అమావాస్య నాడు చేయాల్సిన, చేయకూడని పనులు ఏంటో తెలుసా..? లేదంటే..
అమావాస్యనాడు పితృదేవతలకు తర్పణాలు, దీపారాధన, శివలింగాభిషేకం, దానధర్మాలు చేయడం వల్ల పితృదోషాలు తొలగి, సంపద, ఆరోగ్యం కలుగుతాయి. ఉపవాసం, తులసి పూజ శ్రేయస్సును పెంచుతాయి. అయితే, అమావాస్య శక్తి స్థాయిలు తక్కువగా ఉన్న రోజు కనుక వివాహం, గృహప్రవేశం వంటి శుభకార్యాలు, నిర్మాణ పనులు చేయకూడదని పౌరాణిక గ్రంథాలు సూచిస్తున్నాయి.

అమావాస్యనాడు సూర్యోదయానికి ముందు స్నానం చేయడం చాలా మంచిది. ఆ తర్వాత మిగిలిన ఆచారాలను పాటించవచ్చు. పితృదేవతలకు అమావాస్యనాడు తర్పణం అర్పించడం వల్ల పితృదోషాలు తొలగిపోతాయి. వారి అనుగ్రహాన్ని పొందవచ్చు. అమావాస్యనాడు ఇంట్లో లేదా ఆలయంలో దీపం వెలిగిస్తే మంచిది. దీని వల్ల సంపదను పెంచుకోవచ్చు. అలాగే, అమావాస్యనాడు శివలింగానికి గంగాజలంతో అభిషేకం చేస్తే ఎంతో మంచి జరుగుతుంది. ఆరోగ్యం కూడా బాగుంటుంది.
అమావాస్య నాడు ఉపవాసం ఉంటే కూడా మంచి జరుగుతుంది. అలా ఉండలేని వారు సాత్విక ఆహారాన్ని తీసుకోవచ్చు. ఈ రోజున దానం చేయడం వల్ల చక్కటి ఫలితం కనబడుతుంది. వస్త్రదానం వంటివి చేయొచ్చు. పేదలకు ఆహారాన్ని అందిస్తే లక్ష్మీకటాక్షం కలుగుతుంది. కనుక అమావాస్యనాడు దీనిని కూడా ఫాలో అయ్యేలా చూసుకోండి. హోమం, పూజలుఅమావాస్యనాడు నవగ్రహ హోమం, శివపూజ వంటివి చేస్తే చక్కటి ఫలితం ఉంటుంది. శుభ ఫలితాలను ఎదుర్కోవచ్చు.
అమావాస్యనాడు తులసి మొక్కను పూజించండి. ఇలా చేయడం వల్ల కుటుంబ శ్రేయస్సును పెంచుకోవచ్చు. అయితే, అమావాస్య నాడు చాలా మంది శుభకార్యాలకు పూర్తిగా దూరంగా ఉంటారు. వివాహం, గృహప్రవేశం, నిశ్చితార్థం వంటి పెద్ద కార్యక్రమాలు మాత్రమే కాదు, చిన్న శుభకార్యాలైనా ఈ రోజున నిర్వహించడం చేయరాదని పెద్దలు చెబుతుంటారు. ఎందుకంటే.. ఆధ్యాత్మిక నిపుణుల వివరణ మేరకు ఈ రోజు శాంతమైనదిగానే కనిపించినా శక్తి స్థాయిలు తగ్గినరోజుగా పరిగణిస్తుంటారు. అందుకే ఈ రోజున శుభకార్యాలు, నిర్మాణ పనులు కూడా అమావాస్యలో ఆరంభించకూడదని పౌరాణిక గ్రంథాలు సూచిస్తాయి.
Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




