మీ జ్ఞాపకశక్తిని రెట్టింపు చేసే పల్లీలు.. ఎలా తీసుకోవాలంటే?
25 December 2025
TV9 Telugu
TV9 Telugu
శీతాకాలంలో వేరుశనలు అదేనండీ పల్లీలతో రకరకాల వంటకాలు తయారు చేసుకుని తినడం చాలా మందికి అలవాటు
TV9 Telugu
ముఖ్యంగా వీటిని తినడం వల్ల చలి నుంచి ఉపశమనం కలుగుతుంది. ముఖ్యంగా వీటిల్లో మొక్కల ఆధారిత ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది
TV9 Telugu
నెదర్లాండ్స్‌లోని మాస్ట్రిక్ట్ యూనివర్సిటీ మెడికల్ సెంటర్‌లో నిర్వహించిన ఓ అధ్యయనం ప్రకారం వేరుశెనగలు తినడం వల్ల మెదడుకు రక్త ప్రసరణ మెరుగుపడుతుందని తేలింది
TV9 Telugu
పైగా జ్ఞాపకశక్తికి కూడా పల్లీలు దోహదపడతాయని పేర్కొంది. శీతాకాలంలోనేకాదు ప్రతి సీజన్‌లో ఆహారంలో వేరుశెనగలను చేర్చుకోవడం లేదా పీనట్ బట్టర్ తయారు చేసుకుని సేవించడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది
TV9 Telugu
అయితే దీన్ని మార్కెట్ నుంచి కొనడానికి బదులుగా ఇంట్లో తయారు చేసుకోవడం మంచిది. ఎందుకంటే ప్యాక్ చేసిన పీనట్ బట్టర్‌లో ప్రిజర్వేటివ్‌లు, నూనెలు ఉంటాయి
TV9 Telugu
అలాగే సలాడ్లు, సూప్ లకు క్రంచ్ జోడించడానికి కూరల రుచిని పెంచడానికి వేరుశెనగలను ఉపయోగించవచ్చు. అలాగే వేరుశెనగ చట్నీగా కూడా తయారు చేసుకుని తినవచ్చు
TV9 Telugu
నానబెట్టిన వేరుశనగలను తినడం వల్ల సులభంగా జీర్ణం అవుతాయి. ఆమ్లత్వం, ఉబ్బరం వంటి సమస్యలను నివారిస్తుంది. అలాగే వేరుశనగ మొలకలు కూడా మంచి ఎంపిక
TV9 Telugu
వేరుశనగలను కూడా మొలకెత్తించి తినవచ్చు. వాటితో పాటు శనగలు, పెసలను కూడా నానబెట్టి మొలకలు కట్టి తీసుకోవడం వల్ల ప్రోటీన్ అధికంగా శరీరానికి అందుతుంది