Viral Video: ఎలా వస్తాయి బ్రో ఇలాంటి ఐడియాలు.. కొత్త కారుపై వెరైటీ స్టికర్..! నవ్వకుండా చూడండి..
సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో రకాల ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. అలాగే, కొంతమంది వ్యక్తులు చేసే జుగాఢ్ వీడియోలు కూడా ప్రజల్ని ఆశ్చర్యపోయేలా చేస్తుంటాయి. ఇంకా కొంతమంది చేసే అతి జాగ్రత్త, వెరైటీ ఆలోచనలు కూడా జనాల్ని ఆశ్చర్యంతో పాటు ఆలోచింపజేస్తుంటాయి. అలాంటిదే కర్ణాటక నుండి వచ్చిన ఒక వీడియో ఇంటర్‌నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరినీ కడుపుబ్బ నవ్విస్తుంది. సాధారణ మారుతి ఆల్టో కారు వెనుక ఉన్న స్టిక్కర్ నెటిజన్లను అవాక్కయ్యేలా చేస్తుంది. అదేంటో మనమూ చూసేద్దాం..

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక వైట్ కలర్ మారుతి ఆల్టో కారు కనిపిస్తుంది. అయితే, ఆ యజమాని కారు వెనుక భాగంలో ఎక్కడ చూడని విధంగా వెరైటీ ఆలోచనతో ఒక స్టిక్కర్‌ను అంటించాడు. అది చూసిన జనాలు ఇతని టాలెంట్ నెక్స్ట్ లెవల్ అని అంటున్నారు. కర్ణాటకలోని రోడ్లపై తిరుగుతూ కనిపించిన ఈ మారుతి ఆల్టో కారుపై ఉన్న స్టిక్కర్ ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. 50 మిలియన్లకు పైగా వ్యూస్‌తో దూసుకుపోతోంది. ఇది చూసిన ప్రతి ఒక్కరూ ఎవరికీ వారు తమ జీవితాలకు అనుసంధానించుకుంటున్నారు. ఇంతకీ వీడియోలో ఏముందేంటే..
వైరల్ అవుతున్న వీడియోలోని మారుతీ కార్ వెనుక ఉన్న స్టిక్కర్ ఇలా ఉంది.. ప్లీజ్ దూరం పాటించండి.. EMI పెండింగ్‌లో ఉంది.. అని రాసి ఉంది. రోడ్లపై సాధారణంగా కనిపించే రోడ్ సెఫ్టీ విషయాల్లో ఇలాంటి గమనిక ఉంటుంది.. కానీ, ఇతను ఫన్నీగా తన సొంతకారుపై ప్రయోగించాడు.. ఈ వెరెటీ స్టికర్ చూసిన ఇంటర్నెట్ వినియోగదారుల హృదయాలను గెలుచుకుంది.
View this post on Instagram
ఈ వీడియోను @bearys_in_dubai అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ షేర్ చేశారు. ఈ క్లిప్ కర్ణాటకలోని మంగళూరులోని సర్క్యూట్ హౌస్ రోడ్డులో ట్రాఫిక్‌లో కనిపించింది. కెమెరా కారు వెనుక ఉన్న స్టిక్కర్‌పైకి వెళ్లగానే ఈ ఫన్నీ మెసేజ్ తెలుస్తుంది. ఈ వీడియోను 57 మిలియన్లకు పైగా చూశారు. 300,000 కంటే ఎక్కువ లైక్‌లు వచ్చాయి. చాలా మంది నెటిజన్లు భిన్నమైన అభిప్రాయాలను తెలియజేశారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..




