Coffee: కాఫీ తాగేవారికి శుభవార్త.. మీ ఆయుష్షుకు డోకాలేదిక! ఎందుకంటే

రోజూ ఉదయాన్ని ఘుమఘుమలాడే కాసిన్ని కాఫీ నీళ్లు గొంతు తడపగానే వచ్చే హుషారు, ఆనందం.. అది అస్వాధించేవారికే తెలుస్తుంది. అయితే ఇలా రోజును కాఫీతో ప్రారంభించేవారికి నిపుణులు శుభవార్త తెలిపారు. అదేంటంటే..

Srilakshmi C

|

Updated on: Dec 14, 2024 | 8:00 PM

ఘుమ ఘుమ లాడే కాఫీ ముక్కుకు తగిలిందంటే తాగకుండా ఉండలేరు. రోజూ కప్పు కాఫీ తాగితే మంచిదే. అయితే రోజంతా అదేపనిగా లెక్కకు మించి కాఫీ తాగడం మాత్రం ఆరోగ్యానికి హానికరం. ఎక్కువగా తాగితే అమృతం కూడా విషం మాదిరి పనిచేస్తుంది. అయితే రోజూ 3 కప్పుల వరకు మితంగా కాఫీ తాగడం వల్ల ఆయుష్షు పెరుగుతుందని తాజా పరిశోధనలో తేలింది.

1 / 5
పొద్దున్నే లేవగానే కప్పు కాఫీ తాగితే రోజంగా హాయిగా ఉంటుందని చాలా మంది భావిస్తుంటారు. అయితే కొందరికి గంటకోసారి కాఫీ తాగే అలవాటు ఉంటుంది. అయితే రోజుకు మూడు కప్పుల వరకు కాఫీ తాగడం వల్ల ఆయుష్షు పెరుగుతుందట.

2 / 5
పోర్చుగల్‌లోని కోయింబ్రా విశ్వవిద్యాలయానికి చెందిన ఓ బృందం నేతృత్వంలోని ఇటీవలి అధ్యయనం ప్రకారం.. జీవితకాలం మెరుగుపరచడానికి కాఫీ సరైన పానీయం అని చెబుతున్నారు. యూరప్, అమెరికా, ఆస్ట్రేలియా, ఆసియా అంతటా దాదాపు 85 అధ్యయనాల నుంచి సేకరించిన నివేదికలు ఈ విషయాన్ని వెల్లడిస్తు్న్నాయి.

3 / 5
రోజుకు కనీసం మూడు కప్పుల కాఫీ తాగే వ్యక్తుల జీవితకాలానికి అదనంగా 1.84 సంవత్సరాలు పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. రెగ్యులర్ కాఫీ వినియోగం కండరాల, హృదయ, మానసిక, రోగనిరోధక వ్యవస్థలపై సానుకూల ప్రభావాలను చూపుతుంది.

4 / 5
స్ట్రోక్, కొన్ని రకాల క్యాన్సర్లు, మధుమేహం, చిత్తవైకల్యం, మేజర్ డిప్రెషన్‌ను నివారించడంలోనూ కాఫీ సహాయపడుతుంది. ఆరోగ్యకరమైన జీవితానికి కాఫీ, కెఫిన్ మాత్రమే కారణం కాదు. వాటి సానుకూల ఆరోగ్య ప్రభావాలు జీవిత నాణ్యతను మెరుగుపరిచే మార్గాన్ని కలిగి ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

5 / 5
Follow us