AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Astrology 2026: రాజయోగ గ్రహాల బలం.. కొత్త ఏడాది వారికి ప్రభుత్వ ఉద్యోగ యోగం..!

New Year 2026 Horoscope: జ్యోతిషశాస్త్రం ప్రకారం రవి, కుజులు అనుకూల స్థానాల్లో ఉన్నా, బాగా బలంగా ఉన్నా ప్రభుత్వ ఉద్యోగం తప్పకుండా లభిస్తుంది. కొత్త సంవత్సరంలో ఈ రెండు రాజయోగ గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్న రాశులు మేషం, కర్కాటకం, సింహం, వృశ్చికం, ధనుస్సు, కుంభం. ఈ రవి, కుజుల బలాన్ని బట్టి ఈ రాశుల వారికి ప్రభుత్వంలో, బ్యాంకుల్లో, ప్రభుత్వ యాజమాన్యంలోని సంస్థల్లో చిన్న ఉద్యోగం మొదలుకుని ఉన్నత స్థాయి ఉద్యోగాల వరకు లభించే అవకాశం ఉంది. ఈ రాశులవారు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఏ కొద్ది ప్రయత్నం చేపట్టినా విజయం సిద్ధిస్తుంది.

TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Dec 23, 2025 | 7:20 PM

Share
మేషం: రాశ్యధిపతి కుజుడు కొత్త సంవత్సరమంతా పూర్తిగా అనుకూలంగా ఉండబోతున్నందువల్ల ఈ రాశివారు ప్రభుత్వ ఉన్నత స్థాయి ఉద్యోగాలకు సంబంధించిన పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో తప్పకుండా ఘన విజయాలు సాధించడం జరుగుతుంది. బుధుడు మార్చి నుంచి, గురువు జూన్ నుంచి అనుకూలంగా మారుతున్నందువల్ల బ్యాంకులు, ఆర్థిక సంస్థల్లో ఉద్యోగాలకు ప్రయత్నించడం కూడా మంచిది. వీరికి సొంత ఊర్లో ప్రభుత్వ ఉద్యోగం లభించే అవకాశం ఎక్కువగా ఉంది.

1 / 6
కర్కాటకం: ఈ రాశికి జనవరి 15 నుంచి కుజ, రవులు అనుకూలంగా మారడం వల్ల ఈ రాశివారు ఆ సమయంలో ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రయత్నించడం మంచిది. ఎటువంటి పోటీ పరీక్షలు, రాత పరీక్షల్లోనైనా వీరు నెగ్గే అవకాశం ఉంది. జూన్ నుంచి గురువు ఇదే రాశిలో ఉచ్ఛపడుతున్నందు వల్ల ఈ రాశివారికి ప్రభుత్వంలో ఉన్నత పదవులు లభించే అవకాశం ఉంది. బాగా దూర ప్రాంతంలో వీరు ప్రభుత్వ ఉద్యోగంలో చేరడానికి అవకాశం ఉంది. ప్రభుత్వం నుంచి ఆశించిన గుర్తింపు లభిస్తుంది.

2 / 6
సింహం: రాశ్యధిపతి రవితో పాటు కుజుడు కూడా జనవరి నుంచి అనుకూలంగా మారడం వల్ల ఈ రాశి వారికి తప్పకుండా ప్రభుత్వ ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ప్రభుత్వంలో గానీ, బ్యాంకుల్లో గానీ ఉన్నత పదవులు లభించే అవకాశం ఉంది. రాత పరీక్షలు, ఇంటర్వ్యూలలో ఘన విజయాలు సాధిస్తారు. కొద్ది ప్రయత్నంతో జూన్ లోపు వీరి కల సాకారం అవుతుంది. సొంత ఊర్లో వీరికి ప్రభుత్వ ఉద్యోగం లభించే అవకాశం ఉంది. గురువు అనుకూలత వల్ల వీరికి కోరిక నెరవేరుతుంది.

