- Telugu News Photo Gallery Spiritual photos These are the things that should be kept in the house to increase wealth in the house
వాస్తు టిప్స్ : ఈ నాలుగు వస్తువులు ఇంటిలో ఉంటే లక్ష్మీదేవి మీ ఇంట ఉన్నట్లే!
వాస్తు శాస్త్రం అనేక విషయాల గురించి తెలియజేస్తుంది. ముఖ్యంగా ఇంటి సమస్యల్లో వాస్తు కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే ప్రతి ఒక్కరూ తప్పకుండా వాస్తు నియమాలు పాటించాలని చెబుతుంటారు.కాగా ఇంటిలో సంపద పెరగాలి అంటే ఎలాంటి వాస్తు టిప్స్ పాటించాలో ఇప్పుడు చూద్దాం.
Updated on: Dec 23, 2025 | 12:45 PM

వాస్తు శాస్త్ర నిపుణులు, వాస్తు నియమాలు పాటించడం గురించి ఎంతో గొప్పగా తెలియజేస్తుంటారు. వాస్తు అనేది వ్యక్తి పురోగతి, కుటుంబంపై ప్రత్యేక ప్రభావం చూపుతుంది. అందుకే ప్రతి ఒక్కరూ వాస్తు నియమాలు పాటించాలి అంటారు. అయితే కొంత మంది ఎంత పని చేసినా ఇంటిలో డబ్బు నిలవకపోవడం, సంపద పెరగకపోవడం జరుగుతుంది. అయితే ఇంటిలో సంపద పెరిగి, లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అంటే తప్పకుండా ఈ నాలుగు వస్తువులు మీ ఇంటిలో ఉండాలి అంటున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. అవి ఏవో ఇప్పుడు చూద్దాం.

మనీ ప్లాంట్ : ఈ మధ్య చాలా మంది ఇళ్ల్లో మనీ ప్లాంట్ అనేది ఉంటుంది. అయితే ఇంటిలో మనీ ప్లాంట్ ఉండటం చాలా శుభప్రదం. మనీ ప్లాంట్ ఇంటిలో వేపుగా పెరగడం వలన ఇంటి పురోగతి కూడా పెరుగుతుందంట. ఎవరి ఇంటిలోనైతే మనీ ప్లాంట్ ఉంటుందో, వారి ఇంటికి అదృష్టం కలుగుతుందని, లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సంపద పెరుగుతుందని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణుల. అయితే మనీ ప్లాంట్‌ను ఈశాన్య దిశలో ఉంచకుండా , ఆగ్నేయ దిశలో పెట్టుకోవడం చాలా మంచిదంట.

లాఫింగ్ బుద్దా : ధనవంతుల ఇళ్లలో తప్పకుండా లాఫింగ్ బుద్దా అనేది ఉంటుంది. అయితే ఇది ఇంటిలో ఉండటం వలన కుటుంబంలో సంతోషం, ఆనందం, శ్రేయస్సు పెరుగుతుంది. దీని వలన ఒత్తిడి తగ్గడమే కాకుండా ఆర్థిక సమస్యలన్నీ తొలిగిపోతాయని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు.

మనీ ఫ్రాగ్ : మీ ఇంటిలో ధనానికి లోటు ఉండకూడదు అంటే తప్పకుండా ఇంటిలో మనీ ఫ్రాగ్ విగ్రహం ఉండాలని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. మనీ ఫ్రాగ్, డబ్బు కప్ప అని కూడా అంటారు. ఇది ఇంటిలో ఉండటం వలన ఆ ఇంటి వారికి అదృష్టం కలిసి రావడమే కాకుండా, అనుకోని మార్గాల ద్వారా డబ్బు ఇంటికి వస్తుందంట. సంపద పెరుగుతుందంట. అయితే ఈ మనీ ఫ్రాగ్ విగ్రహాన్ని, ఇంటి ప్రధాన ద్వారం వద్ద పెట్టుకోవాలి.

వాటర్ ఫౌంటెన్ : ఇంటిలో ప్రవహించే నీటి ఫౌంటెన్ ఉండటం చాలా శుభప్రదం అంటున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. ఇంటిలోని ప్రతి కూల శక్తిని తగ్గించి, సానుకూల శక్తిని పెంచుతాయి. అంతే కాకుండా,ఇది ఎవరి ఇంటిలోనైతే ఉంటుందో, వారికి డబ్బుకు లోటు ఉండదంట. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా ఇది కలిసి వస్తుందని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు.



