Tollywood: సీన్ గురించి చెప్పాలని గదిలోకి పిలిచి అసభ్యంగా ప్రవర్తించాడు.. ఆరు నెలల్లోనే.. సీనియర్ హీరోయిన్
తెలుగు సినిమా ప్రపంచంలో సహాయ నటిగా సుపరిచితమయ్యారు జయలలిత. అప్పట్లో అనేక సినిమాల్లో నటించి ఆకట్టుకున్నారు. వెండితెరపై నెగిటివ్, కమెడియన్, గ్లామర్ రూల్స్ పోషించి మెప్పించారు. తెలుగు, తమిళం, మలయాళం భాషలలో అనేక చిత్రాల్లో నటించి మెప్పించారు. ఇప్పుడు బుల్లితెరపై పలు సీరియల్స్ చేస్తున్నారు.

సీనియర్ నటి జయలలిత ప్రేక్షకులకు సుపరిచితమే. తెలుగు, తమిళం, మలయాళం భాషలలో అప్పట్లో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించారు. సహయ నటిగా, కమెడియన్ గా అలరించారు. అలాగే అప్పట్లో గ్లామర్ పాత్రలతో ఫాలోయింగ్ సంపాదించకున్నారు. కమల్ హాసన్ నటించిన ఇంద్రుడు చంద్రుడు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఆమె.. ఆ తర్వాత మామ అల్లుడు, లారీ డ్రైవర్, అప్పుల అప్పారావు, జంబలకిడి పంబా, మెకానిక్ అల్లుడు, ముఠా మేస్త్రీ వంటి అనేక చిత్రాల్లో నటించారు. ఒకప్పుడు సినిమాల్లో ముఖ్య పాత్రలలో కనిపించిన ఆమె.. ఇప్పుడు బుల్లితెరపై సీరియల్స్ చేస్తూ బిజీగా ఉంటున్నారు. బంగారు గాజులు, ప్రేమ ఎంత మధురం వంటి సీరియల్స్ ద్వారా ఫ్యామిలీ ప్రేక్షకులకు దగ్గరయ్యారు. కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడే మలయాళీ డైరెక్టర్ వినోద్ ను ప్రేమ వివాహం చేసుకున్నారు. ఏడేళ్లు ప్రేమలో ఉన్న తర్వాత పెద్దల సమక్షంలో ఒక్కటయ్యారు.
ఇవి కూడా చదవండి : Folk Song : యూట్యూబ్లో కోట్ల వ్యూస్.. నెల రోజులుగా ఇంటర్నెట్ షేక్.. ఇప్పటికీ దూసుకుపోతున్న పాట..
గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ఆసక్తికర విషయాలు పంచుకున్నరు. ఇంద్రుడు చంద్రుడు సినిమాకు తాను రూ.1 లక్షల పారితోషికం తీసుకున్నట్లు వెల్లడించారు. ఓ మలయాళం సినిమా చేసేపటప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని తెలిపింది. మొదట్లో తనకు మలయాళం భాష రాదని.. మొదటి సారి మలయాళంలో సినిమా కోసం వెళ్లానని.. అందులో లైంగిక దాడి సీన్ గురించి చెప్పాలని అసిస్టెంట్ డైరెక్టర్ గదిలోకి పిలిచి అసభ్యకరంగా ప్రవర్తించాడని చెప్పుకొచ్చింది. ఆ ఘటన జరిగిన ఆరు నెలలకే అతడు చనిపోయాడని.. ఎలా చనిపోయాడో తనకు తెలియదని చెప్పుకొచ్చింది.
ఇవి కూడా చదవండి : The Paradise: కాంబో అదిరింది భయ్యా.. నానితో ఆ హీరోయిన్ స్పెషల్ సాంగ్.. ది ప్యారడైజ్ నుంచి క్రేజీ అప్డేట్..
అలాగే తాను మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ సినిమాలో హీరోయిన్ పాత్రను మిస్ చేసుకున్నట్లు చెప్పారు. వ్యాంప్ పాత్రల వల్లే ఆ ఛాన్స్ పోయిందని అన్నారు. కెరీర్ మొదట్లో అనేక అవకాశాలు పోయాయని అన్నారు. ప్రస్తుతం జయలలిత స్మాల్ స్క్రీన్ పై సీరియల్స్ చేస్తూ బిజీగా ఉన్నారు.
ఇవి కూడా చదవండి : Rajinikanth: రజినీకాంత్ సినిమా వల్లే నా కెరీర్ పోయింది.. సంచలన కామెంట్స్ చేసిన స్టార్ హీరోయిన్..
ఇవి కూడా చదవండి : Vinay Rai: అప్పుడు హీరోగా.. ఇప్పుడు విలన్గా.. ఈ నటుడి ప్రియురాలు తెలుగులో క్రేజీ హీరోయిన్.. ఎవరంటే.