3 / 6
వృశ్చికం: రాశ్యధిపతి కుజుడు ఉచ్ఛ, మిత్ర క్షేత్రాలలో సంచారం చేయడం, రవి కూడా అనుకూల స్థానాల్లో ప్రవేశించడం వల్ల ప్రభుత్వ ఉద్యోగానికి ఈ రాశివారికి బాగా అవకాశం ఉంది. ఈ రాశివారికి కొద్ది ప్రయత్నంతో మే లోపు ఆశించిన ప్రభుత్వ ఉద్యోగం లభించడం జరుగుతుంది. జూన్ నుంచి గురువు కూడా ఉచ్ఛపడుతున్నందువల్ల వీరు ప్రభుత్వ ఉన్నతోద్యోగులకు సంబంధించిన రాత పరీక్షలు, ఇంటర్వ్యూలకు తయారు కావడం మంచిది. తప్పకుండా వీరి కల, కోరిక నెరవేరుతాయి.

4 / 6
ధనుస్సు: ఈ రాశివారికి రవి, కుజులే కాక, గురువు కూడా బాగా అనుకూలంగా ఉన్నందువల్ల కొత్త సంవత్సరంలో ఆశించిన ప్రభుత్వ ఉద్యోగం లభించే అవకాశం ఉంది. బ్యాంకు ఉద్యోగాలకు కూడా బాగా అవకాశం ఉంది. కొద్ది ప్రయత్నంతో ఈ రాశివారు పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో ఘన విజయాలు సాధించడానికి గురువు తోడ్పడడం జరుగుతుంది. ముఖ్యంగా వీరు జూన్ లోపు ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రయత్నించడం మంచిది. వీరికి ఉన్నత పదవులకు కూడా బాగా అవకాశం ఉంది.

5 / 6
కుంభం: ప్రభుత్వ ఉద్యోగాలకే కాక, అధికారానికి కూడా కారకులైన కుజ, రవి గ్రహాలు ఫిబ్రవరి నుంచి ఈ రాశి మీద నుంచి సంచారం చేస్తున్నందువల్ల కొద్ది ప్రయత్నంతో వీరికి ప్రభుత్వ ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పోటీ పరీక్షలు, రాత పరీక్షలు, ఇంటర్వ్యూలలో వీరు తప్పకుండా ఘన విజయాలు సాధిస్తారు. గురు బలం కూడా తోడవుతున్నందువల్ల వీరికి ఉన్నత పదవులు, భారీ జీత భత్యాలు లభించే అవకాశం కూడా ఉంది. సొంత ఊర్లో ప్రభుత్వ ఉద్యోగం లభించడం జరుగుతుంది.

6 / 6
మెగాస్టార్ చిరంజీవి సినిమాలో 1000 కోట్ల సినిమా హీరోయిన్

సూర్య మాస్టర్ ప్లాన్.. సంజూ కెరీర్‌కు ఎండ్ కార్డ్ పడినట్లేనా ?

బంగారు నగలపై GST ఎంత? గోల్డ్ ధరల పతనానికి కారణమేంటి?

4 ఏళ్ల తర్వాత కొత్త సినిమా.. టీజర్ అదిరిందిగా..

వెండి బ్రాస్లెట్.. ఏ రాశులకు శుభం, ఎవరికి అశుభం.? ఇది తెలుసుకోండి

ఎమ్మెల్యే శ్రీధర్ ఎపిసోడ్‌లో ఊహించని ట్విస్ట్‌.. మరో వీడియో

ఒక కిలో బరువు తగ్గడానికి ఎన్ని అడుగులు నడవాలి..? ఈ లెక్కలు..

యూవీ, కోహ్లీ రికార్డులను సూర్య భాయ్ సేన ఈ సారి బ్రేక్ చేస్తుందా

ఇక హైస్పీడ్ రైల్లో 2 గంటల్లో బెంగళూరుకు
ఇక హైస్పీడ్ రైల్లో 2 గంటల్లో బెంగళూరుకు
లంచ్ బాక్స్ పట్టుకొని స్కూల్‌కి బయలుదేరిన చిన్నారి.. కట్ చేస్తే..