నటి ప్రత్యూష మరణం తర్వాత గత 24 ఏళ్లుగా నరకం అనుభవిస్తున్నామని ఆమె తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. తమ న్యాయపోరాటానికి సినిమా రంగం, రాజకీయ నాయకులు, ప్రభుత్వాలు ఎవరూ సహాయం చేయలేదని, దోషులను మాత్రం కలుస్తున్నారని ఆమె ఆరోపించారు. బాధితులను కాదని, పాపులకు మద్దతిచ్చే ఈ సమాజం, ప్రభుత్వాలు ఎందుకని ప్రశ్నించారు.