ఉద్యోగాల్లో బరువు బాధ్యతలు పెరిగినప్పటికీ, మీ శ్రమకు, ప్రతిభకు మంచి గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాల్లో స్వల్ప లాభాలకు అవకాశం ఉంది. ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాలు, పనులు సజావుగా పూర్తవుతాయి. బంధుమిత్రులు మీ నుంచి సహాయాన్ని ఆశించడం జరుగుతుంది. ప్రయాణాల లాభాలు కలుగుతాయి. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆరోగ్యం మీద కొద్దిగా శ్రద్ధ పెట్టడం మంచిది.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ఆశించిన శుభ వార్తలు వింటారు. ఎక్కువగా శుభ ఫలితాలు చోటు చేసుకుంటాయి. వృత్తి, ఉద్యోగాల్లో సానుకూల మార్పులు జరుగుతాయి. వ్యాపారాలు నిలకడగా సాగుతాయి. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలపడతాయి. వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి. తలపెట్టిన పనుల్లో కార్యసిద్ధి ఉంటుంది. దైవ చింతన పెరుగుతుంది. ఆరోగ్యం బాగా అనుకూలంగానే ఉంటుంది. పిల్లలు చదువుల్లో బాగా పురోగతి సాధిస్తారు.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
వృత్తి, ఉద్యోగాల్లో ప్రోత్సాహకర వాతావరణం నెలకొంటుంది. వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. మొండి బాకీలు వసూలవుతాయి. ప్రముఖులతో కలిసి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ జీవితం సామరస్యంగా సాగిపోతుంది. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఉద్యోగం లభిస్తుంది. పెళ్లి ప్రయత్నాలు సఫలమవుతాయి.