AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Santa Claus: ఎవరు ఈ శాంటా క్లాజ్‌..? ఎరుపు దుస్తులు, తెల్లటి గడ్డం వెనుక అసలు విషయం ఏంటంటే..

శాంటా క్లాజ్‌ ఎప్పుడూ ఎరుపు రంగు దుస్తుల్లోనే ఎందుకు కనిపిస్తాడని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? క్రిస్మస్ థీమ్ ఎప్పుడూ ఎరుపు, తెలుపు రంగులో ఎందుకు ఉంటుందో మీకు తెలుసా..? దాని వెనుక ఉన్న ఆసక్తికరమైన కథ ఏంటో ఇక్కడ చూద్దాం.. నిజానికి, దీని వెనుక ఒకటి కాదు, అనేక ప్రసిద్ధ చారిత్రక కథలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం.

Santa Claus: ఎవరు ఈ శాంటా క్లాజ్‌..? ఎరుపు దుస్తులు, తెల్లటి గడ్డం వెనుక అసలు విషయం ఏంటంటే..
Santa Claus
Jyothi Gadda
|

Updated on: Dec 23, 2025 | 12:34 PM

Share

క్రిస్మస్ వచ్చిందంటే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది ఎరుపు రంగు దుస్తులు ధరించి తెల్లటి గడ్డంతో ఉన్న శాంటా క్లాజ్. కానీ, ఈ శాంటా క్లాజ్‌ ఎప్పుడూ ఎరుపు రంగు దుస్తుల్లోనే ఎందుకు కనిపిస్తాడని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? క్రిస్మస్ థీమ్ ఎప్పుడూ ఎరుపు, తెలుపు రంగులో ఎందుకు ఉంటుందో మీకు తెలుసా..? దాని వెనుక ఉన్న ఆసక్తికరమైన కథ ఏంటో ఇక్కడ చూద్దాం.. నిజానికి, దీని వెనుక ఒకటి కాదు, అనేక ప్రసిద్ధ చారిత్రక కథలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం.

శాంటా క్లాజ్ ఎవరు..?

శాంటా అసలు పేరు సెయింట్ నికోలస్ అని చెబుతారు. ప్రచారంలో ఉన్న కథనం ప్రకారం సెయింట్ నికోలస్ నాల్గవ శతాబ్దంలో టర్కీలోని మైరా ప్రాంతంలో నివసించాడు. అతను ఒక గొప్పింట్లో పుట్టిన వ్యక్తి.. కానీ, చిన్నతనంలోనే తల్లిదండ్రులు దూరం కావటంతో అతను అనాథ అయ్యాడని, అలా పెరిగిన ఆయన పేదల పట్ల ఎక్కువ ప్రేమను పెంచుకున్నాడు. పేదలకు బహుమతులు ఇవ్వడం అంటే అతనికి ఎంతో ఇష్టం. అందుకే పేదలను చూస్తే వాళ్లకు తెలియకుండా రహస్యంగా బహుమతులు ఇస్తూ ఉంటాడు. అతను ఒక బిషప్. ఎవరికీ తెలియకుండా ఎప్పుడు సాక్సులో గిఫ్టులు పెట్టి ఇవ్వడం శాంటాకు అలవాటు.

ఇవి కూడా చదవండి

అసలు శాంటా క్లాజ్‌ అనే పేరు ఎలా వచ్చింది?

సెయింట్ నికోలస్‌ అనే వ్యక్తి పేరు క్రమంగా శాంటా క్లాజ్‌గా మారడం వెనుక కూడా ఆసక్తి కరమైన కథనం ఉంది.. ఒకరోజు ఒక పేద వ్యక్తిని చూసిన నికోలస్‌ అతని పట్ల దయతో కరిగిపోతాడు. అతనికి ముగ్గురు కుమార్తెలు ఉంటారు. వారికి వివాహం చేయలేక ఆ పేద తండ్రి తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడని తెలిసింది. పేదరికంలో ఉన్న అతనికి నికోలస్ వరుసగా సాయం చేస్తూ వస్తాడు. ఆ పేద వ్యక్తికి బంగారు నాణాలను సాక్స్ లో పెట్టి కిటికీలో నుంచి ఆయన ఇంట్లో వేసి వెళ్తాడు. అలా ఆయన చేసిన సహాయం వల్ల ఇంటి పెద్ద కుమార్తె వివాహం జరుగుతుంది. ఆ తరువాత మరో రెండుసార్లు కూడా అతని ఇంట్లో అలాగే డబ్బులు వేస్తాడు. అలా సెయింట్‌ నికోలస్‌ సాయంతో ముగ్గురు అమ్మాయిల వివాహం జరిగిపోతుంది.

అయితే, చివరకు ఆ పేద వ్యక్తి ఈ సహాయం చేసేది నికోలస్‌ అని తెలుసుకుంటాడు. అతని ద్వారా చివరకు ఊరు ఊరంతా తెలిసిపోతుంది. సీక్రెట్ గా గిఫ్ట్ ఇచ్చేది శాంటా అని ఇప్పడు ప్రపంచం మొత్తం నమ్ముతోంది. క్రిస్మస్ రోజున ఆయన పిల్లలకు బహుమతులు ఇవ్వడం ఆనవాయితీగా మారిపోయింది. శాంటా క్లాజ్‌ ని ఫాదర్ క్రిస్మస్, ఓల్డ్ మ్యాన్ క్రిస్మస్ అని కూడా పిలుస్తారు.

1823లో క్లెమెంట్ క్లార్క్ మూర్ రాసిన ట్వాస్ ది నైట్ బిఫోర్ క్రిస్మస్ అనే కవిత శాంటాను పిల్లలకు బహుమతులు తెచ్చే ఒక సంతోషకరమైన రూపంతో, బలమైన వృద్ధుడిగా చిత్రీకరించారు. అలా ఇక్కడే శాంటా క్లాజ్ చిత్రం ఏర్పడిందని చెబుతారు.

కోకా-కోలా రోల్:

ఇవన్నీ కాకుండా శాంటా ఎరుపు రంగు దుస్తులను కోకా-కోలా సృష్టించిందని కూడా నమ్ముతారు. వాస్తవానికి కోకా-కోలా 1930లలో తన ప్రకటనలలో శాంటాను ఎరుపు, తెలుపు దుస్తులలో చూపించింది. ఈ రూపాన్ని ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చేసింది. ఈ క్రమంలోన మరో నివేదిక ప్రకారం.. దీనికి ముందు శాంటాను ఎరుపు రంగు దుస్తులలో చూపించారు. దీని అర్థం కోకా-కోలా శాంటాను సృష్టించలేదు. కానీ, ఆ కంపెనీ యాడ్‌ తర్వాత శాంటా ప్రజలలో విస్తృతంగా ప్రాచుర్యం పొందింది.

నేడు శాంటా క్లాజ్ సినిమాలు, కార్టూన్లు, ప్రకటనలలో అంతర్భాగంగా మారింది. శాంతా క్లాజ్ మొదటిసారి 1912లో ఒక సినిమాలో కనిపించింది. ఆ తర్వాత వచ్చిన ఎల్ఫ్, ది శాంటా క్లాజ్, మిరాకిల్ ఆన్ 34త్ స్ట్రీట్ వంటి సినిమాలు శాంటాను మరింత ప్రాచుర్యం పొందేలా చేశాయి.

మరిన్ని హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వార్తల కోసం క్లిక్ చేయండి..