ఉల్లి లేనిదే సాధారణంగా ఏ వంట పూర్తికాదు. అందుకే దాదాపు అందరి వంటగదుల్లో ఉల్లి ఖచ్చితంగా ఉంటుంది. ఉల్లితో పకోడి, సలాడ్స్, సాండ్‌విచ్ వంటి వాటిల్లో కూడా ఉల్లిని ఎక్కువగా వాడేస్తుంటారు
TV9 Telugu
చాలా మంది ఉల్లిని భోజనంతో పాటు వివిధ రకాల చిరుతిండ్లతో పచ్చిగా తీసుకుంటారు. నిజానికి పచ్చి ఉల్లి తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ఇందులో క్వెర్సెటిన్ ఉంటుంది
TV9 Telugu
ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా శరీరంలో వాపులను, అలర్జీ లక్షణాలను కూడా ఇది తగ్గిస్తుంది. ఇవి యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలను కూడా కలిగి ఉంటాయి
TV9 Telugu
భోజనంతో పాటు పచ్చి ఉల్లిపాయలను తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు అధిక రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది
TV9 Telugu
ఉల్లిపాయల్లో విటమిన్ సి, బి విటమిన్లు, పొటాషియం వంటి పోషకాలు కూడా ఉంటాయి. అధిక రక్తపోటుతో బాధపడే వారు ఉల్లిపాయలను తీసుకోవడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది
TV9 Telugu
ఉల్లిపాయల్లో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ లక్షణాలు కూడా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి
TV9 Telugu
డయాబెటిస్‌తో బాధపడే వారికి కూడా ఉల్లి ప్రయోజనకరంగా ఉంటాయి. ఉల్లిపాయలను తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి
TV9 Telugu
డయాబెటిస్, ప్రీ డయాబెటిస్ తో బాధపడే వారు ఉల్లిపాయలను తీసుకోవడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు. ఎముకల దృఢత్వానికి ఉల్లి ఎంతో ఉపయోగపడుతుంది. జుట్టు పెరుగుదలకు కూడా ఉల్లి సహాయపడుతుంది