AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Puri Jagannadh: పూరి మైండ్ సెట్ ఇదే భయ్యా.. పడిలేచిన కెరటం.. వందకోట్లు పోయినా..

డైరెక్టర్ పూరి జగన్నాథ్.. సౌత్ ఇండస్ట్రీలో చాలా స్పెషల్. పూరి సినిమాలు అంటే యూత్‏లో యమ క్రేజ్ ఉంటుంది. కేవలం చిత్రాలే కాదు.. పూరి చెప్పే మాటలకు సైతం సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. పూరి తన సినిమాల్లో చెప్పే డైలాగ్స్, మోటివేషన్ కోట్స్ నిత్యం సోషల్ మీడియాలో వైరలవుతుంటాయి.

Puri Jagannadh: పూరి మైండ్ సెట్ ఇదే భయ్యా.. పడిలేచిన కెరటం.. వందకోట్లు పోయినా..
Puri Jagannadh
Rajitha Chanti
|

Updated on: Dec 15, 2024 | 10:11 AM

Share

డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుసగా సినిమాలు చేస్తూ బాక్సాఫీస్ షేక్ చేశాడు. అప్పట్లో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకున్న స్టార్ డైరెక్టర్. ఆయన సినిమాల స్పీడ్ చూసి తెలుగు సినీపరిశ్రమలోని టాప్ డైరెక్టర్స్ సైతం ఆశ్చర్యపోయేవారు. ఎంతటి పెద్ద హీరోలతో సినిమాలు చేసినా మూడు నాలుగు నెలల్లోనే పూర్తి చేసి అడియన్స్ ముందుకు తీసుకువచ్చేవారు పూరి. సినిమాల బడ్జెట్ తక్కువ.. అయినా థియేటర్లలో కలెక్షన్స్ మాత్రం ఓ రేంజ్ వచ్చి నిర్మాతలకు లాభాల పండించేవి. ఎంతో మంది స్టార్ హీరో కెరీర్ మలుపు తిప్పిన డైరెక్టర్ పూరి. ఇడియట్, పోకిరి వంటి చిత్రాలతో రికార్డ్స్ సృష్టించారు. కానీ కొన్నాళ్లుగా పూరి తెరకెక్కించిన సినిమాలు అంతగా ఆకట్టుకోవడం లేదు. తక్కువ బడ్జెట్ తో సినిమాలు చేసినా అంతగా వసూళ్లు రాబట్టడం లేదు. ఇప్పుడు పూరి డైరెక్ట్ చేసిన సినిమాలు అంటే యూత్ ఎక్కువగా కనెక్ట్ కావడం లేదు. ప్రస్తుతం సినిమాలు కాకుండా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు.

కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్న పూరి.. నిత్యం జనాలకు ఏదోక విషయంపై అవగాహన కల్పిస్తుంటారు. పూరి మ్యూజింగ్స్ పేరుతో ఆయన వివిధ అంశాలపై మాట్లాడుతుంటారు. అయితే తాజాగా పూరికి సంబంధించిన ఓ వీడియోస్ ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది. అందులో పూరి చెప్పిన మాటలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. స్టార్ డైరెక్టర్ గా మంచి ఫాంలో ఉన్న సమయంలోనే తన స్నేహితులను నమ్మి కొన్ని వందల కోట్లు కోల్పోయారు పూరి. అప్పట్లో తన ఆస్తులను పోగొట్టుకుని దీనస్థితిలోకి వచ్చారు. కానీ అందుకు కారణమైన స్నేహితుల గురించి పూరి చెప్పిన మాటలు విని దేవుడివి అన్న అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

గతంలో అలీతో సరదగా షోలో పాల్గొన్నారు డైరెక్టర్ పూరి. ఆ వీడియోలో.. నీ కెరియర్‎లో ఎంత పోగొట్టుకున్నావ్ అని అలీ అడగ్గా.. దాదాపు వంద కోట్లకు పైగానే .. నేను సంపాదించినంత డబ్బు ఎవరూ సంపాదించలేదు ఒక డైరెక్టర్ గా అని ఆన్సర్ ఇచ్చారు పూరి.

అలీ.. ఎవరైతే మోసం చేశారో వాళ్లు మళ్లీ ఎదురైతే ఏం చేస్తారు ? డైరెక్టర్ పూరి.. ‘నేను ఏరైజ్ చేస్తాను. నాకు వాళ్లు ఉన్నట్లే తెలియదు. అసలు పట్టించుకోను’ అలీ.. ప్రపంచాన్ని ఏదో శక్తి నడిపిస్తుందని నమ్ముతారు. ఆ శక్తి దేవుడని ఎందుకు నమ్మరు..? డైరెక్టర్ పూరి.. ‘దేవుడు ఉన్నాడని నమ్ముతాను. కానీ రోజూ మన జీవితంలో ఏం జరుగుతుంది అనే యెదవ ప్రోగ్రామ్స్ పెట్టుకోడని నేను నమ్ముతా. దేవుడనే వాడు చాలా పెద్దోడు. మన గురించి ఆలోచించంత ఉండదని నమ్ముతాను. అంతేకానీ దేవుడు లేడు అని చెప్పను. దేవుడి గురించి ఆలోచించే శక్తి మనకు లేదనుకుంటాను’.

ఇప్పుడు డైరెక్టర్ పూరికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుండగా.. నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. మనిషి రూపంలో ఉన్న దేవుడివి అన్న.. మై ఫేవరేట్ డైరెక్టర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

View this post on Instagram

A post shared by @sadaadootha

ఇది చదవండి : Bigg Boss 8 Telugu: ముగిసిన ఓటింగ్.. బిగ్‏బాస్ విన్నర్ అతడేనా.. ఊహించని రిజల్ట్స్..

Tollywood: ఏందీ గురూ.. ఈ హీరోయిన్ ఇట్టా మారిపోయింది.. అప్పుడు పద్దతిగా.. ఇప్పుడు గ్లామర్ క్వీన్‏గా..

Tollywood: ప్రియుడితో పెళ్లి.. ఐదు నెలలకే ప్రెగ్నెన్సీ.. ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన హీరోయిన్..

Tollywood: ఈ అమ్మాయి గాత్రానికీ ఫిదా అవ్వాల్సిందే.. హీరోయిన్స్‏ను మించిన అందం.. ఎవరంటే..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.