AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

New Year 2026: 2026 లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు! పాటించిన వారికి సంతోషం, సంపన్నమైన జీవితం ..!!

2026లో ముఖ్యమైన పండుగలు, వ్రతాలు ఎప్పుడు వస్తున్నాయి. ఏ రోజున ఏ పండుగ, ఎప్పుడు ఉపవాసం వంటి వివరాల కోసం కూడా చాలా మంది చూస్తుంటారు. అయితే, వచ్చే ఏడాదిలో అందరూ పాటించాల్సిన ముఖ్యమైన రోజులు, ఉపవాసాల పూర్తి లిస్ట్ ఇక్కడ ఉంది. ఇవి మీ విధిని మార్చే ప్రత్యేక ఉపవాసాలు..! సంతోషకరమైన, సంపన్నమైన జీవితం కోసం ఎలాంటి ఉపవాసాలు పాటించాలో ఇక్కడ చూద్దాం..

New Year 2026: 2026 లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!  పాటించిన వారికి సంతోషం, సంపన్నమైన జీవితం ..!!
Upavasam
Jyothi Gadda
|

Updated on: Dec 27, 2025 | 8:33 AM

Share

2026కొత్త సంవత్సరానికి కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉంది. పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ.. కొత్త ఏడాది కోసం ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆధ్యాత్మిక పరంగా కూడా వచ్చే ఏడాది కోసం ప్రజలు ముందుగానే ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటారు. 2026లో ముఖ్యమైన పండుగలు, వ్రతాలు ఎప్పుడు వస్తున్నాయి. ఏ రోజున ఏ పండుగ, ఎప్పుడు ఉపవాసం వంటి వివరాల కోసం చూస్తుంటారు. అయితే, 2026లో అందరూ పాటించాల్సిన ముఖ్యమైన పండుగలు, ఉపవాసాల పూర్తి లిస్ట్ ఇదిగో ..

2026 సంవత్సరంలో ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా పాటించాల్సిన 10 ప్రత్యేక ఉపవాసాల గురించి ఇక్కడ చూద్దాం..

2026 సంవత్సరంలో పాటించాలసిన 10 ప్రత్యేక ఉపవాసాలు..

ఇవి కూడా చదవండి

పాపమోచని ఏకాదశి 2026:

హిందూ మతంలో, సంవత్సరంలో 24 నుండి 26 ఏకాదశి రోజులు ఉంటాయి. అన్ని ఏకాదశి రోజుల మాదిరిగానే, పాపమోచని ఏకాదశి హిందూ మతంలో ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది. 2026 లో పాపమోచని ఏకాదశి మార్చి 15 ఆదివారం రోజున వస్తుంది. పాపమోచని ఏకాదశి ఉపవాసం పాటించడం వల్ల సకాల పాపాల నుండి విముక్తి లభిస్తుంది. విష్ణువు ఆశీస్సులు లభిస్తాయి.

2026లో శనిశ్చరి అమావాస్య ఉపవాసం:

జ్యోతిషశాస్త్ర దృక్పథం ప్రకారం, శని అమావాస్య ..మే 16 శనివారం రోజున వస్తుంది. శని అమావాస్య అనేది సంవత్సరానికి రెండుసార్లు మాత్రమే వచ్చే అరుదైన సంఘటన. శని మహాదశ ప్రభావంతో లేదా దుష్ప్రభావాలతో బాధపడుతున్న ఎవరైనా ఈ ఉపవాసం పాటించాలి.

వట్ సావిత్రి వ్రతం 2026:

వట సావిత్రి వ్రతం మే 16వ తేదీ శనివారం నాడు వస్తుంది. హిందూ మతంలో వివాహిత స్త్రీలకు ఈ ఉపవాసం ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఈ ఉపవాసం పాటించడం వల్ల భర్తకు శ్రేయస్సు, ఆనందం, శాంతి, ఆరోగ్యం, దీర్ఘాయువు లభిస్తాయని విశ్వాసం.

వరలక్ష్మీ వ్రతం 2026:

ప్రత్యేకించి లక్ష్మీ దేవిని పూజించే ఈ వరలక్ష్మీ వ్రతం ఆగస్టు 28 శుక్రవారం నాడు వస్తుంది. ఈ రోజున ఉపవాసంతో వ్రతం ఎంతో ఫలితానిస్తుంది. ముఖ్యంగా వివాహిత స్త్రీలు సంతోషకరమైన వైవాహిక జీవితం, కుంటుంబ సంక్షేమం కోసం లక్ష్మీదేవి ఆశీస్సులు కోరుతూ ఈ వ్రతం చేస్తారు.

కర్వా చౌత్ 2026:

వివాహిత స్త్రీలు తమ భర్తల దీర్ఘాయుష్షు, సంతోషకరమైన జీవితం కోసం ప్రార్థించడానికి కర్వా చౌత్ ఉపవాసం పాటిస్తారు. ఈ రోజున మహిళలు ఉపవాసం పాటిస్తారు. చంద్రుడిని పూజిస్తారు. ఆ తర్వాత మాత్రమే ఉపవాసం విడుస్తారు. 2026 లో కర్వా చౌత్ అక్టోబర్‌ 29 గురువారం రోజున వస్తుంది.

హర్తాళికా, హరియాలీ, కజారి తీజ్ 2026:

ఈ మూడు తీజ్ ఉపవాసాలు సంతోషకరమైన వైవాహిక జీవితానికి, అదృష్టం, శ్రేయస్సు కోసం చేసే వ్రతాలు. 2026 లో హరియాలి తీజ్ జూలై 27 సోమవారం రోజున, కజారి తీజ్ ఆగస్టు 31 సోమవారం, హరియాలి తీజ్ సెప్టెంబర్‌ 14 సోమవారం రోజున జరుపుకుంటారు.

2026 లో నవరాత్రి ఉపవాసాలు:

నవరాత్రి ఉపవాసాలు సంవత్సరానికి రెండుసార్లు ఆచరిస్తారు. మొదటిది చైత్ర మాసంలో, రెండవది అశ్విని మాసంలో.. దీనిని శారదియ నవరాత్రి అని కూడా పిలుస్తారు. 2026 లో చైత్ర నవరాత్రి మార్చి 20 న ప్రారంభమవుతుంది. శారదియ నవరాత్రి అక్టోబర్ 11న ప్రారంభమవుతుంది.

జన్మాష్టమి 2026 వ్రతం:

2026 సంవత్సరంలో కృష్ణ జన్మాష్టమి ఉపవాసం సెప్టెంబర్ 4న పాటిస్తారు. శ్రీకృష్ణుడు ఈ రోజున జన్మించాడు.

నిర్జల, దేవశయని, దేవుత్తని ఏకాదశి ఉపవాసం:

ఏటా వచ్చే 24 ఏకాదశిలలో నిర్జల, దేవుత్తని, దేవశయని ఏకాదశిలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజుల్లో విష్ణువు, లక్ష్మీ దేవి సమేతంగా పూజిస్తారు. 2026లో నిర్జల ఏకాదశి జూన్ 25న, దేవశయని ఏకాదశి జూలై 25న, దేవుత్తని ఏకాదశి నవంబర్ 20న వస్తుంది.

Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

మరిన్ని హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వార్తల కోసం క్లిక్ చేయండి..